యాప్నగరం

karthika deepam serial ట్విస్ట్: సౌందర్య, కార్తీక్‌ల ప్రవర్తనలో మార్పు.. వంటలక్కకు మళ్లీ తప్పని కష్టాలు.. మోనిత పరిస్థితి విషమం

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 అక్టోబర్ 22)న 1178 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే రాబోయే ట్విస్ట్ అదిరిపోయింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 25 Oct 2021, 8:13 am
‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021అక్టోబర్ 22)న 1178 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే నేటి కథనంలో మొత్తం కథని పని మనిషి మాలతి మార్చేసింది. మోనిత బెదిరింపులను తాటాకు చప్పుళ్లతో పోల్చిన కార్తీక్.. మోనితనే మంచినీళ్లు తాగించాడు. ఆ సీన్ మాత్రం అదిరిపోయింది. ఇక నేటి ఎపిసోడ్ మిస్ అయ్యి ఉంటే ఈ కింద లింక్ క్లిక్ చేయండి.
Samayam Telugu ‘కార్తీకదీపం’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam serial promo

‘కార్తీకదీపం’ అక్టోబర్ 23 ఎపిసోడ్ : కథ మొత్తాన్ని మార్చేసిన పనిమనిషి మాలతి.. ఇదేం ట్విస్ట్‌రా నాయనా..ప్రోమో హైలైట్స్..
కార్తీక్, సౌందర్య మాట్లాడుకుంటూ ఉంటే.. భారతి హాస్పెటల్ నుంచి కాల్ చేస్తుంది కార్తీక్‌కి. ఫోన్ లిఫ్ట్ చేసిన కార్తీక్.. కోపంగా.. ‘ఏంటి భారతి నీ ఫ్రెండ్ మళ్లీ ఏమైనా కొత్త పథకం ఆలోచించిందా?’ అంటాడు. అయితే భారతి ‘మోనిత నొప్పులు పడుతోంది.. హాస్పెటల్‌లో అడ్మిట్ అయ్యింది..’ అని చెబుతుంది. భారతి వెనుకే మోనిత నొప్పులు పడుతూ కనిపిస్తుంది విజువల్స్‌లో.. ‘అయితే నేనేం చెయ్యాలి? నాకెందుకు చెబుతున్నావ్ భారతి?’ అంటూ అరుస్తాడు కార్తీక్ కోపంగా.. ‘తన పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది.. నువ్వు వస్తేనే కానీ ఆపరేషన్ చేయించుకోను అంటోంది..’ అని భారతి చెప్పడంతో.. ‘నాకేంటి సంబంధం..?’ అని తిట్టి ఫోన్ పెట్టేస్తాడు కార్తీక్.

అంతా విన్న సౌందర్య కార్తీక్‌తో.. ‘అది చేసిన పాపాలకు తనకు ఏమైనా నేను బాధపడనేమో.. కడుపులో పసి బిడ్డ చేసిన తప్పేంట్రా?’ అని జాలిగా అంటుంది. ‘ఎవరి మీద జాలి పడుతున్నావ్ మమ్మీ..?’ అని కార్తీక్ అంటాడు సౌందర్యతో. ఇంతలో ఇద్దరికీ దీప టీ పట్టుకుని మెట్లు ఎక్కి రావడం చూపిస్తారు సీన్‌లో.. ‘చూస్తూ చూస్తూ ఆ పసి ప్రాణాన్ని కళ్ల ముందే.. అలా ఎలా వదిలేస్తాం రా పెద్దోడా’ అంటూ సౌందర్య దీప రావడాన్ని గమనిస్తుంది. వెంటనే కార్తీక్ చేయి కావాలనే తట్టి.. దీప వస్తుంది అని అలర్ట్ చేస్తుంది. అది దీప చూసేస్తుంది. అయితే సౌందర్య మాత్రం ఆ విషయం తెలియకుండా.. మాట మారుస్తూ.. ‘లాయర్ విశ్వం ఫోన్ చేశాడు కదరా..’ అంటుంది. కార్తీక్‌కి కూడా అర్థమై దీపని చూసి మాట మార్చి సమాధానం ఇస్తాడు. దాంతో దీప మనసు నొచ్చుకుంటుంది.

‘నేను రాగానే ఏదో మాట్లాడే మీరు.. మాట మార్చారు కదా ఇద్దరూ.. నాకు అర్థమవుతోంది..’ అంటూ మనసులోనే మథనపడుతుంది దీప ఇద్దరికీ టీలు ఇచ్చి వెనుదిరుగుతూ.. మొత్తానికి సౌందర్య, కార్తీక్‌ల ప్రవర్తన మారింది అని దీప నమ్మడం మొదలుపెడితే.. ముందు ముందు పిల్లల్ని తీసుకుని శ్రీరామ్ నగర్ బస్తీలో ఆ అద్దె ఇంటికి వెళ్లిపోవడం పక్కానే అనిపిస్తోంది. ఎందుకంటే వంటలక్క వస్తుందని అద్దెకు ఇచ్చి ఉండరు కాబోలు.. చూద్దాం ఏం జరగనుందో..
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.