యాప్నగరం

‘ఇంటింటి గృహలక్ష్మి’ జనవరి 25 ఎపిసోడ్: నందుకి మరో అవమానం.. తులసిని కాకా పట్టే పనిలో మన హీరో..

‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ రోజుకో ట్విస్ట్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే​ 224 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 225 ఎపిసోడ్‌కి నేడు(2021 జనవరి 25)న ఎంటర్ అయ్యింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 25 Jan 2021, 9:58 am
Samayam Telugu ‘ఇంటింటి గృహలక్ష్మి’ జనవరి 25 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Intinti Gruhalakshmi 25 january episode
‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ రోజుకో ట్విస్ట్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 224 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 225 ఎపిసోడ్‌కి నేడు(2021 జనవరి 25)న ఎంటర్ అయ్యింది.

225 ఎపిసోడ్‌ హైలైట్స్..
‘లాస్య విషయం పెద్దది చెయ్యకు ప్లీజ్.. నేను విడాకులు వాయిదా వెయించడానికి కారణం.. నువ్వే.. విడాకులు రాగానే మనం పెళ్లి చేసుకుందాం అంటావ్. అది నాకు ఇష్టం లేదు. నిజానికి నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు లాస్య.. ఎందుకు అంటే కారణం నాకు కూడా తెలియదు’ అంటూ లాస్యని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు నందు. సీన్ కట్ చేస్తే.. నందు తండ్రి తులసితో.. ‘తులసి వాడిలో మార్పు వస్తోంది. నువ్వు కూడా ఓ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది’ అన్నట్లుగా మాట్లాడటంతో.. తులసి కాస్త నిరుత్సాహంగా మాట్లాడతుంది. ‘మావయ్య ఆయన మనసు ఆయనకి ఏం చెబుతోంది ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. తప్పు ఏదో ఒప్పేదో వేరుచేసి చూడలేకపోతున్నారు.. ఈ సమయంలో ఆయన మససు మీద చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి బయటిపడి ఓ నిర్ణయం తీసుకోవడం ఆయనకి చాలా కష్టం మావయ్యా.. అంత వరకూ మనం వేచి చూడాల్సిందే మావయ్య.. లేదంటే ఆయన మీద ఒత్తిడిపెరిగిపోతుంది’ అంటుంది తులసి.

సీన్ కట్ చేస్తే ప్రేమ్ నృతి దగ్గరకు వెళ్లి.. ‘మామ్ డాడ్ విడాకులు వాయిదా పడ్డాయి’ అని తన సంతోషాన్ని షేర్ చేసుకుంటాడు. ఇక అభికి అంకిత మ్యాకప్ కిట్ తీసుకుని రమ్మనడంతో.. అభి తల్లి దగ్గరకు వెళ్లి డబ్బులు అడుగుతాడు. తులసి ఇస్తుంది. అది చూసిన అంకిత అభితో గొడవ పడుతుంది. ‘ఇలా ఎంతకాలం ఎవరోకొరి మీద ఆధారపడతావ్?’ అని గొడవ పడుతుంది. ఇక నందు ఆఫీస్‌లో తన కింద వాళ్లు సరిగా పనిచెయ్యట్లేదని బాగా తిడతాడు. బాస్ పిలవడంతో లోపలికి వెళ్తే.. వాళ్ల బాస్ నందుతో.. ‘మీరు సరిగా ఉంటే మీ కింద వాళ్లు సరిగా ఉంటారు. ముందు మీరు సరిగా ఉండటానికి ప్రయత్నించండి.. ఈ సారి జాబ్‌ పోతే నేను కూడా ఏం చెయ్యలేను’ అంటాడు. బాధతో బయటికి వచ్చిన నందు.. తన కింద ఎంప్లైస్ ‘నందు లాస్య గురించి, నందు జాబ్ పోవడం గురించి తప్పుగా మాట్లాడుకోవడం విని.. ‘ఇలా ఎవరోకరి మీద ఆధారపడే జాబ్ ఇలానే ఉంటాయి.. ఏది ఏమైనా నా లైఫ్‌ని మార్చుకోవాలి’ అని నిర్ణయించుకుంటాడు.

ఇది ఇలా ఉండగా.. తులసి వంట చేస్తుంటే.. లాస్య అన్నం తినకుండా కోపంగా ఉందని.. అనసూయ తులసిని తిట్టిపోతుంది. దాంతో తులసి లాస్యకు భోజనం తీసుకుని వెళ్తుంది. ‘మనం అనుకున్నది జరగలేదని ఇలా బాధపడుతూ కూర్చోకూడదు. నీకు చెప్పగలిగే స్థాయి నాకు లేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నిన్ను ఇలా చూస్తుంటే చెప్పడం తప్పడం లేదు.. భోజనం మానేసి ఉపవాసాలు ఉండి నందుని సాధిద్దాం అనుకుంటున్నావేమో.. దాని వల్ల నీకు ఎలాంటి మేలు జరగదు. ఆయన తనకు తానుగా జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలి. తనకు తానుగా పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. అంతే కానీ ఆయన మీద అరిచి కానీ ఏమాత్రం మార్చలేం.. నా ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే మా పెళ్లి బంధానికి ఒక అర్థం ఉంది కానీ.. నావైపు మొగ్గుచూపుతున్నారు. నీ ప్రేమ నిజం అయ్యి ఉండి ఏంటే నీ కోరిక తీరేది..’అంటుంది తులసి.

కమింగ్ అప్‌లో..
నందుతో తన బాస్ పర్సనల్‌గా మాట్లాడతాడు. ‘నందు నీకు ఉన్న టాలెంట్‌కి ఈ జాబ్స్ ఎందుకు నందు.. మంచిగా బిజినెస్ పెట్టుకోవచ్చుగా..? నువ్వో 20 లక్షలు తీసుకునిరా.. నేనో 20 లక్షలు పెడతాను. అప్పుడు లోన్ తప్పకుండా వస్తుంది..’ అంటాడు. ఇంటికి చేరుకున్న నందు.. చాటుగా.. తులసి ప్రేమ్‌ల మాటలు వింటాడు. మెషిన్ మీద కూర్చున్న తులసి ప్రేమ్‌తో.. ‘ఇలాంటి మెషిన్స్ ఉంటే చక్కగా మాంచి బిజినెస్ పెట్టుకోవచ్చు రా’ అంటుంది. అది విన్న నందు.. ‘అంటే తులసికీ బిజినెస్ వైపు ఆలోచిస్తుందంటే.. ఆ బిజినెస్ గురించి తనకి చెబితే ఎలా ఉంటుంది?’ అని తులసి దగ్గరకు వెళ్తాడు నందు. బహుశా ఇల్లు తాగట్టల్లో పెట్టి డబ్బు ఇవ్వమని అడుగుతాడేమో..? మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘ఇంటింటి గృహలక్ష్మి’ కొనసాగుతోంది.
Read also: ‘వదినమ్మ’ జనవరి 25 ఎపిసోడ్: సీతామహాలక్ష్మా మజాకా! నిజాలన్నీ బట్టబయలు.. అమృత అసలు భర్త ఇతడే..
Read also: ‘కార్తీకదీపం’ జనవరి 25 ఎపిసోడ్: అంజీ మరో ప్రయత్నం అదుర్స్! మోనితకి షాకిచ్చిన కార్తీక్.. ‘నన్ను ఫూల్‌ని చెయ్యకు’
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.