యాప్నగరం

Karthika Deepam మే 28 ఎపిసోడ్: దీప చేతులు పట్టుకుని కార్తీక్ క్షమాపణ.. ‘ఘోరమైన అపరాదం చేశాను..

దీప కండీషన్ సీరియస్ కావడంతో కార్తీక్ బెంబేలుపడిపోతాడు. ఈ క్రమంలో కార్తీక్ దీపకు క్షమాపణ చెప్పే సీన్ రేపటి కథనాన్ని ఉత్కంఠగా మార్చేసింది. బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 మే 28)న 1051 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఇప్పుడు karthika deepam serial today may 28 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 28 May 2021, 3:18 pm
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 మే 28)న 1051 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.
Samayam Telugu ‘కార్తీకదీపం’ మే 28 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam May 28 episode


1051వ ఎపిసోడ్‌ హైలైట్స్..
కార్తీక్, సౌందర్య దీప పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ ఉండగా.. భారతి వచ్చి.. ‘పార్మాలటీస్ మరిచిపోయాను.. సైన్ చెయ్యి’ అనడంతో.. సౌందర్య ఎమోషనల్‌గా.. ‘పేషెంట్‌కి ఏం జరిగినా హాస్పెటల్ యాజమాన్యానికి సంబంధం లేదు అని భర్త చేతి సంతకం చేయిస్తున్నావా’ అంటుంది. దాంతో కార్తీక్ ఎమోషనల్‌గా సైన్ చేస్తాడు కానీ.. సౌందర్యకు .. ‘దీపకు ఏం కాదు’ అని ధీమా ఇస్తాడు. ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు. అప్పటికే పిల్లలు దీప కోసం కంగారుపడుతుంటే.. సౌందర్య వచ్చి పిల్లలకు ధైర్యం చెప్పి తినమని పంపిస్తుంది. మనసులో దీప గురించి భయపడటంతో పాటు ఆదిత్య కూడా చెప్పి టెన్షన్ పడుతుంది.

దీపకు ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత ఐసీయూలో పెడతారు. కార్తీక్ సృహలో లేని దీపని బయట అద్దంలోంచి చూస్తూ.. ‘నువ్వు బాగుండాలి దీపా.. నీకేం కాకూడదు.. క్షేమంగా బయటికి రావాలి. ఇక నుంచి నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను దీపా.. కష్టాలే లేని నీ స్వప్నలోకాన్ని నీకు అందిస్తాను’ అంటూ ప్రేమగా కన్నీళ్లతో మనసులో అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే.. దీపకు పల్స్‌ పడిపోయి, ఊపిరి ఆడనట్లుగా గిలగిలా కొట్టుకుంటుంది. ఒక్కసారిగా షాక్ అయిన కార్తీక్.. కంగారుగా పరుగుతీస్తాడు.

భారతి, గోవర్ధన్‌ల దగ్గరకు వెళ్లి.. ‘భారతి.. భారతి.. గోవర్ధన్.. దీపా.. దీపా పల్స్‌రేట్ పడిపోతుంది.. ఊపిరి ఆడక కొట్టుకుంటుంది.’ అని అరుస్తాడు. వాళ్లు కూడా షాక్ అవుతారు. ‘వాట్?’ అంటూ గోవర్ధన్‌తో పాటు భారతి కంగారుపడుతూ.. దీప ఉన్న ఐసీయూలోకి పరుగుతీస్తారు. ‘దీపా.. దీపా’ అంటూ కార్తీక్ కంగారు పడుతూ ఉంటాడు. ‘భారతీ.. ఏంటీ? ఏం అయ్యింది?’ అంటూ అడుగుతూ ఉంటాడు. దీప మాత్రం ఊపిరి అందనట్లుగా అల్లాడిపోతూ ఉంటుంది. అది చూసి కార్తీక్ బాధపడుతుంటే.. గోవర్ధన్ కార్తీక్‌ని ఐసీయూ నుంచి బయటికి పంపించేసే ఎమోషనల్ సీన్ కంటతడి పెట్టిస్తుంది.

