యాప్నగరం

Karthika Deepam Serial ట్విస్ట్: మోనిత కారు కూతలకు ఒక్కటైన దీప, కార్తీక్.. ‘బావతో తొందరపడితే..’

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 జూలై 20)న 1096 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే రేపటి ప్రోమోలో అదిరిపోయే ట్విస్ట్ ఉంది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 20 Jul 2021, 9:24 am
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 జూలై 20)న 1096 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే నేటి కథనంలో దీప ఏసీపీ రోషిణికి అంజీ గురించి చెప్పడంతో.. రోషిణీ అదే పనిలో పడుతుంది. అయితే దీప ఒక పొరబాటు చేసింది. ఏసీపీ రోషిణి ఇగోని హర్ట్ చేసింది. దాంతో కథనం ఆసక్తిగా మారింది. ఆ హైలైట్స్ కోసం ఈ కింద లింక్ క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రోమో హైలైట్స్ చూద్దాం.
Samayam Telugu ‘కార్తీకదీపం’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam serial promo

Karthika Deepam జూలై 20 ఎపిసోడ్: రగిలిపోయిన ఏసీపీ రోషిణి! వంటలక్క తన ఇగో హర్ట్ చేసిందని..
ప్రోమో హైలైట్స్.. karthika deepam serial latest promo
దీప నట్టింట్లో మోనిత దుప్పటి ముసుగుపెట్టి పడుకుంటుంది. దీపకు అనుమానం వచ్చి దుప్పటి తీసి చూసి.. మోనిత నవ్వడంతో షాక్ అవుతుంది. కోపంగా మోనితని బయటికి లాక్కుని వస్తుంది. అయితే బయట క్లినిక్‌లో బాధగా కూర్చున్న కార్తీక్.. మోనిత దీపలని చూసి అక్కడికి వస్తాడు. మోనిత మాత్రం కొంటెగా నవ్వుతూ.. ‘ఎందుకు దీపా అంత కోపంగా చూస్తున్నావ్.. ఒకవేళ నీ సొంత చెల్లెల్ని అయితే కార్తీక్ నా బావ.. నాతో తొందరపడితే.. నేను బలైపోతే.. ఇలాగే వదిలేస్తావా అక్కా?’ అంటూ కారు కూతులు కూస్తుంది. దాంతో కార్తీక్ కోపంగా.. ‘స్టాపిట్ మోనితా..’ అని అరుస్తాడు.

డాక్టర్ బాబు మీరు లోపలికి వెళ్లండి నేను చూసుకుంటాను దీని సంగతి అని దీప నచ్చజెప్పిందో ఏమో కానీ.. కార్తీక్ లోపలికి వెళ్లిపోతాడు. దీప మోనిత కళ్లల్లోకి చూస్తూ తనదైన శైలిలో కనురెప్పలు పైకెత్తి.. ‘లోపల పిల్లలు ఉన్నారు.. లేదంటే అక్కా అన్నందుకు నిన్ను కుక్కని తరిమినట్లు తరిమేసేదాన్ని. జరగదు.. నీకు నా భర్తతో పెళ్లి జరగదు..’ అని దిమ్మతిరిగేలా సమాధానం ఇస్తుంది. దాంతో మోనిత కంగారుగా ‘బె..బెదిరిస్తున్నావా?’అంటుంది. ‘బెదిరించడంలేదే.. భయం పుట్టిస్తాను.. గజగజగజ వణికిస్తాను’ అంటూ మోనిత ముఖంలో రంగులు మారేలా చేస్తుంది మన వంటలక్క. మొత్తానికీ మోనితకు బుద్ది చెప్పడానికి దీప కార్తీక్‌లు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.