యాప్నగరం

Guppedantha Manasu జనవరి 17 ఎపిసోడ్: ఒక్కసారిగా కుప్పకూలిన మహేంద్ర.. ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్‌కి..

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2022 జనవరి 17)న 349 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Guppedantha Manasu January 17 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 17 Jan 2022, 1:54 pm
గత ఎపిసోడ్‌లో.. రిషి వసుని తీసుకుని సర్వే పేరుతో బయటికి వెళ్లడం, తిరిగివచ్చాక.. కాలేజ్‌లో ప్రేమలేఖ టాపిక్ తీసి జగతి ఫైర్ కావడం తెలిసిందే. ఇక రెస్టారెంట్‌లో గౌతమ్, రిషిల మధ్య ‘హార్ట్ విత్ కాఫీ’ సీన్ కూడా నిన్న చూశాం. ఈ క్రమంలోనే నేటికథనం ఆసక్తిగా మారింది.
Samayam Telugu ‘గుప్పెడంత మనసు’ 2022 జనవరి 17 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Guppedantha Manasu 2022 January 17 episode


349వ ఎపిసోడ్‌ హైలైట్స్..
గౌతమ్ మనసులో.. ‘ఈ రిషి గాడు ఏం అయ్యాడు.? అనుకుంటూనే.. వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రిషి ‘నా వెంట పడి.. నువ్వెంత ఒంటరి’ అనే జాను మూవీ సాంగ్ అందుకుంటాడు కళ్లు మూసుకుని వసుని గుర్తు చేసుకుంటూ.. ఇంతలో వసు మెషిన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఒక మెయిల్ రిషికి పంపించి.. విషయం చెప్పడానికి రిషికి కాల్ చేస్తుంది. రిషి పాటపాడుతూనే చూసి లిఫ్ట్ చేయకుండా పాడుతూనే ఉంటాడు కళ్లు మూసుకుని. ఆ పాట విని గౌతమ్ రిషి ఉన్నవైపు నడిచి వస్తాడు. ఇక వసు మహేంద్రకు కాల్ చేసి.. ‘సార్ రిషి సార్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.. ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి’ అనడంతో.. ఒక్కనిమిషం అమ్మా.. తీసుకుని వెళ్తాను’ అంటూ లేచి వెళ్తుంటాడు.

‘సారీ సార్ మిమ్మల్నిఇబ్బంది పెడుతున్నా’ అని వసు మహేంద్రతో అంటుంది. ఫర్లేదమ్మా అంటాడు మహేంద్ర. రిషి దగ్గరకు వెళ్లేసరికి రిషి ఓ పాడేస్తూ ఉంటాడు. కళ్లు మూసుకోవడంతో గౌతమ్, మహేంద్ర ఇద్దరూ వచ్చినా రిషికి తెలియదు. దాంతో వసు కూడా ఆ పాట వింటుంది. ఆ పాటను రికార్డ్ చేసకుంటుంది. ఇక మరునాడు కాలేజ్‌కి వచ్చే సమయంలో వసుతో పుష్యా..‘వసు ఈ షార్ట్ ఫిలింగ్ సక్సెస్ అవుతుందా?’ అంటుంది. తప్పకుండా అవుతుంది.. అనగానే.. ‘ఎందుకు రిషి సార్ చూసుకుంటున్నారనా? అంటుంది పుష్ప.. అదేం కాదు పుష్పా.. జగతి మేడమ్ ఆలోచన కదా అది. .అంటుంది వసు. అన్ని మాటలు మిస్టర్ ఇగో వినేస్తాడు. ‘అంటే నా భాగస్వామ్యం ఏం లేదంటావా వసుధరా’ అంటూ ఎంట్రీ ఇస్తాడు. వసు బిత్తర చూపులు చూస్తూ.. ‘అది సార్.. నేను ఏం అన్నానంటే..’ అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. వెంటనే రిషి.. ‘నిన్న మెయిల్ చేశావ్ కదా చూసుకున్నా’ అంటాడు కూల్‌గా..

మరోవైపు కాలేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్‌లో ఓ చెట్టుకింద కూర్చుని.. రిషి గుర్తు రావడంతో పాట విందామని ఫోన్ తీస్తుంది. అప్పుడే రిషి కాస్త దూరం నుంచి వసుని వెనుకవైపు నుంచి చూస్తూ.. ‘ఆ గౌతమ్ గాడు వసుని చాలా తక్కువ అంచానా వేస్తున్నాడు.. వసుధర చాలా ప్రత్యేకం అనుకుంటూ ఉంటాడు. అప్పుడే గౌతమ్ రిషికి కాల్ చేస్తాడు. ఆ రింగ్ శబ్దానికి వసు రిషి వైపు తిరిగి చూసి.. ‘సార్ మీరా .. ఇక్కడా?. ఎప్పుడొచ్చారు సార్’ అంటూ లేచి నిలబడుతుంది. ‘కూర్చో’ అంటూ గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేసి.. ‘రేయ్ నువ్వు బుద్ధిగా నా క్యాబిన్‌లో కూర్చో.. నేను వస్తాను’ అని ఫోన్ కట్ చేసి.. వసుతో బాతాకానీ వేస్తాడు. అప్పుడే వసు రిషితో.. పాట భలే పాడారు సార్ అంటూ.. ఆ పాట వినిపించి.. మహేంద్రకి కాల్ చేసిన విషయం, తను రికార్డ్ చేసుకున్న విషయం చెబుతుంది.

కమింగ్ అప్‌లో..
మహేంద్ర జగతి ఇంట్లో ఉంటాడు. జగతి పక్కనే కూర్చుని పెద్ద పెద్దగా నవ్వుతాడు. నవ్వుకు మహేంద్ర అంటుంది జగతి. అయినా నవ్వు ఆపుకోడు. అలా నవ్వుతూ నవ్వుతూ దగ్గుతాడు. ఒక్కసారిగా పడిపోతాడు. ‘ఏదో అన్ ఈజీగాఉంది జగతి’ అంటూ కుప్పకూలిపోతాడు. సోఫాలో పడి ఉన్న మహేంద్రని కంగారుగా జగతి.. అరుస్తూ ఉంటుంది. వసు పరుగున వస్తుంది. ‘రిషీ సార్‌కి కాల్ చేశారా?’ అంటుంది ఏడుస్తూ వసు. ఇద్దరూ కలిసి హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లిపోతారు. వసుకి రిషి కాల్ చేసి.. ‘వసుధరా నువ్వు హాస్పెటల్‌లో ఉండటం ఏంటీ? ఎవరికి ఏం అయ్యింది?’ అనడంతో వసు ఏడుస్తూ మహేంద్రకు ఇలా అయ్యిందని చెప్పలేక అల్లాడిపోతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.