యాప్నగరం

Rocking rakesh: పెళ్లి బంధంతో జంటగా మారిన రాకింగ్ రాకేష్ - జోర్దార్ సుజాత‌

Rocking Rakesh - Jordar Sujatha: జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ రాకింగ్ రాకేష్‌, జోర్దార్ సుజాత‌ల పెళ్లి తిరుమ‌ల‌తో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుకకి జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్స్ హాజ‌రై వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Authored byతుమ్మల మోహన్ | Samayam Telugu 25 Feb 2023, 5:27 am
Rocking Rakesh - Jordar Sujatha: జబర్దస్త్ కమెడియన్‌గా (Jabardasth Comedian) గుర్తింపు పొందిన రాకింగ్ రాకేష్ త‌న ప్రేయ‌సి జోర్దార్ సుజాత‌ను శుక్ర‌వారం రోజున వివాహం చేసుకున్నారు. తిరుమ‌ల‌లో వీరి పెళ్లి జ‌రిగింది. వారి పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బుల్లి తెరపై కామెడీ షో జబర్దస్త్ ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ షోలో కంటెస్టెంట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన రాకింగ్ రాకేష్ త‌ర్వాత టీమ్ లీడ్‌గా మారారు. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్నారు. త్వ‌ర‌లోనే ఈయ‌న హీరోగానూ ప్రేక్ష‌కుల‌ను అలరించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు.
Samayam Telugu Rocking Rakesh Marriage
Rocking Rakesh marriage, రాకింగ్ రాకేష్ పెళ్లి


రాకింగ్ రాకేష్ కొన్నాళ్ల నుంచి జోర్దార్ సుజాతతో ప్రేమ‌లో ఉన్నారు. ఆమెతో పాటు కొన్ని స్కిట్స్‌లో రాకేష్ క‌లిసి యాక్ట్ చేశారు. అప్ప‌టి నుంచి ఉన్న ప‌రిచ‌యం త‌ర్వాత ప్రేమ‌గా మారింది. కొన్నాళ్లు ముందు త‌మ ప్రేమ విష‌యాన్ని బ‌హిరంగంగానే చెప్పిన రాకేష్ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 24న వీరి పెళ్లి తిరుమ‌ల‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఇప్పుడా పెళ్లి ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. వీరి పెళ్లికి ఏపీ మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణితో పాటు జ‌బ‌ర్ద‌స్ నుంచి చాలా మంది క‌మెడియ‌న్స్ హాజ‌రై యువ జంటను ఆశీర్వ‌దించారు.

త‌మ‌కు లైఫ్ ఇచ్చిన జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌పైనే రాకేష్‌, జోర్దార్ సుజాత‌లు ప్రేమ‌లో ఉన్న‌ట్లు తెలిపారు. అయితే జ‌బ‌ర్ద‌స్త్‌లో మ‌న‌కు జంట‌గా క‌నిపిస్తూ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉందంటూ అనుమానం క‌లిగించేలా న‌టీన‌టులు న‌వ్విస్తుంటారు. దీంతో రాకేష్‌, సుజాత మ‌ధ్య కూడా అలాంటి ప్రేమే ఉంటుంద‌ని భావించారు. కానీ వీరిద్ద‌రూ సీరియ‌స్‌గానే ల‌వ్‌లో ఉన్నార‌ని తర్వాత అర్థ‌మైంది. ఇద్దరూ కుటుంబ స‌భ్యుల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రాకేష్‌, సుజాత‌ల‌కు నెటిజ‌న్స్ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు.

రచయిత గురించి
తుమ్మల మోహన్
మోహ‌న్ కుమార్ తుమ్మ‌ల స‌మ‌యం తెలుగులో డిజిట‌ల్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఇక్కడ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్, వార్తలను రాస్తుంటారు. మోహ‌న్ కుమార్‌కి సినీ జ‌ర్న‌లిజంలో 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. గ‌తంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో సినీ జ‌ర్న‌లిస్టుగా వ‌ర్క్ చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.