యాప్నగరం

జబర్దస్త్ వినోద్ న్యాయపోరాటం.. ఇంకా తేలని రూ.40 లక్షల మ్యాటర్, కథ మళ్లీ పోలీస్ స్టేషన్‌కి

గతంలో ఇంటి ఓనర్ దాడిలో తీవ్ర గాయాలపాలైన జబర్దస్త్ వినోద్ మరోసారి పోలీసుల్ని ఆశ్రయించారు. వివాదానికి కారణమైన ఇంటి విషయంలో తనకి న్యాయం జరగలేదని.. బెదిరింపులు ఎక్కువయ్యాయంటూ ఈస్ట్ జోన్ డీసీపీని కలిశారు.

Samayam Telugu 8 Apr 2021, 2:57 pm
జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్‌లతో అలరించి వినోద్.. అలియాస్ వినోదిని మరోసారి పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డిని కలిశారు వినోద్.
Samayam Telugu జబర్దస్త్ వినోద్
jabardasth vinod attack


ఇంటి ఓనర్ దాడితో తీవ్రంగా గాయపడ్డ జబర్దస్త్ కమెడియన్ వినోద్‌ (వినోదిని) తనకు ప్రాణహాని ఉందంటూ గతంలో కూడా పోలీసుల్ని ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని కుత్బిగూడలో అద్దె ఇంటిలో నివాసిస్తున్న వినోద్‌పై 2019 జూలై నెలలో ఇంటి ఓనర్ దాడి చేశారు. తీవ్రగాయాలపై పాలైన వినోద్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో.. నిందితులపై ఐపీసీ 323, 506 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.

తనకి ఇల్లు అమ్ముతానని పది లక్షల అడ్వాన్స్ తీసుకోవడమే కాకుండా.. తనపై హత్యాయత్నం చేశారని.. ఇంటి ఓనర్ ప్రమీల, భర్త బాలాజీ, పెద్ద కొడుకు ఉదయ్ సాగర్, చిన్న కొడుకు అభిషేక్, పెద్ద కోడలు సంధ్య తనపై మూకుమ్మడి దాడి చేసి కొట్టారంటూ 2019 జూలై నెలలో పోలీసులకు కంప్లైట్ చేశారు వినోద్.

తాను ఉంటున్న 70 గ‌జాల ఇంటిని కొనుగోలు చేసేందుకు యజమానితో 4 నెలల కిందట ఒప్పందం కుదుర్చుకున్నానని.. ఈ క్రమంలోనే య‌జ‌మానికి రూ.10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చానని చెప్పాడు వినోద్.. అయితే తర్వాత ఇంటిని అమ్మబోనని చెప్పిన యజమాని అడ్వాన్స్ తిరిగివ్వకుండా వేధిస్తున్నాడని చెప్పాడు వినోద్. దీనిపై నిలదీయడానికి వెళ్లిన వినోద్‌పై యజమాని కుటుంబం దాడికి పాల్పడటంతో తీవ్రగాయాలతోనే కాచిగూడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తనపై హత్యయత్నం చేయడంతో పాటు కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు వినోద్.

అయితే ఇప్పుడు ఈస్ట్ జోన్‌ డీసీపీ ఇచ్చిన ఫిర్యాదులో తనకి రూ.40 లక్షలకు ఇంటిని విక్రయిస్తానని చెప్పి ఇంటి ఓనర్ తన దగ్గర 13.40 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడని.. ఇప్పుడు రూ.40 లక్షలు కంటే ఎక్కువ ఇస్తేనే ఇల్లుని అమ్ముతానని పాత పాటే పాడుతూ తనని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని.. గతంలో కూడా తనపై భౌతికదాడి చేశారని... ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని దయచేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ డీసీపీకి వినతిపత్రం అందించారు వినోద్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.