యాప్నగరం

‘ఇంటింటి గృహలక్ష్మి’ మే 14 ఎపిసోడ్: షాకింగ్, మాధవి ఆత్మహత్యాయత్నం.. తులసి కుటుంబానికి మరో సమస్య

మరో ఊహించని మలుపుతో ‘ఇంటింటి గృహలక్ష్మి’ ఉత్కంఠగా మారింది. నేడు 319 ఎపిసోడ్‌‌కి ఎంటర్ అయిన ఈ సీరియల్ హైలైట్స్.. చాాలా రసవత్తరంగా మారింది. మాధవి ఆత్మహత్యాయత్నం చేయడంతో కథ కీలక మలుపు తిరిగింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 15 May 2021, 9:35 am
రోజురోజుకి ఉత్కంఠగా మారుతున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ చాలా ఉత్కంఠగా మారింది.
Samayam Telugu ‘ఇంటింటి గృహలక్ష్మి’ మే 14 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Intinti Gruhalakshmi 14 May episode


319 ఎపిసోడ్‌ హైలైట్స్..
దివ్య తులసికి థాంక్స్ చెబుతుంది. ‘తన మెడిసిన్‌కి సాయం చేసిన ఎక్కువ అమౌంట్ తులసివేనని తెలుసుకుని థాంక్స్ అంటుంది. అయితే విషయం బయటికి చెప్పొద్దని దివ్యతో తులసి అంటుంది. సీన్ కట్ చేస్తే.. అభి ఇంటర్వ్యూకి బయలుదేరుతుంటే.. అంకిత అడ్డుపడుతుంది. దాంతో గొడవ మొదలవుతుంది. దాంతో అభి అంకిత తల్లి గురించి.. ‘మీ మామ్ అన్నీ లెక్కలు అంటుంది. ఆమె మాట వినొద్దు’ అంటూ నోరు జారినట్లుగా మాట్లాడతాడు.

దాంతో అంకిత కోపంగా.. ‘నా వాళ్లని అనడానికి నీకు రైట్స్ లేవు.. ఖాళీగా ఉండే నిన్ను పోషించేదే వాళ్లు’ అంటూ అభి ఇగో దెబ్బతినేలా మాట్లాడుతుంది. దాంతో కొట్టడానికి చేయి లేపుతాడు అభి. సరిగ్గా అప్పుడే అంకిత తల్లి, తండ్రి రావడంతో కొట్టడం ఆగుతాడు కానీ.. వాళ్లని కూడా మాటలు అనేస్తాడు. మామగారిని అయితే.. ‘మీరు అత్తచేతిలో కీలుబొమ్మ’ అని అవమానకరంగా మాట్లాడి అక్కడి నుంచి ఇంటర్వ్యూకి వెళ్లిపోతాడు.

సీన్ కట్ చేస్తే.. తులసికి లాస్య కాల్ చేస్తుంది. ఇద్దరూ మాటకు మాట సమాధానం ఇచ్చుకుంటూ ఛాలెంజ్‌లు చేసుకుంటారు. ఇక దివ్య సంతోషాన్ని చూసి తులసికి కూడా థాంక్స్ చెబుతాడు నందు. ఆ సీన్ అంతా చాలా హ్యాపీగా సాగుతుంది. ఇక కమింగ్ అప్‌లో మాధవి ఉరి పెట్టుకుంటూ ఉంటుంది. అది అద్దంలోంచి నందు చూస్తాడు. తలుపు పగలగొట్టి.. మాధవినీ లాగిపెట్టి కొట్టి బయటికి తీసుకొస్తాడు. ఆరా తీస్తాడు. అందరు నిలబడి మాధవి ఏం చెబుతుందా అని టెన్షన్‌గా చేస్తున్న సమయంలో మాధవి నోరు విప్పుతుంది.

‘ఆయన నాకు విడాకులు ఇస్తానంటున్నారు అన్నయ్యా.. నేను వద్దు అంటున్నారు’ అని చెప్పేసరికి అంతా షాక్ అవుతారు. నిజంగా ఇది ప్రేక్షకులకు ట్విస్టే. ఎందుకంటే మాధవి మోహన్‌లు ఆదర్శ దంపుతుల్లా ఉండేవారు. వాళ్ల ప్రేమానురాగాలను చాలా సార్లు ప్రత్యేకంగా చూపించారు కూడా. ఈ క్రమంలో మోహన్ మాధవికి విడాకులు ఇవ్వడం ఏంటో? మాధవి ఆత్మహత్యాయత్నం ఏంటో తరువాయి భాగంలో చూద్దాం! ‘ఇంటింటి గృహలక్ష్మి’ కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.