యాప్నగరం

రోజమ్మా!! మీకు పాదభివందనం.. నా పెళ్లి, ఇళ్లు మీ వల్లే: జబర్దస్త్ కమెడియన్ ఆనంద్

చాలా మందికి టాలెంట్ ఉన్నా.. దాన్ని నిరూపించుకోవడానికి సరైన ప్లాట్ ఫ్లాం లభించదు. ఇలాంటి ఎంతోమంది టాలెంటెడ్ కమెడియన్స్‌ని హీరోలను చేసింది ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్.

Samayam Telugu 16 Jul 2020, 7:23 pm
జబర్దస్త్ కామెడీ షో కోట్లాది మందికి నవ్వుల విందు అందించడం కాదు.. ఎంతో మంది కళాకారులను పరిచయం చేసి వాళ్ల కడుపు నింపగలిగింది. ఎక్కడో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ.. చాలీ చాలని జీతాలతో బతుకు బండి నడుపుకునే కమెడియన్స్‌కి బాసటగా నిలిచింది జబర్దస్త్. యాంకర్స్ అనసూయ, రష్మి మొదలు.. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, ధనరాజ్, షకలక శంకర్, వేణు, అదిరే అభి, రామ్ ప్రసాద్, గెటప్ శీను, రచ్చ రవి, రాకెట్ రాఘవ, రాకింగ్ రాకేష్, శాంతి స్వరూప్, చమ్మక్ చంద్ర, ముక్కు అవినాష్, రైజింగ్ రాజు, అప్పారావు ఇలా ఎంతో మంది కమెడియన్స్‌కి జీవితాన్ని ఇచ్చింది జబర్దస్త్. టీం లీడర్స్ మాత్రమే కాకుండా ఒక్కో స్కిట్‌లో సుమారు 6-7 మంది కమెడియన్స్‌కి అన్నం పెడుతోంది ఈ కామెడీ షో.
Samayam Telugu జబర్దస్త్ ఆనంద్, రోజా
Jabardasth Comedian Anand


జబర్దస్త్ కామెడీ షో ద్వారా తమ జీవితాల్లో వెలుగులు నింపుకుని సంఘంలో గౌరవం పొందుతున్న చాలామంది కమెడియన్స్‌లో ‘జబర్దస్త్’ ఆనంద్ ఒకరు. ఈ కామెడీ షో లేకపోతే నాకు జీవితమే లేదు అంటున్నారు ఆనంద్. జబర్దస్ కామెడీ షో ద్వారా వినోదాన్ని అందిస్తూ వినోదినిగా క్రేజ్ సంపాదించిన వినోద్.. లేడీ గెటప్‌తో ఒక్కో జబర్దస్త్‌ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు. తాజాగా జబర్దస్త్ ఆనంద్‌తో జరిపిన ఇంటర్వూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూలో ఆనంద్ మాట్లాడుతూ.. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం జబర్దస్త్. ఎక్కడకు వెళ్లినా మమ్మల్ని గుర్తిస్తూ.. మాకో గౌరవం వచ్చింది అంటే ఈ షోవల్లే. నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా నా భార్య పిల్లలతో ఉన్నా.. నాకు ఒక బాబు.. త్వరలో మరో బాబు పుట్టబోతున్నాడు. ఒక హిట్ సినిమాలో పనిచేస్తే వచ్చినంత గుర్తింపు ఈ మల్లెమాల వారి జబర్దస్త్ ద్వారా వచ్చింది. మా లైఫ్‌లో ఇంతకు మించిన బిగ్ సక్సెస్ మరోటి ఉండదు. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన శ్యాం ప్రసాద్ రెడ్డిగారితో పాటు జబర్దస్త్ యూనిట్ మొత్తానికి రుణపడి ఉంటాను.

అలాగే మా దేవత మా రోజమ్మ (జబర్దస్త్ జడ్జీ). ఆమె ఎంతో గొప్ప సపోర్ట్ చేస్తున్నారు. నా పెళ్లికి కూడా ఆమె చాలా సపోర్ట్ చేశారు. ఇళ్లు విషయంలో.. నేను లైఫ్‌లో ఎదగడానికి కూడా రోజా గారే కారణం. చిన్న పాత్రలు వేసుకునే స్టేజ్‌ నుంచి టీం లీడర్ అయ్యే వరకూ కూడా ఎంతో సహకరించారు. ఆమె విలువైన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి. నాకు జీవితానికి ఎంతో మేలు చేసిన రోజమ్మా.. మీకు నా పాదాభివందనాలు’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు ఆనంద్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.