యాప్నగరం

Anchor Vindhya: వాళ్ల ముందే బట్టలిప్పాలి.. ఆ హోటల్‌లో ఇలా చేయిస్తారు: స్పోర్ట్స్ యాంకర్ వింధ్యా షాకింగ్ ఘటన

ఎవరైనా నా ముందు లిమిట్స్ క్రాస్ చేసి రాంగ్ పంచ్‌లు వేస్తే.. వాళ్లు డైరెక్ట్‌గానే చెప్పేస్తా. ఇలాంటివి నాకు నచ్చవు బాస్.. ఇక్కడితే ఆపెయ్ అని. నాకు రాత్రి పూట ఎవరైనా కాల్ చేస్తే నచ్చదు.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 19 Apr 2024, 10:29 pm
ఇండస్ట్రీలో యాంకర్లు చాలామందే ఉంటారు కానీ.. యాంకర్ విన్ధ్యా విశాఖది ప్రత్యేక శైలి. ఈమె స్పోర్ట్స్‌లో వన్ అండ్ ఓన్లీ తెలుగు ఫీమేల్ యాంకర్. ఐపీఎల్, వరల్డ్ కప్, కబడ్డీ లీగ్స్ ఇలా ఈవెంట్ ఏదైనా సరే.. తన టాలెంట్ ఆకట్టుకుంటూ దూసుకునిపోతోంది తెలుగు యాంకర్ వింధ్య. కేవలం స్పోర్ట్స్ ఈవెంట్స్ మాత్రమే కాకుండా.. సినిమా ఫంక్షన్లలోనూ ఇతర టీవీ కార్యక్రమాలనూ హోస్ట్ చేస్తుంటుంది యాంకర్ వింధ్య. హెచ్ఎంటీవీ, స్టార్ మ్యూజిక్, స్టార్ మా.. ఇలా చాలా ఛానల్స్‌లో పనిచేసిన వింధ్యా.. ప్రస్తుతం స్పోర్ట్స్ యాంకర్‌గా కొనసాగుతున్నారు. ఇక గ్లామర్ డోస్ విషయంలోనూ ఈ యాంకర్ పాపది అందెవేసిన చేయి. పైగా మోడలింగ్ రంగం నుంచి రావడంలో ఎక్స్ పోజింగ్ విషయంలో అమ్మడి దగ్గర చాలానే మెలకువలున్నాయి.
Samayam Telugu Vindhya Visakha
యాంకర్ వింధ్య


అయితే గ్లామర్ ఫీట్ ఏదైనా కూడా.. అమ్మాయిలకు అంత ఈజీ కాదు. చాలామంది కళ్ల నుంచి తప్పించుకుని రావాలి. అయితే మోడలింగ్ రంగంలోకి వెళ్లిన యాంకర్ వింధ్య.. తాను చేసిన ఒకే ఒక్క షో తరువాత మళ్లీ మోడలింగ్ వైపు కన్నెత్తి చూడలేదు. దానికి బలమైన కారణమే ఉందంటూ తనకి ఎదురైన బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుంది తాజా ఇంటర్వ్యూలో.

‘‘నేను కస్తూర్బా కాలేజ్‌లో చదివినప్పుడు మిస్ కస్తూర్బా, మిస్ ఫ్రెషర్స్ అయ్యాను. దాంతో నేనెందుకు మోడల్ కాకూడదు అని అనుకున్నాను. అలా నేను కొన్నాళ్లు న్యూస్ రీడింగ్ చేసిన తరువాత.. జాబ్ కూడా చేశాను. ఆ తరువాత 2013లో మోడలింగ్ స్టార్ట్ చేశా. ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను.. కొన్ని షోలు కూడా చేశాను. నా ఫస్ట్ మోడలింగ్ షో హైదరాబాద్ నోవోటెల్‌లో వచ్చింది. అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ షో. నాకు మోడలింగ్ ఇండస్ట్రీ నచ్చలేదు. ఇక చాలు ఇంతకంటే మోడలింగ్‌లో ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు అని అనిపించింది.
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి Vindhya Vishaka (@vindhya_vishaka) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

