యాప్నగరం

యాంకర్లపై గాలి వార్తలు.. ఏమిరా బాలరాజు?

టాలీవుడ్‌లో గాసిప్‌లకు కొరత లేదు.. రాసుకున్నోళ్లకు రాసుకున్నంత అన్నట్టుగా కొంతమంది సినీ, టీవీ ప్రముఖులు ఈ గాసిప్స్‌కి ముడిసరుకుగా ఉంటే.. మరికొన్ని క్లిక్స్ క్రియేటివ్ గాసిప్స్ ఉంటాయి. ఆ కోవలోకి వచ్చేది ఈ కొత్త గాసిప్.

Samayam Telugu 14 Feb 2022, 12:40 pm
గ్లామర్ ఫీల్డ్‌లో సినిమా వాళ్ల తరువాత మంచి క్రేజ్ టీవీ వాళ్లకు ఉంటుంది. ముఖ్యంగా యాంకర్స్‌కి సినిమా వాళ్లతో పోటీగా క్రేజ్ ఉంటుంది. కాస్త క్లిక్ అయ్యారంటే.. సినిమా వాళ్ల రెమ్యూనరేషన్‌తో సమానంగా యాంకర్ సంపాదన ఉంటుంది. బుల్లితెరపై యాంకర్ సుమ, అనసూయ, ఝాన్సీ, శ్రీముఖి, రష్మి, ఇలా చాలా మంది యాంకర్స్ యాంకర్స్ బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు.
Samayam Telugu Telugu Anchors
తెలుగు యాంకర్స్


Read Also: సుధీర్-విష్ణుప్రియ నైట్ పార్టీ.. ఫుల్లుగా డాంగ్.. డాంగ్!

అయితే సినిమా వాళ్లపై వచ్చినట్టుగానే బుల్లితెర యాంకర్స్‌పైనా రూమర్స్‌కి కొదువే లేదు. ఈ రూమర్స్ విషయంలో యాంకర్ అనసూయ, రష్మి, శ్రీముఖిలు ముందు వరసలో ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. రీసెంట్‌గా బుల్లితెరను, సినిమా ఫంక్షన్లను ఏలుతున్న సీనియర్ యాంకర్‌పై ఓ పెద్ద రూమర్ హల్ చల్ చేసింది. ఆమెకు భర్తతో విభేదాల కారణంగా విడిపోతుందని.. ప్రస్తుతం ఆమె వేరే ఫ్లాట్‌లో ఒంటరిగానే ఉంటుందంటూ రూమర్స్ పుట్టించారు. అయితే తరువాత ఆమె భర్తతో పాటు ఓ సినిమా ఈవెంట్‌లో సందడి చేసింది. ఆ సినిమాలో అతను విలన్‌గా నటించగా.. అదే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించారారు ఆ పాపులర్ యాంకర్.. దీంతో ఆ వార్త గాలి వార్తే అని తేలింది.

Read Also: ‘వరల్డ్ ఫేమస్ లవర్’ దేవరకొండకి.. ఈ ఐదే అండదండా

ఇక రీసెంట్ మరో గాసిప్ పుట్టించారు. ఈసారి ఏకంగా ఓ స్టార్ దర్శకుడితో యాంకర్ ఎఫైర్ అంటూ వార్త వండేశారు. పేరు ఊరు చెప్పకుండా సేఫ్‌గా వార్త వండుకుని సోషల్ మీడియాలో వదిలిపెట్టేశారు. ఈ గాలి వార్త సారాంశం ఏంటంటే.. పలానా యాంకర్ అట.. ఓ పెళ్లైన కుర్ర దర్శకుడిగా ఎఫైర్ పెట్టుకుందట. అంతే కాదు అతన్ని తన భార్యకు దూరం చేస్తూ రాసలీలలు సాగించేస్తుందట. దీంతో సదరు దర్శకుడుకి భార్యతో గట్టిగానే గొడవలు జరగడంతో ఈ ఎఫైర్ కథ పోలీస్ స్టేషన్‌కు చేరడం.. పోలీసులు ఆ యాంకర్‌‌కి క్లాస్ పీకడం.. ఆమె ఎవరికీ కనిపించకుండా పోవడం లాంటివి జరిగిపోయాయట.

అయితే ఆ భర్తను వదిలేస్తుందని రాసిన వార్తలో కాని.. కొత్తగా వేరే ఆమె భర్తతో ఎఫైర్ పెట్టుకుందనే వార్తలో కాని పేరు ఊరు చెప్పకుండా గాసిప్స్ ఊపిరి పోస్తూ గాలి వార్తల్ని వైరల్ చేస్తున్నారు గాసిప్ రాయుళ్లు. ప్రస్తుతం ఈ ఇద్దరు యాంకర్స్‌కి సంబంధించిన గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగానే ఆ యాంకర్ భర్తను వదిలేస్తుందనే సమాచారం.. ఈ యాంకర్ డైరెక్టర్‌తో ఎఫైర్ పెట్టుకుందనే సమచారం అంత పగడ్బందీగా ఉంటే పేర్లు చెప్పొచ్చుగా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.