యాప్నగరం

Jabardasth: చమ్మక్ చంద్ర అవయవ దానం.. ఎవరికీ తెలియని విషయాలు చెప్పిన సత్తిపండు

Jabardasth Sattipandu: గతంలో చమ్మక్ చంద్రపై చాలా రూమర్స్ వినిపించాయి. స్కిట్స్‌లో అవకాశం ఇస్తానని తనను మోసం చేశాడంటూ ఓ ప్రముఖ యాంకర్ చంద్రపై తీవ్ర ఆరోపణలు చేసింది.

Samayam Telugu 5 Aug 2020, 12:25 pm
జబర్దస్త్ కామెడీ కమెడియన్ చమ్మక్ చంద్ర.. ప్రస్తుతం జీ తెలుగు అదిరించి కామెడీ షోలో చేస్తున్నారు కాని.. ఆయన పాపులర్ అయ్యింది మాత్రం జబర్దస్త్ కామెడీ షోతోనే. ప్రస్తుతం సినిమాలతోనూ బిజీగా ఉన్న చమ్మక్ చంద్ర గ్రేట్ నెస్‌ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు జబర్దస్త్ సత్తిపండు. చానాళ్లు చమ్మక్ చంద్ర టీంలో కీలక సభ్యుడుగా ఉన్న సత్తిపండు.. ఇటీవలే టీం లీడర్ అయ్యారు. తాను ఈ స్థాయికి రావడానికి కారణం చమ్మక్ చంద్ర అంటూ ప్రశంసలు కురిపించారు.
Samayam Telugu చమ్మక్ చంద్ర
Chammak Chandra


Read Also: పెళ్లికి ముందు సెక్స్ తప్పేంటన్న.. బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి పీటలెక్కేసిందా? ఆమె ‘నోట’ అసలు నిజం

స్కిట్స్‌లలో ఎప్పుడూ ఎవర్నో ఒకర్ని కొడుతూ తిడుతూ చాలా సీరియస్‌గా కనిపించే చమ్మక్ చంద్ర రియల్ లైఫ్‌లో చాలా చాలా మంచి వ్యక్తి అంటున్నారు సత్తి పండు. ఆయన మాట్లాడుతూ.. ‘చమ్మక్ చంద్ర బాగా కష్టపడి పైకి వచ్చాడు.. 18 ఏళ్లు పాటు కసితో ట్రై చేసి ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నారు. ఆయనతో పోల్చుకుంటే నేను జబర్దస్త్‌లోకి ఈజీగానే వచ్చాను. ఆయన ఎవర్నీ నొప్పించరు.. ఆయన జడ్జీమెంట్ కరెక్ట్‌గా ఉంటుంది. ఏది ఏంటి అనేది చంద్రకు బాగా తెలుసు. బిహేవియర్ విషయంలో కూడా చాలా మెచ్యూర్డ్‌గా ఉంటారు. ఆయన జడ్జిమెంట్ విషయంలో చాలా క్లియర్‌గా మొహమాటం లేకుండా ఉంటుంది. ఎవర్నీ నొప్పించకుండా ఒప్పించి జడ్జిమెంట్ ఇస్తారు.

అలాగే తోటి వారికి సాయం చేయాలనే మంచి హ్యూమన్ బీయింగ్ ఆయనది. చాలామందికి సాయం చేశారు.. అంతేకాదు చంద్ర అవయవ దానం చేశారు.. ఆ కార్డ్‌ని నాకు మాత్రమే చూపించారు. మానవత్వం లేకుండా ఇలాంటివి చేయలేరు. ఆర్టిస్ట్‌గా ఆయనలో ఉన్న అన్ని కోణాలను చూపిస్తారు కాని.. రీల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు. కొత్తగా వచ్చే వాళ్లని బాగానే ప్రోత్సహిస్తారు.. వేషం లేకపోతే లేదని వెంటనే చెప్పేస్తారు తప్ప.. బాధపట్టేలా మాట్లాడరు’ అంటూ చెప్పుకొచ్చారు జబర్దస్త్ కమెడియన్ సత్తిపండు.
Read also: రాజీవ్ కనకాల ఎమోషనల్ పోస్ట్! ‘మనిషి దూరం ఐతే తప్ప విలువ తెలీదు’
Read Also: ఏ తండ్రీ చేయని నీఛం ఇది.. అతని నిజస్వరూపం బయటపెట్టిన స్వాతి నాయుడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.