యాప్నగరం

Karthika Deepam Serial సూపర్ ట్విస్ట్: వార్నింగ్ అదిరిపోయింది వంటలక్కో! మరో సూపర్ హిట్ సీన్

రేపటి ప్రోమో ఉత్కంఠగా మారింది. ఒకే చోట మోనిత, దీప, కార్తీక్ కలుసుకోవడంతో కథనం మరింత ఆసక్తిగా మారింది. నేటి ఎపిసోడ్‌లో మోనిత చెవిన ఓ శుభవార్తపడింది. ఇక రేపటి ఎపిసోడ్‌లో దీప వార్నింగ్ అదిరిపోయింది. ఆ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 27 Apr 2021, 1:19 pm
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 ఏప్రిల్ 20)న 1018 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే రేపటి ప్రోమోలో అదిరిపోయే ట్విస్ట్ ఉంది. నేటి ఎపిసోడ్ మిస్ అయ్యారా.. అయితే ఈ లింక్ క్లిక్ చేయండి..
Samayam Telugu ‘కార్తీకదీపం’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam telugu serial promo

Karthika Deepam ఏప్రిల్ 26 ఎపిసోడ్: మోనిత చెవిన శుభవార్త.. దీపకు తప్పని గండం! ఉత్కంఠగా మారిన కథనం
ప్రోమో హైలైట్స్..
నేటి ఎపిసోడ్‌లో పిల్లలతో సహా దీప, కార్తీక్.. శ్రీరామనవమి కళ్యాణానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీప వంట చేస్తూ తీవ్రమైన దగ్గుతో చాలా ఇబ్బంది పడుతుంది. ఓ పెద్ద పొయ్యి మీద గరిటె తిప్పుతూ దగ్గి దగ్గి అల్లాడిపోతుంది. దాంతో అక్కడే ఉన్న పిల్లలు దీపని పట్టుకుని ఓ పక్కగా కూర్చోబెడతారు. అప్పుడే కార్తీక్ వచ్చి.. ‘ఇక్కడ కూడా మొదలుపెట్టావా?’ అంటాడు కోపంగా. దీప దగ్గుతూనే ఉంటుంది. ‘అసలు..’ అని కార్తీక్ ఆవేశంగా వెనక్కి తిరిగే సరికి.. సౌందర్య వచ్చి.. ‘చక్కర పొంగలి అదే బాగా చేస్తుందని.. నేనే చెయ్యమన్నానురా..’ అంటుంది కూల్‌గా.

ఇంతలో మోనిత అక్కడికి రావడంతో.. ‘చూడు మోనితా ఇంకా అక్కడ నుంచి కదలట్లేదు..’ అని కార్తీక్ అనడంతో.. మోనిత ఓవర్ యాక్షన్ చేస్తూ.. దీప దగ్గరకు వెళ్లి.. ‘అదేంటి దీపా.. కార్తీక్ వద్దంటున్నాడు కదా.. అతడి మాటని కూడా కేర్ చెయ్యవేంటీ? కార్తీక్‌ని ముందు గౌరవించడం నేర్చుకో.. టాబ్లెట్స్ వేసుకుందువు కానీ రా..’ అని దీప చెయ్యి పట్టుకుని లాగుతుంది. దాంతో దీప చెయ్యి వదిలించుకుని.. ‘చెయ్యి వదులే.. ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్? నువ్వు గెస్ట్‌లాగా వచ్చావ్.. గెస్ట్ లాగే ఉండు..’ అని వార్నింగ్ ఇస్తుంది. మరి దీప ఆవేశానికి కార్తీక్ ఎలా రియాక్ట్ అవుతాడో..? మోనిత మరింకేం రెచ్చగొడుతుందో వేచి చూడాల్సిందే.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.