చెప్పలేం కానీ.. మోడలింగ్ అంటే బ్యాక్ స్టేజ్‌లో చాలా జరుగుతూ ఉంటాయి. అవి నాకు నచ్చలేదు. నేను ఒక్కటే షో చేశా.. ఆ తరువాత బై బై చెప్పేశా. మోడలింగ్ ఆపేశా. ఆ వాతావరణం నాకు నచ్చలేదు. మోడలింగ్ లైఫ్ చాలా డిఫరెంట్ అని అనిపించింది. అది నాకు సెట్ అవ్వదని వచ్చేశా. నేను ఎవర్నీ ఉద్దేశించి ఇది చెప్పడంలేదు కానీ.. మోడల్స్ అంటే ఎక్కువగా హైదరాబాద్ నుంచి ఉండరు. ఫ్యాషన్ షోలు జరిగినప్పుడు డిఫరెంట్ స్టేజ్‌లపై పెర్ఫామ్ చేయాల్సి వస్తుంది.
View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka)

బ్యాక్ స్టేజ్‌లో చాలా జరుగుతాయి. ఇది ప్రతి చోటా జరుగుతుందని నేను చెప్పడం లేదు. బట్ నేను చూసింది ఏంటంటే.. అమ్మాయిలు ఆ ఫ్యాషన్ షో జరిగే దగ్గరే బట్టలు విప్పి వేరేవి వేసుకోవాలి. అక్కడ కర్టెన్స్ కానీ.. రూంలు కానీ ఏమీ ఉండవు. వాళ్ల ముందే బట్టలిప్పి మార్చుకోవాలి. అవి చూసి నేను షాక్‌లోకి వెళ్లిపోయా. అక్కడ చాలామంది మగాళ్లు ఉంటారు. వాళ్లముందే బట్టలిప్పడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ చూసి పారిపోయి వచ్చేశా.
View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka)

ఇక ఈ మోడల్స్‌కి సంబంధించి కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉంటారో.. వాళ్లు రాత్రి 12, ఒంటిగంటకి కాల్స్ మెసేజ్‌లు చేస్తుంటారు. నా వరకూ వచ్చేసరికి రాత్రి 10 దాటిన తరువాత నాకు ఎవరూ కాల్ చేయకూడదు. ఎవరైనా చేసినా కూడా నాకు సారీ చెప్తారు. వాళ్లేం తప్పుగా కాల్ చేయరు.. ప్రొఫెషనల్‌గానే కాల్ చేస్తారు కానీ.. నాకు నచ్చదు. నాతో మాట్లాడాలంటే ఉదయం 8 తరువాత రాత్రి 10లోపే మాట్లాడాలి. నాకు ఎప్పుడు పడితే అప్పడు కాల్ చేస్తే నాకు ఇష్టం ఉండదు. ఇవన్నీ నచ్చకే మోడలింగ్ నుంచి బయటకు వచ్చేశాను.
View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka)

ఆ తరవాత మళ్లీ యాంకర్‌గా చాయ్ బిస్కెట్ లైవ్ షోతో కెరియర్ స్టార్ చేసి.. జర్నీ ఇంత వరకూ వచ్చింది. హెచ్ఎంటీవీలో నేను ట్రైనీగా 6 వేలు జీతానికి జాయిన్ అయ్యాను. నిజానికి నాకు పెద్దగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నన్ను చూసుకోవడానికి నా పేరెంట్స్ ఉన్నారు. నా భర్త కూడా బాగానే సంపాదిస్తారు. నేను పనిచేయకపోయినా ఇంట్లో హ్యాపీగా ఉంటాను.. కానీ నాకు వర్క్ చేయడం ఇష్టం.. అందుకే చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు యాంకర్ వింధ్య విశాఖ.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.