యాప్నగరం

Guppedantha Manasu జూలై 29 ఎపిసోడ్: రిషికి షాకిచ్చిన వసు, శిరీష్.. ఆ హగ్‌ని గుర్తు చేసిన ఈ హగ్

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 జూలై 29)న 202 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Guppedantha Manasu Serial Today July 29 Episode హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 29 Jul 2021, 11:18 am
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 జూలై 29)న 202 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.
Samayam Telugu ‘గుప్పెడంత మనసు’ జూలై 29 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Guppedantha Manasu July 29 episode


202వ ఎపిసోడ్‌ హైలైట్స్..
వసు వల్లే నువ్వు ఆ బర్త్‌డే పార్టీకి వెళ్లావ్ కదా అని దేవయాని అడిగిన మాటల్నే గుర్తు చేసుకుంటూ రగిలిపోతున్న రిషికి.. వసు బొకే ఫోటో తీసి.. ‘చాలా సంతోషంగా సార్.. బొకే బాగుంది’ అని మెసేజ్ చెయ్యడంతో మరింత మండింది. దాంతో వసుకి ఫోన్ చేసి.. ‘ఏంటి ఇది? ఏం అనుకుంటున్నావ్.. బొకే అనేది ఈ రోజు కాకపోతే రేపైనా వాడిపోవడం పక్కా.. అంతగా మురిసిపోకు.. ఎక్కువగా ఊహించుకోకు’ అని తిట్టి పెట్టేస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే.. మరునాడు ఉదయాన్నే వసు బయట కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉండగా.. మహేంద్ర వస్తాడు. ‘హాయ్ చెప్పుకున్న తర్వాత.. జగతి కోసం లోపలికి నడుస్తారు. అయితే జగతి మాత్రం రిషి ఇచ్చిన బొకేనే చూస్తూ మురిసిపోతూ ఉంటుంది.

మహేంద్ర వచ్చి కదిలించడంతో.. జగతి వసుని ఒక్కసారిగా హగ్ చేసుకుని.. ఇంతకన్నా నీకు థాంక్స్ ఎలా చెప్పాలో తెలియడం లేదు అనడంతో.. గతంలో రిషి హగ్ చేసుకుని.. ‘థాంక్స్ ఇంతకన్నా ఎలా చెప్పాలో తెలియక అలా చేశాను’ అన్న మాట, ఆ సీన్ గుర్తొస్తుంది. ఇక ఇంతలో శిరీష్ రావడంతో.. ‘ఇప్పుడు నువ్వేం టీ, కాఫీలు ఎక్స్‌పర్ట్ చెయ్యొద్దు’ అంటూ వసు అనే సీన్ కాస్త కామెడీగానే ఉంటుంది. అయితే వసుని నడిచి వెళ్లకుండా ఉండేందుకు జగతి క్లాస్ లేకపోయినా కాలేజ్‌కి బయలుదేరుతుంది. ఆ విషయం తెలిసి నేను డ్రాప్ చేస్తానులే మేడమ్.. మీరు ఆగిపోండి.. మహేంద్ర సార్‌తో కలిసి రండి అనడంతో.. జగతి సరేనంటుంది. అయితే రిషి శిరిష్‌గా గతంలో పోలీస్ డ్రెస్‌తో కానీ.. పోలీస్ జీప్‌తో కానీ కాలేజ్‌కి రావద్దు అన్న మాట గుర్తొచ్చి.. అమ్మో నేను తీసుకుని వెళ్లను అంటాడు.

దాంతో మహేంద్ర.. తన కారు ఇచ్చి.. ఈ కారులో డ్రాప్ చేసి.. తిరిగి వచ్చి మీ కారు తీసుకుని వెళ్లొచ్చుగా అని సలహా ఇస్తాడు. దాంతో ఇద్దరూ మహేంద్ర కారులో బయలుదేరతారు. అప్పటికే రిషి కాలేజ్‌కి స్టార్ట్ అయినప్పుడు.. ధరణి కాఫీ ఇస్తూ.. ‘రిషీ నవ్వు ఆ పార్టీకి రావడానికి వసునే కారణం కదా’ అంటుంది. కానీ ఒప్పుకోడు. దాంతో ధరణి.. ‘పైకి ఒప్పుకోకపోయినా మనసు చెప్పుకోవడం చాలా అవసరం’ అని వెళ్లిపోతుంది. ఇక సీన్ కట్ చేస్తే.. కాలేజ్‌కి వచ్చేస్తాడు రిషి. రాగానే మిగిలిన ప్రొఫెసర్స్.. రిషికి థాంక్స్ చెబుతారు. ‘జగతి మేడమ్‌కి మంచి గౌరవం ఇచ్చారు.. సన్మానం చెయ్యడం చాలా హ్యాపీగా ఉంది’ అనడంతో రిషి థాంక్యూ అంటాడు.

ఇక ఆ అభినందనలు తర్వాత.. వసు చెప్పిన మాటలు వళ్లే నేను ఈ పని చేసి ఉంటానా.. వసుధర ఎప్పుడు కరెక్టే చెబుతుంది’ అంటూ పాజిటివ్‌గానే అనుకుంటాడు. అయితే సరిగ్గా అప్పుడే మహేంద్ర కారు రావడం.. అందులోంచి వసు, శిరీష్‌లు దిగడంతో షాక్ అవుతాడు. కమింగ్అప్‌లో.. జగతి తనకు సన్మానం జరిగిన చోటకు వెళ్లి రిషి బొకే ఇచ్చిన సీన్ గుర్తుచేసుకుని పొంగిపోతుంది. వసుకి ‘నీ వల్లే ఇది సాధ్యమైంది’ అంటూ పొగుడుతుంది. అది రిషి వినేస్తాడు. ఇక జగతి ఆనందాన్ని చూసి ‘నేను ఏదీ మరిచపోను’ అనుకుంటాడు పొగరుగా. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.