యాప్నగరం

Karthika Deepam Serial ట్విస్ట్: అబ్బా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సీన్! డాక్టర్ బాబు చిలిపి.. దీప చెవి మెలివేస్తూ..

దీపకు క్లారటీ ఇచ్చాడు కార్తీక్. భర్త స్థానంలో హాస్పెటల్‌కి కూడా తీసుకుని వెళ్లాడు. అదే నేటి ఎపిసోడ్‌లో హైలైట్.. అయితే రేపటి ప్రోమోలో కార్తీక్ దీపపై ప్రేమను కురిపించడంతో పాటు చిలిపిగా ప్రవర్తించడంతో కథ ఉత్కంఠగా మారింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 16 Apr 2021, 8:35 am
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ karthika deepam serial.. నేడు(2021 ఏప్రిల్ 15)న 1014 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే రేపటి ప్రోమోలో అదిరిపోయే ట్విస్ట్ ఉంది. నేటి ఎపిసోడ్‌లో మోనిత సౌందర్యని కలుసుకుని అసలు విషయం తెలుసుకోవడంతో కథ రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో రేపటి కమింగ్ అప్‌ కథకు కీలకంగా మారింది. నేటి ఎపిసోడ్‌లో దీప కార్తీక్ మనసు విప్పి మాట్లాడుకోవడం కూడా కథను ఆసక్తిగా మార్చేశాయి. ఆ హైలైట్స్ కోసం ఈ కింద లింక్ క్లిక్ చేయండి.
Samayam Telugu ‘కార్తీకదీపం’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam telugu serial promo

Karthika Deepam ఏప్రిల్ 15 ఎపిసోడ్: వంటలక్కని భార్యస్థానంలో హాస్పెటల్‌కి తీసుకెళ్లిన డాక్టర్ బాబు.. మోనిత దొంగనాటకాలు
ప్రోమో హైలైట్స్..
సీన్ కట్ చేస్తే.. మురళీ కృష్ణ, భాగ్యం కూడా సౌందర్య ఇంటికి రావడంతో ఇళ్లంతా సంబరంగా ఉంటుంది. సరిగ్గా అప్పుడే కార్తీక్ దీప దగ్గరకు వచ్చి.. ‘టాబ్లెట్స్ వేసుకున్నావా దీపా’ అని అడుగుతాడు. అక్కడే ఉన్న హిమ, సౌర్యలతో పాటు.. మురళీ కృష్ణ కూడా ఆ మాటలు విని మురిసిపోతారు. ‘టైమ్‌కి వేసుకోవాలి. ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉండండి..’ అని కార్తీక్ అంటుంటే.. సోఫాలో కూర్చున్న మురళీ కృష్ణ, ఆనందరావు సంతోషపడిపోతుంటే.. అక్కడే నిలబడిన సౌందర్య చాలా హ్యాపీగా కన్నీళ్లని తుడుచుకుంటుంది. ‘వేసుకోకపోతే.. ఇదిగో ఇలా చెవి మెలెయ్యండి..’ అని కార్తీక్ దీప చెవులు మెలివేస్తాడు. పిల్లలు అక్కడున్నవాళ్లంతా నవ్వుతుంటే.. దీప నొప్పితో.. ‘వేసుకుంటాను వేసుకుంటాను..’ అంటుంది.

కార్తీక్ పైకి వెళ్తుంటే.. సౌందర్య.. ‘త్వరగా రారా.. ఇవాళ మృష్టాన భోజనం.. నీ పెళ్లామే వంట చేసిందోయ్’ అనడంతో.. కార్తీక్ ఒక్కనిమిషం షాక్ అవుతాడు. మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ ఆగిపోయి.. ‘మాలతీ ఏం అయ్యింది మమ్మీ’ అంటాడు కార్తీక్ కోపంగా. అంతా షాక్ అయ్యి అటుగా చూస్తారు. దీప వంట చేస్తే తినకూడదు అనే పంతమా..? కార్తీక్ ఇప్పుడు కూడా నటిస్తున్నాడా? అనే అనుమానంతో పాటు.. బహుశా దీప వంట పనికి దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పడం కూడా కార్తీక్ కోపానికి కారణం కావచ్చు. నిజంగానే కార్తీక్ నటిస్తున్నా దీప టాబ్లెట్స్ వాడదు కాబట్టి బయటపడదు. చూడాలి ఏం జరుగుతుందో.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.