సీన్ కట్ చేస్తే.. ప్రియమణి భోజనం తెస్తుంది మోనితకి. కార్తీక్ దీపల గురించి ఆరా తియ్యడంతో ఆ ప్లేట్ విసిరి కొట్టి.. క్లీన్ చెయ్ అంటూ మరో చోటకు వెళ్లి రగిలిపోతుంది మోనిత. ‘దీప అనారోగ్యం కార్తీక్‌లో ఇంత మార్పుకు కారణం అవుతుందని నేను అస్సలు అనుకోలేదు.. ఇన్నాళ్లు దీపకు దూరంగా ఉంటే ఏదొకరోజు నాకు దగ్గర కాకపోతాడా అని ఆశతో ఉండేదాన్ని. కానీ ఈ రోజుతో అది అడియాశేనని తేలిపోయింది. ప్రేమగా కార్తీక్‌ని నా కార్తీక్ అనుకోవడానికి వీల్లేకుండా పోయింది.. నా కార్తీక్‌ని నాకు దూరం చేసిన ఆ దీపని మాత్రం కార్తీక్‌కి దగ్గర అవ్వనివ్వను.. అలాగే ఆ దీపని అస్సలు ఉండనివ్వను. కార్తీక్ దీపలు కలిసి సంతోషంగా ఎలా ఉంటారో నేనూ చూస్తా.. ఛా నన్ను కాదని దీప దగ్గరకు వెళ్లాలని చూస్తున్నావ్ కదా కార్తీక్.. ఇప్పుడే కాదు.. ఇంకో 100 ఏళ్లు అయినా మిమ్మల్ని కలవనివ్వకుండా దూరం చేసే ప్లాన్ నా దగ్గర ఉంది.. ఈ మోనిత అంటే ఏంటో చూపిస్తాను..’ అంటూ రగిలిపోతుంది. కాసేపటికి ప్రియమణిని పిలిచి.. ‘ఇందాక తెచ్చినట్లే మళ్లీ భోజనం తే ఆకలేస్తుంది’ అంటూ తన ఉన్మాదం చూపిస్తుంది.

సీన్ కట్ చేస్తే.. సౌందర్య.. కార్తీక్ మాటలు, బాధా అంతా తలుచుకుంటూ.. ‘అనుమానమే లేదు పెద్దోడు మారిపోయాడు.. దీపని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. కానీ పదేళ్లుగా రాని మార్పు ఈ రెండు రోజుల్లో ఎలా వచ్చింది.? ఏం జరిగి ఉంటుంది? దీపకు ఆరోగ్యం బాలేదని తెలిసిన తర్వాత కూడా ఏవేమో మందులు వేసుకోమన్నాడు తప్పా.. దాంతో ఏ రోజు ఇలా లేడు.. ముభావంగానే ఉండేవాడు. కానీ ఈ ఇంత మార్పు ఏంటీ? పోనీలే మారడేమో అనుకున్నవాడు కాస్త మారాడు. కానీ వాడిలో వచ్చిన మార్పు దీపకు ఉందో లేదో.. అంతా నీదే భారం స్వామీ..’ అని బాధపడుతుంది. కార్తీక్ దీప గురించి బాధపడుతూ ఉండగా.. డాక్టర్ భారతి వచ్చి.. ‘నువ్వు మంచివాడివి కార్తీక్.. నీకు ఆ దేవుడు అన్నాయం చెయ్యడు.. దీప సేఫ్’ అనడంతో సంబరంగా థాంక్స్ చెబుతాడు కార్తీక్.

కమింగ్ అప్‌‌లో
ఐసీయూలో సృహలో లేని దీప దగ్గరకు కార్తీక్ వెళ్లి.. తల నిమురుతూ.. ‘రెండే రెండు రోజులు ఆగు దీపా ప్రపంచంలో ఏ జంట ఇంత ఆనందంగా ఉండరు అనిపించేలా.. మనం ఉందాం..’ అంటాడు. వెంటనే దీప పక్కనే కూర్చుని.. దీప చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని.. ‘నేను నీ విషయంలో చేసింది మామూలు తప్పు కాదు.. క్షమించరాని ఘోరమైన అపరాదం.. వీటన్నింటికీ నేను క్షమాపణ చెప్పుకోవాలి.. ఎంత మంది ముందైతే అవమానించానో అంతమంది ముందు తలవంచి మరీ క్షమాపణ కోరతాను..’ అంటూ దీప చేతుల్ని ముద్దాడతాడు ఏడుస్తూ. ఆ స్పర్శకు దీప కళ్లు తెరిచి చూస్తుంది. ఈ హిట్ సీన్ తరువాయి భాగంలో చూద్దాం! ‘కార్తీకదీపం’ karthika deepam కొనసాగుతోంది.
vadinamma serial today episode
Vadinamma మే 28 ఎపిసోడ్: జనార్ధన్ ప్లాన్ స‌క్సెస్.. తలవంచక తప్పని స్థితిలో రఘురాం కుటుంబంintinti gruhalakshmi today episode Intinti Gruhalakshmi మే 28 ఎపిసోడ్: లాస్యకు మరో ఘోర అవమానం, నందుని ఇరికించేసిన దీపక్guppedantha manasu serial today episode
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.