యాప్నగరం

Gruhalakshmi Harikrishna: బాలయ్య మనవడే ‘గృహలక్ష్మి’ నటుడు నందు.. బ్యాగ్రౌండ్ ఉన్నా సీరియల్ కష్టాలేనట

Intinti Gruhalakshmi Serial: ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో నందు క్యారెక్టర్ చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది. భార్య ఉండగానే ఎదురింట్లో ప్రేయసితో మకాం పెట్టేసిన క్యారెక్టర్‌లో జీవించేస్తుంటాడు నందు.

Samayam Telugu 28 Jul 2021, 6:33 pm
కార్తీకదీపం సీరియల్ తరువాత టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న సీరియల్ ‘ఇంటింటి గృహలక్ష్మి’.. ఇందులో మెయిన్ లీడ్ కస్తూరి (తులసి) కాగా.. ఆమెకు భర్తగా నటిస్తున్న నందు అలియాస్ హరికృష్ణ తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. లాస్యతో సెకండ్ ఫ్యామిలీ పెట్టేసి.. భార్య తులసితో కయ్యానికి కాలుదువ్వే భర్త పాత్రలో ప్రేక్షకులతో తిట్లు తింటున్న నందగోపాల్ తన పర్సనల్ విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
Samayam Telugu ఇంటింటి గృహలక్ష్మి నందు
intinti gruhalakshmi harikrishna


హరికృష్ణ.. తులసి (కస్తూరి) మాదిరి పక్క రాష్ట్రం నుంచి తెచ్చిన అరువు బాపతు కాదు.. మన తెలుగు వాడే. తెనాలిలో పుట్టిపెరిగాడు.. చదువు మొత్తం చెన్నైలో సాగింది. 2008 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. మొదటిగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కంపెనీ నుంచి వచ్చిన ‘హ్యాపీ డేస్’ అనే సీరియల్‌లో నటించాడు.

ఇక హరికృష్ణకి మంచి బ్యాగ్రౌండ్ ఉంది. పాతతరం నటుడు బాలయ్య గారి మనువడే ఈ హరికృష్ణ. ఆయన ప్రేరణతోనే ఇండస్ట్రీకి వచ్చానని చెప్తున్న హరికృష్ణ.. తన తాత బ్యాగ్రౌండ్‌ని ఉపయోగించుకోకుండా తన స్వయంకృషితోనే ఇక్కడవరకూ వచ్చానని చెప్తున్నారు. హరికృష్ణ మాట్లాడుతూ.. నాకు ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నాసరే.. క్యారెక్టర్స్ కోసం కష్టపడ్డాను.

నాకు బాలయ్య తాత బ్యాగ్రౌండ్ ఉన్నాసరే నేను ఆయన సపోర్ట్ తీసుకోలేదు. మన కష్టంతో మనం పైకి రావాలనేది నా అభిప్రాయం. స్విమ్మింగ్ రాకుండా దిగితే ఎంత ప్రమాదమో యాక్టింగ్ రాకుండా ఈ ఫీల్డ్‌లోకి వస్తే ఏమీ చేయలేం. అందుకే యాక్టింగ్ నేర్చుకోవడానికి కాస్త టైం పట్టింది. సో కష్టపడ్డాను కానీ ఇష్టంగానే కష్టపడ్డా అని చెప్పుకొచ్చారు ‘ఇంటింటి గృహలక్ష్మి’ హరికృష్ణ. ఇక కేవలం సీరియల్స్‌లోనే మాత్రమే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా లవ్ స్టోరీ ఉన్నాయని అంటున్నాడు. అంతేకాదు లాస్యతో అంత చనువుగా ఉండటంతో అతని భార్య రియాక్షన్ ఏంటో కూడా చెప్పాడు.. ఆ ముచ్చట్లు ఈ కింది లింక్‌లో చూసేయండి.

Read Also: నేను లవ్ చేసినోళ్లు వేరే వాళ్లతో జంప్.. లాస్యతో అలా చేసేసరికి మా ఆవిడ.: ‘గృహలక్ష్మి’ నటుడు నందు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.