యాప్నగరం

Intinti Gruhalakshmi సెప్టెంబర్ 7 ఎపిసోడ్: ప్రేమ్-శృతిలను విడగొట్టే భాగ్య ప్లాన్.. తులసి తెగింపు అదుర్స్

రోజురోజుకి ఉత్కంఠగా మారుతున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ నేడు(సెప్టెంబర్ 7)న 409వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. నేటి ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా మారింది. ఆ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 7 Sep 2021, 10:31 am
రోజురోజుకి ఉత్కంఠగా మారుతున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ నేడు(సెప్టెంబర్ 7)న 409వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. నేటి ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా మారింది.
Samayam Telugu ‘ఇంటింటి గృహలక్ష్మి’ సెప్టెంబర్ 7 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Intinti Gruhalakshmi 7 september episode


409 ఎపిసోడ్‌ హైలైట్స్..
ప్రస్తుత పరిస్థితుల్లో నేను అలా మాట్లాడకపోతే.. ఇంత గొప్ప సంబంధం చేజారిపోయే ప్రమాదం ఉంది.. పైగా ప్రేమ్ నా మాట వినడకు అని జీకేకి చెబితే.. నా పరువే పోతుంది. నా మీద నమ్మకం కూడా పోతుంది. కనీసం కొడుకుని కంట్రోల్‌లో పెట్టలేనివాడిగా చూస్తాడు..’ అంటూ లాస్యతో తన వాదన వినిపిస్తాడు నందు. ఇక ప్రేమ్ మనసులో మథనపడుతూ ఉంటే.. తులసి వచ్చి.. ‘శ్రుతి మనసులో ఏం ఉందో తెలియకుండా అందరి ముందు నీ అభిప్రాయం చెబితే.. శ్రుతి ఇబ్బంది పడుతుందనే నిన్ను మీ నాన్న దగ్గర మాట్లాడకుండా చేశాను. టైమ్ అడిగేలా చేశాను.. ఈ లోపు శ్రుతి మనసులో ఏ ముందో నువ్వే తెలుసుకో’ అంటూ సలహా ఇస్తుంది.

లాస్య నందు జీకేతో డీల్ విషయంలో తెగ ఆలోచిస్తూ ఉంటే.. భాగ్య కావాలనే ‘కాశీకి పోతాను రామా హరీ’ అంటూ చిడతలు పట్టుకుని లాస్యని ఉడికిస్తుంది. ‘ఏ మాత్రం తేడా జరిగినా మీ గతి అదోగతే’ అని హెచ్చరిస్తూ.. సలహా కూడా ఇస్తుంది. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ్ శ్రుతి మనసు విప్పి మాట్లాడుకుంటూ మనం ఆపాలి.. ప్రేమ్ మనసులోంచి శ్రుతిని పోగొట్టాలి.. ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యి..’ అంటూ సలహా ఇస్తుంది. దాంతో లాస్య నవ్వుతూ.. ‘మనకి కలపడం కష్టం కానీ విడదియ్యడం ఈజీనే’ అంటుంది.

ఇక తులసి ఆఫీస్‌కి వెళ్లే సరికి ఒక వర్కర్ మోకాలు నొప్పుతో బాధపడుతుంది. దాంతో కుట్టు మెషిన్స్‌కి పవర్ వచ్చేలా చేస్తాను.. వీలైనంత త్వరగా పవర్ వచ్చేలా చేస్తాను అని హామీ ఇస్తుంది. ఇక అదే పని మీద కరెంట్ ఆఫీస్‌కి వెళ్తుంది. మెయిన్ ఆఫీసర్‌తో మాట్లాడుతుంది. ముందు మీరైతే బిల్ కట్టండి.. ఒకవేళ మెషిన్‌లో తేడా ఉంటే.. అంతా చెక్ చేసి ఆరాతీసి.. మిగిలిన డబ్బు తిరిగి ఇచ్చేస్తాం అంతకన్నా మీకు ఏ విధంగానూ సహాయం చెయ్యలేను’ అంటాడు. వెళ్లిపో అమ్మా నన్ను ఇబ్బంది పెట్టకు అని దన్నం పెట్టేస్తాడు. దాంతో తులసి బాధగా బయటికి వస్తుంది.

సరిగ్గా అప్పుడే గిరిధర్ తన ఏర్పాటు చేసిన మనిషిని కలిసి.. మాట్లాడటం చూస్తుంది. ‘మీరు నాకు చాలా హెల్ప్ చేశారు.. ఆ ఫ్యాక్టరీ పని చెయ్యకుండా 3 లక్షలు బిల్ వచ్చేలా చేశారు’ అంటూ అతడితో గిరిథర్ మాట్లాడుతుంటే.. అంతా వీడియో తీస్తుంది. వెంటనే కోపంగా వాళ్ల దగ్గరకు వెళ్లి.. ‘మీరు ఇంత పెద్ద మోసం చేస్తారా.. కుట్ర చేస్తారా’ అంటూ అరుస్తుంది. సరిగ్గా అప్పుడే జీకే అక్కడ కారు దిగుతాడు. దూరంగా గిరిధర్ తులసి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేస్తుంటే.. లాగిపెట్టి కొడుతుంది. అంతా జీకే గమనిస్తూ ఉంటాడు. లోపలి నుంచి ఆఫీసర్ బయటకి వచ్చి గొడవ ఏంటీ అనడంతో అతడికి వీడియో చూపిస్తుంది తులసి. అది చూసి షాక్ అవుతాడు. ‘మర్యాదగా నా ఫ్యాక్టరీకి ఆపేసిన కరెంట్ తిరిగి ఇస్తారా లేక.. ఈ వీడియోని టీవీ ఛానల్‌కి ఇవ్వమంటారా’ అంటూ నిలదీస్తుంది తులసి. అంతా జీకే గమనిస్తూనే ఉంటాడు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘ఇంటింటి గృహలక్ష్మి’ కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.