యాప్నగరం

‘దేవత’ నవంబర్ 27 ఎపిసోడ్: ఊహించని మలుపు.. సత్య కంటబడిన రుక్మిణీ.. ‘అక్కా నువ్వు బతికే ఉన్నావ్’ అంటూ ఎమోషనల్

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘దేవత’ సీరియల్.. నేడు(2021 నవంబర్ 27)న 400 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. devatha serial today november 27 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 27 Nov 2021, 2:17 pm
400వ ఎపిసోడ్‌ హైలైట్స్..
Samayam Telugu ‘దేవత’ నవంబర్ 27 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Devatha november 27 episode


దేవుడమ్మ రాధని రుక్మిణీగా చూసినప్పటి నుంచి కథ ఉత్కంఠగా మారింది. అదే విషయం తెలిసిన సత్య.. రుక్మిణీ ఫొటో చేతిలోకి తీసుకుని ఎమోషనల్‌ అవుతుంది. అదే సమయంలో అనుకోకుండా ఫొటో కిందపడి ఫ్రేమ్‌ పగిలిపోవడంతో.. దాన్ని కట్టించుకోవడానికి ఓ ఫొటో స్టూడియోకి వెళ్లడం, అంతకు 2 నిమిషాల ముందే.. రాధ, దేవి, చిన్మయ్‌లను తీసుకుని అదే ఫొటో షాప్‌లో వాళ్ల మొత్తం ఫ్యామిలీ ఫొటో గ్రూప్‌ ఫొటో పెద్దది కట్టించుకుని వెళ్తారు.

అయితే అదే షాప్‌కి సత్య వచ్చి రుక్మిణి ఫొటో ఆ వ్యక్తికే ఇవ్వడంతో ‘ఈమె ఎవరు మేడమ్‌.. మీకు ఏం అవుతారు?’ అని అడుగుతాడు. ‘మా అక్క’ అని సత్య సమాధానం ఇవ్వడంతో.. ‘మీ అక్క గారి ఫ్యామిలీచాలా బాగుంది మేడమ్‌.. ఇప్పుడే పెద్ద గ్రూప్‌ ఫొటో చేయించుకుని పట్టుకుని వెళ్లారు..’ అంటాడు ఆ షాప్‌ వాడు. వెంటనే సత్య ఆనందంతో.. ‘నిజమేచెబుతున్నారా’ అంటే.. 2 నిమిషాలైదమ్మా వాళ్లు వెళ్లి అంటాడు. దాంతో సత్య బయటికి పరుగుతీస్తుంది. అంతా వెతుకుతుంది. సరిగ్గా దేవిని, చిన్మయ్‌ని కారు ఎక్కించి.. తను కారు ఎక్కుతుండగా.. సత్య రుక్మిణీని చూసేస్తుంది. ‘అక్కా అక్కా’ అంటూ పరుగుతీస్తుంది.

అయితే రాధ కారు ఎక్కి వెళ్లిపోవడంతో సత్య రాధని పట్టుకోలేదు. సీన్‌ కట్‌ చేస్తే ఫొటో పట్టుకుని ఇంటికి వెళ్లిన రాధ.. ఆదిత్యకు నిజం చెబితే.. ఆలోచనలో పడిపోతాడనే భయంతో చెప్పకుండా ఆగిపోతుంది. ఇక హాల్లో ఉన్న రుక్మిణీ ఫొటో దగ్గరకు వెళ్లి ఫొటోకి ఉన్న దండ తీసేసి ఎమోషనల్‌ అవుతుంది. అక్క బతికే ఉందని చిన్న అత్తగారికి నమ్మకం చెబుతుంది.

మరోవైపు రాధ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్లిన తర్వాత ఆ ఫొటోని మాధవకు ఇచ్చి.. ‘మీరు చెప్పినట్లే కట్టించాను’ అంటూ ఇస్తుంది. అందులో రామ్మూర్తి, జానకి, ఇటువైపు దేవి, రాధ, అటువైపు మాధవ, చిన్మయ్‌లు ఉంటారు. ఆ పెద్ద ఫొటోని రాధ లోపలికి వెళ్లగానే హాల్లో తగిలిస్తాడు మాధవ. ‘విషయం ఏంటి?’ అని రామ్మూర్తి, జానకి అడగడంతో.. ‘రాధ ఈ ఇంటి మనిషే అని ఈ ఫొటోని చూసినప్పుడైనా తనకి అర్థం కావాలని ఇలా ఫొటో హాల్లో తగిలిస్తున్నా’ అని సమాధానం ఇస్తాడు మాధవ. మొత్తానికి రుక్మిణి బతికే ఉందనే విషయం సత్యకు తెలిసిపోయింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! devatha కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.