యాప్నగరం

జబర్దస్త్ ప్రసాద్ లవ్ స్టోరీ.. అంతటి త్యాగానికి సిద్దమైన భార్య.. ప్రేమంటే ఇదేరా!

జబర్దస్త్ ఆర్టిస్ట్ పంచ్ ప్రసాద్ ఆరోగ్య సమస్య గురించి అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ప్రసాద్ కోసం ఆయన భార్య కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ జంట ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Samayam Telugu 23 Apr 2021, 6:06 pm

ప్రధానాంశాలు:

  • జబర్దస్త్ ఆర్టిస్ట్ పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి
  • కిడ్నీ సమస్యలతో ప్రసాద్ సతమతం
  • భర్త కోసం భార్య త్యాగం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu జబర్దస్త్ ప్రసాద్ లవ్ స్టోరీ.. అంతటి త్యాగానికి సిద్దమైన భార్య
Jabardasth Prasad
జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు ఎంతగా నవ్విస్తున్నారో.. వారి జీవితాల్లో అంతటి విషాదం ఉంది. ఒక్కో ఆర్టిస్ట్ వెనకాల ఎంతో వ్యథ ఉంది. కెవ్వు కార్తీక్, అవినాష్, అప్పారావు, నరేష్ ఇలా ప్రతీ ఒక్కరి జీవితాల్లో ఎన్నో కష్టాలున్నాయి. జబర్దస్త్ స్టేజ్ మీద లేడీ గెటప్పులు వేసే ఆర్టిస్ట్‌ల కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. ఇక జబర్దస్త్ షోలో చేసిన పంచ్ ప్రసాద్ గురించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే.
జబర్దస్త్ పంచ్ ప్రసాద్ కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఆ మధ్య కొన్ని నెలలు జబర్దస్త్‌కు దూరంగా ఉన్నారు. అయితే ప్రసాద్‌ను కాపాడేందుకు మల్లెమాల కానీ, జబర్దస్త్ కానీ ముందుకు రాలేదు. ఈ విషయంలో నాగబాబు హర్ట్ అయ్యారు. జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లే ముందు కూడా ఈ విషయాలన్నీ గుర్తు చేస్తూ మల్లెమాలను కడిగిపారేశారు. అయితే నాగబాబు ముందుండి ప్రసాద్‌కు అండగా నిలబడ్డారు.

జబర్దస్త్ ఆర్టిస్ట్‌లందరి సహాయ సహకారాలతో ఆపరేషన్‌కు కావాల్సిన సొమ్మంతా నాగబాబు సేకరించారట. ఇప్పటికీ ఆ డబ్బు ఆయన వద్దే ఉందని, ప్రసాద్ ఎప్పుడైతే చికిత్స చేసుకునేందుకు రెడీగా ఉంటారో అప్పుడు ఆ డబ్బు ఇస్తానని నాగబాబు అన్నారట. ఇప్పుడే డబ్బు ఇస్తే ఇతర అవసరాలకు వాడుకుంటాడేమోనని తన వద్దే డబ్బు పెట్టుకున్నారని ఆర్టిస్ట్‌లు చెబుతుంటారు.

అయితే తాజాగా ప్రసాద్ తన భార్యతో కలిసి శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నారు. ఇందులో తమ ప్రేమ, తమ ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పి అందరినీ ఏడిపించేశారు. తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి వరకు వెళ్లామని, ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని ప్రసాద్ చెప్పుకొచ్చారు. నాకు కొంచెం కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఈ అబ్బాయి కిడ్నీ సమస్య ఉంది.. ఎక్కువ రోజులు ఉండరు.. రిస్క్ ఎందుకు.. ఎంగేజ్మెంటే కదా?అయింది.. అంటూ డాక్టర్ ఆమెకు సలహాలు ఇచ్చారు. ఏడాది బతికినా రెండేళ్లు బతికినా చాలు ఆయనతోనే బతుకుతాను అని చెప్పింది’ అని ప్రసాద్ అసలు విషయం చెప్పేశారు.

‘ఇంకో విషయం ఏంటంటే వీడికి ఇంకా కిడ్నీ ఆపరేషన్ చేయలేదు.. పిల్లాడు కాస్త ఎదిగిన తరువాత ఆమే వీడికి కిడ్నీ ఇస్తుంది’ అని రాం ప్రసాద్ అసలు సంగతి బయటపెట్టేశారు. భర్త కోసం కిడ్నీ దానం చేసేందుకు వచ్చిన ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భర్తకోసం అంతటి త్యాగానికి సిద్దపడ్డ ఆమెకు అందరూ చేతులెత్తి మొక్కేస్తున్నారు. ప్రేమంటే ఇదేరా? అని అందరూ మెచ్చుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.