యాప్నగరం

Jabardasth : హైపర్ ఆది.. కరోనా వైరస్‌తో కరాటే చేస్తాడట.. బతికుంటే!

జబర్దస్త్ పంచ్‌ల్లో.. ఆటో పంచ్‌లు, రివర్స్ పంచ్‌లు ఓ ఎత్తైతే.. హైపర్ ఆది పంచ్‌లు మరో ఎత్తు. ఆది పంచ్‌లు వింటూ.. నవ్వుడానికి కాస్త గ్యాప్ కావాలంటారు కామెడీ లవర్స్. ఆది స్కిట్ మొదలైందంటే.. పొట్ట చెక్కలు అయిపోతున్నా.. వరస పంచ్‌లు పేలుతూనే ఉంటాయి. రాబోయే షోలో కూడా అదే జరగనుంది. అయితే ప్రతి సారి ఆ తాడు ఈ తాడు పట్టుకుని హీరోలా ఎంట్రీ ఇచ్చే ఆది... ఈ సారి ఉరితాడు పట్టుకుని కామెడీ చెయ్యడానికి సిద్ధమయ్యాడు.

Samayam Telugu 27 Feb 2020, 7:26 pm
జబర్దస్త్ పంచ్‌ల్లో.. ఆటో పంచ్‌లు, రివర్స్ పంచ్‌లు ఓ ఎత్తైతే.. హైపర్ ఆది పంచ్‌లు మరో ఎత్తు. ఆది పంచ్‌లు వింటూ.. నవ్వుడానికి కాస్త గ్యాప్ కావాలంటారు కామెడీ లవర్స్. ఆది స్కిట్ మొదలైందంటే.. పొట్ట చెక్కలు అయిపోతున్నా.. వరస పంచ్‌లు పేలుతూనే ఉంటాయి. రాబోయే షోలో కూడా అదే జరగనుంది. అయితే ప్రతి సారి ఆ తాడు ఈ తాడు పట్టుకుని హీరోలా ఎంట్రీ ఇచ్చే ఆది... ఈ సారి ఉరితాడు పట్టుకుని కామెడీ చెయ్యడానికి సిద్ధమయ్యాడు.
Samayam Telugu hyper aadi hilarious comedy in jabardasth promo
Jabardasth : హైపర్ ఆది.. కరోనా వైరస్‌తో కరాటే చేస్తాడట.. బతికుంటే!


వరుస పంచ్‌లు..

ప్రోమో స్టార్ కావడమే.. అటు ఇద్దరు ఆడవాళ్లు(లేడీ గెటప్‌లో ఉన్న హరి, శాంతి స్వరూప్), ఇటు ఇద్దరు మగవాళ్లు(రాజు, మరో ఆర్టిస్ట్) మధ్యలో హైపర్ ఆది ఉంటారు. అంతా ఉరి వేసుకోవాడానికి సిద్ధంగా ఉంటారు. ఆదిని.. ‘ఏమండీ మీరూ చచ్చిపోదామనే వచ్చారా?’ అని అడుగుతాడు. వెంటనే ఆది.. ‘లేదురా.. ఈ తాడు మెడలో వేసుకుని మేఘాలలో.. అని పాట పాడటానికి వచ్చానురా’ అంటాడు. దాంతో హైపర్ నవ్వులు స్టార్ట్ అవుతాయి. Read Also: అనసూయ రేటు బయటపెట్టిన ఆది.. అన్ని లకారాలే!

డెంగ్యూ వైరస్‌ని మింగలేదు కానీ..

‘బతికుంటే మేము సూపర్ స్టార్స్ అయ్యేవాళ్లం సార్..’ అన్న మరో ఆర్టిస్ట్ మాటలకు ఆది స్పందిస్తూ.. ‘డెంగ్యూ వైరస్‌ని మింగలేదు కానీ.. కరోనా వైరస్‌తో కరాటీ చేస్తానన్నాడట నీలాంటోడు’ అంటూ పంచ్ వేస్తాడు. ఇంతలో లేడీ గెటప్‌లో ఉన్న శాంతి స్వరూప్.. ‘మేము చచ్చిపోతే.. రేపు పేపర్‌లో ఆత్మహత్యలు చేసుకున్న అందగత్తెలు అనేగా వస్తుంది?’ అంటుంది. వెంటనే ఆది.. ‘అలా రాదండీ.. ఆత్మహత్య చేసుకున్న జంట.. ఆడోమగో తెలీదంట’ అంటూ ఆది పంచ్ వెయ్యడంతో జడ్జ్ రోజా పడిపడి నవ్వుతారు.

నాతో మామూలుగా ఉండదు..

‘భగవంతుడా.. ఈ అందం అడవి కాచిన వెన్నెల కావాల్సిందేనా?’ అంటుంది శాంతి. వెంటనే ఆది.. ‘దేవుడా ఈ చెప్పు తెగిపోవాల్సిందేనా? మీకు లేనివి చెప్పారంటే నాకు ఉన్నవన్నీ తీసి కొడతా’ అంటూ పంచ్ వేస్తాడు ఆది. మళ్లీ ఆది మాట్లాడుతూ.. ‘నాతో మామూలుగా ఉండదు.. రెండు సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చా’ అంటాడు. ‘రెండు సంవత్సరాలా? ఎందుకెళ్లొచ్చారండీ?’ అని అడుగుతాడు రాజు.

అల్టిమేట్ కామెడీ..

‘భోగి మంట వేశానని జైల్‌కి పంపించారు’ అని సమాధానం ఇస్తాడు ఆది. ‘ఏంటీ.. భోగి మంట వేస్తేనే జైల్‌కి పంపేస్తారా?’ అంటాడు ఆశ్చర్యంగా రాజు. ‘రైలు బోగి మంటరా.. పంపించరా?’ అని ఆది చెప్పడంతో జబర్దస్త్ నవ్వులు ఊపందుకున్నాయి. ఇంతలో ‘జీవితమంటే ఓ సవారీ.. మంచానికి ఉంటుంది నవ్వారి..’ అంటూ పిచ్చి కవిత్వంతో ఆత్మహత్య చేసుకోకుండా ఆపడానికి వచ్చిన వ్యక్తికి కూడా పంచ్‌లు వేశాడు ఆది. ‘అప్పుడెప్పుడో పట్టుబడ్డాడు ఎన్‌డీ తివారీ... నేనిక్కడ తన్తే.. నువ్వు పరారీ’ అంటూ నవ్వులు పుట్టిస్తాడు.

ఏరా చెప్పలేదా?

రాజుని ఓ అమ్మాయి ‘వీడి ముఖానికి టూ వీలర్ బండైనా ఉందా?’ అంటూ తిడుతుంటే.. ‘వీడికి ఫోర్ వీలర్ బండి ఉంది తెలుసా..’ అంటూనే.. ‘ఏరా చెప్పలేదా? ఆంబులెన్స్ ఉందని చెప్పలేదా?’ అంటూ కామెడీ చేస్తాడు ఆది. మొత్తానికీ నెక్ట్స్ వారం రాబోతున్న షోలో ఆది స్కిట్ దుమ్మురేపనుంది. మిగిలిన రాకెట్ రాఘవ, వెంకీ మంకీ స్కిట్స్‌ కూడా చాలా ఫన్నీగా ఉండనున్నాయి. ఈ ప్రోమో మీద మీరు కూడా ఓ లుక్ వెయ్యండి.
కడుపు చెక్కలు చేసే.. ఈ కామెడీ ప్రోమో కోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.