యాప్నగరం

మనంత ద్రోహి ఇంకొకడు ఉండడు.. పురుగును చూసినట్టు చూస్తారు: కరోనాపై బిత్తిరి సత్తి

తనకు కరోనా వైరస్ సోకినట్టు ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటుడు బిత్తిరి సత్తి ఇప్పటికే వెల్లడించారు. అయితే, తనకు ఎలాంటి లక్షణాలు లేవని, బాగానే ఉన్నానని ఆదివారం ఫేస్‌బుక్ లైవ్‌లో చెప్పారు సత్తి.

Samayam Telugu 16 Aug 2020, 11:17 pm
ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, కమెడియన్ బిత్తిరి సత్తికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు బిత్తిరి సత్తి ఇప్పటికే వెల్లడించారు. అయితే, కరోనా లక్షణాలు.. దాని నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ ఆదివారం ఆయన ఫేస్‌బుక్ లైవ్ నిర్వహించారు. తాను ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్టు చెప్పారు. ‘‘ఎట్లొచ్చిందో.. ఏడొచ్చిందో నాకైతే తెల్వదు కానీ.. మొత్తానికి వచ్చింది’’ అంటూ సత్తి తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. తనది స్టాండర్డ్ బాడీ అని, అసలు ఈ కరోనా తనకు సోకదని భావించినట్టు సత్తి చెప్పారు.
Samayam Telugu బిత్తిరి సత్తి
Bithiri Sathi


మన ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకున్నప్పుడు కరోనా లక్షణాలు బయటపడవని.. ఎప్పుడైతే విశ్రాంతి లేకుండా పనిచేస్తామో లేదంటే సమయానికి తినకుండా ఇష్టమొచ్చినట్టు ఉంటామో అలాంటి సందర్భాల్లో కరోనా మనపై పైచేయి సాధిస్తుందని సత్తి తెలిపారు. కాబట్టి అందరూ విశ్రాంతి తీసుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని సత్తి సూచించారు. కరోనా సోకినా భయమేమీ అవసరంలేదని, తనకు హాస్పిటల్‌కు వెళ్లాలనే ఆలోచన కూడా రాలేదన్నారు. తనకు పెద్దగా లక్షణాలు ఏమీ లేవని, వీడియో కాల్ ద్వారా డాక్టర్ సలహాలు తీసుకుంటున్నానని సత్తి చెప్పారు.

Also Read: నాన్న ఇంకా లైఫ్ సపోర్ట్‌పైనే.. అందరినీ గుర్తుపడుతున్నారు: ఎస్పీ చరణ్

కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు దాన్ని దాచిపెట్టడం తప్పు అని సత్తి అన్నారు. ‘‘పాజిటివ్ వచ్చినప్పుడు మనకు ఎవరైనా సాయం చేయడం కష్టం. ఎదుటి వాళ్లను ఇబ్బంది ఎందుకు పెట్టాలి. మనకు లేదని అబద్దం చెప్పి ఎదుటివాడికి వచ్చాక మనం సంబరపడకూడదు. మనకు వచ్చిందని నిజంగా చెప్పుకోవాలి. ఎదుటివాడికి వచ్చే వరకు మనం చెప్పకపోతే మనంత ద్రోహి ఇంకొకడు ఉండడు’’ అని సత్తి వెల్లడించారు. అయితే, ఎరికైనా కరోనా సోకితే కొంత మంది వారిని పురుగుని చూసినట్టు చూస్తున్నారని.. అప్పటి వరకు బాగా ఉన్నవాళ్లు కూడా వీడు చాలా డేంజరస్, తాచు పాము అన్నట్టు చూస్తారని అన్నారు.

వీటితో పాటు తనకు కనిపించిన లక్షణాలు, ప్రస్తుతం ఆయన తీసుకుంటోన్న జాగ్రత్తల గురించి ఫేస్‌బుక్ లైవ్‌లో బిత్తిరి సత్తి వెల్లడించారు. ఈ వివరాలు కింది వీడియోలో చూడొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.