యాప్నగరం

Ambedkar Jayanti 2022: అంబేద్కర్ జయంతి నాడు గెటప్ శీను పోస్ట్ వైరల్

Jabardasth Srinivas: డా. బి. ఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వాడవాడలా జై భీమ్ నినాదాలతో మారుమోగుతున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులు నివాళులు తెలియజేశారు.

Samayam Telugu 14 Apr 2022, 6:11 pm
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని వాడవాడలా వేడుకలు మిన్నంటాయి. దేశ పురోగతికి మార్గదర్శనం చేసిన మహనీయుడుని స్మరించుకుంటూ జై భీమ్ నినాదాలు మారుమోగాయి. అంటరానితనం, సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేసి కుల, మత, వర్ణ, వర్గ రహిత సమాజం కోసం అహర్ణిశలు కృషి చేసిన మహానుభావుడిని గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అందాయి.
Samayam Telugu గెటప్ శీను
getup srinu on ambedkar


ఈ సందర్భంలో రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌ని స్మరిస్తుండగా.. జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను డా. బి. ఆర్ అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు. తన ఫేస్ బు‌క్‌లో అంబేద్కర్‌ని స్మరిస్తూ పోస్ట్ పెట్టారు.

‘నేడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ గారి జయంతి.. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అంటూ అంబేద్కర్ ఫొటో షేర్ చేశారు జబర్దస్త్ శ్రీనివాస్ అలియాస్ గెటప్ శీను. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. మహనీయుడ్ని స్మరిస్తూ పోస్ట్ పెట్టినందుకు పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి.

కాగా.. ప్రస్తుతం గెటప్ శీను కేవలం జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలతోనే కాకుండా.. సినిమాలతోనూ బిజీగా మారారు. ఆయన హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.