యాప్నగరం

Karthika Deepam Serial ట్విస్ట్: ద్యావుడా.. వంటలక్క మళ్లీ శ్రీరామ్ నగర్ బస్తీకా? ఓయమ్మ బడవా.. ఇదేందయ్యా ఇది?

ఏంటీ మళ్లీ శ్రీరామ్ నగర్ బస్తీకా? అక్కడ వంటలక్క.. ఇక్కడ డాక్టర్ బాబునా..? అసలు ఎటుపోతుంది ఈ కార్తీకదీపం.. టాప్ రేటింగ్‌లో మార్పు కనిపిస్తున్నా.. సీరియల్‌లో మార్పు రావట్లేదుగా..? రేపటి ట్విస్ట్ అందుకు ఉదాహరణంగా మారింది. ఆ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 12 Oct 2021, 8:13 am
ఇప్పుడిప్పుడే కష్టాలు తీరి.. అత్తింట కార్తీక్ భార్యగా గుర్తింపు తెచ్చుకున్న వంటలక్క జీవితంపై తెలుగు ప్రేక్షకులకు జాలి ఉన్న మాట నిజమే కానీ.. ఆ ఎమోషనల్‌ని ఇంకా ఇంకా ఎందుకు చెడగొడుతున్నారా? ఇప్పటిదాకా జైలు లోంచే మోనిత ప్లాన్స్ వేయడం, విషయం పిల్లలకు తెలియడం.. ఇలా ట్విస్ట్‌లతో సాగుతున్న కథనాన్ని.. మళ్లీ బస్తీకి లాక్కెల్లాల్సిన అవసరం ఏంటో అర్థం కావట్లేదు. అసలు వంటలక్క అత్తింటి నుంచి అద్దెంటికి పలుమార్లు తిరగడం తెలిసిన కథే.. పైగా ఇప్పటికే ‘చూసిన ఎమోషన్సే.. మళ్లీ మళ్లీ చూస్తుంటే.. కామెడిగా ఉంటోద’నే విమర్శలు వస్తూనే ఉన్నాయి. పైగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కార్తీకదీపం.. క్రమంగా రేటింగ్‌ పడుతోందనే ఈ తరుణంలో ఈ ట్విస్ట్ ఇవ్వడంతో అభిమానులను పెదవి విరిచేలా చేస్తోంది. అసలు ఏముంది రేపటి ట్విస్ట్‌లో?
Samayam Telugu ‘కార్తీకదీపం’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)
Karthika Deepam Serial


ప్రోమో హైలైట్స్..
కార్తీక్ హిమని నేటి కథనంలో ప్రాధేయపడటం చూడనే చూశాం. అయితే హిమ కరగలేదు. దీప, హిమని బుజ్జగించే క్రమంలో డైనింగ్ టేబుల్ దగ్గర.. ‘హిమా ఏంటమ్మా నువ్వు? నాన్న తప్పు..’ అంటూ ఏదో చెప్పబోతుంది దీప. ‘చెయ్యలేదంటావ్ కదమ్మా.. అన్నీ తెలిసి సైలెంట్‌గా ఎందుకున్నావమ్మా..?’ అంటూ అరుస్తుంది హిమ. ‘తినమ్మా..’ అని ప్లేట్ పెడితే దాన్ని కిందకు తోసేస్తుంది హిమ.. ప్టేట్ ముక్కలు అయిపోతుంది. ‘ఈ ఇల్లు నాకు నచ్చడంలేదమ్మా.. మనం బస్తీకే వెళ్దామమ్మా..’ అంటుంది హిమ. ఇక సీన్ కట్ చేస్తే.. హిమ ఇలా అంటుందని.. సౌందర్య,ఆదిత్యల ముందు కార్తీక్‌కి చెప్పిన దీప.. ‘హిమని నొప్పించలేకపోతున్నాను..’ అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ.. అంటే వంటలక్క హిమ మాట ప్రకారం బస్తీకి వెళ్లడానికి సిద్ధమైనట్లే కనబడుతుంది. అది విన్న కార్తీక్ అయితే చాలా ఎమోషనల్ అవుతాడు.

‘ఏంటి మమ్మీ ఇది? తను నా మొహం చూడను అనేంత కోపమా నా మీదా?’ అంటూ కార్తీక్ కుమిలి కుమిలి ఏడుస్తుంటే.. సౌందర్య, దీప, ఆదిత్య కార్తీక్‌ని జాలిగా చూస్తుంటారు. మొత్తానికి హిమ కోరిక మేరకు.. దీప బస్తీకి వెళ్తే మాత్రం.. అభిమానుల నుంచి మరింత వ్యతిరేకత తప్పదు. పిల్లలకు నిజం చెప్పకుండా కథను సాగదియ్యడంపైనే విసుగు చెందారు చాలా మంది ప్రేక్షకులు. ఈ తరుణంలో ఇలాంటి ట్విస్ట్ మరింత మంది అభిమానుల్ని దూరం చెయ్యడం పక్కా.. చూద్దాం ఏం జరగనుందో..
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.