యాప్నగరం

Gruhalakshmi: ‘ఇంటింటి గృహలక్ష్మి’ షాకింగ్ ట్విస్ట్! ‘అశ్విన్ చనిపోలేదు..’ కథ మొత్తం నడిపించేది లాస్యేనా!’

అశ్విన్ బతికే ఉన్నాడు. చనిపోలేదు. ఎవరో కాావాలనే ప్రేమ్‌ని, సృతిని ఇరికించారు.. ఇదే రేపటి ప్రోమో సారాశం. ప్రేమ్ హత్య కేసులు ఇరుక్కోవడంతో వేడెక్కిన ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ రోజుకో ట్విస్ట్‌తో ఉత్కంఠగా సాగుతోంది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 24 Mar 2021, 9:35 pm
సృతిని కాపాడాలనే ఉద్దేశంతో ప్రేమ్ అశ్విన్ చంపిన కేసు తన మీద వేసుకున్నాడు. అయితే సీన్ మొత్తం తారుమారు అయిపోనుంది. అసలు అశ్విన్ హత్య అంతా డ్రామా అనేది తేలిపోయింది. కావాలనే ఎవరో ప్రేమ్‌ని, సృతిని ఇరికించడానికి ఈ డ్రామా అంతా ఆడినట్లు అర్థమైపోతుంది. నేటి(మార్చి 24) ఎపిసోడ్‌లో తులసి ఆవేదన ఓ వైపు సృతి తులసికి ఫోన్ చేసి జరిగింది చెప్పడం మరో వైపు కథను ఆసక్తిగా మార్చగా.. రేపటి ప్రోమో కథను మరింత ఉత్కంఠగా మార్చేసింది.
Samayam Telugu గృహలక్ష్మి సీరియల్ ఈరోజుది(photo courtesy by star మా and disney+ hotstar)
Intinti Gruhalakshmi Telugu Serial Promo


ప్రోమో హైలైట్స్..
రోహిత్, తులసి, మోహన్ ముగ్గురు కేసు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ‘ఈ కేసులో మనకు తెలియని ఇంకో యాంగిల్ ఏదో ఉంది.. ప్రేమ్ కానీ.. సృతి కానీ అశ్విన్ ముఖాన్ని సరిగా చూడలేదు..’ అని రోహిత్ మోహన్, తులసీలతో అంటుంటే.. ‘ఈ హత్య కేసులో ప్రేమ్ సృతి కాకుండా.. ఇంకెవరిదో హస్తముంది..’ అని మోహన్ మాట్లాడతాడు.

సీన్ కట్ చేస్తే.. ‘సృతి భర్త ఆ అశ్విన్ బాబు ఉన్నాడు కదా.. అతడు చనిపోలేదమ్మా.. అతడు బతికే ఉన్నాడమ్మా..’ అని పని మనిషి రావులమ్మ తులసికి ఫోన్ చేసి చెప్పడంతో తులసి చాలా షాక్ అవుతుంది. అక్కడే ఉన్న మోహన్, రోహిత్‌లు కూడా ఆ విషయం తెలుసుకుని షాక్ అవుతున్నట్లు ప్రోమోలో చూపించారు. అయితే గతంలో కూడా అశ్విన్, లాస్య ఇద్దరూ కలిసి చాలా నాటకాలు ఆడిన సంగతి తెలిసిందే. ఈ కోణంలో ఆలోచిస్తే.. లాస్యే వెనక ఉండి కథ నడిపిస్తుందేమో తరువాయి భాగంలో చూద్దాం.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.