యాప్నగరం

‘కార్తీకదీపం’ ట్విస్ట్! అయ్యో ఆశలన్నీ అడియాసలే.. సౌందర్య వల్ల కూడా కాలేదు..

పాపం దీప.. తిరిగి అత్తింట్లో అడుగుపెట్టడానికి ఏళ్లు పట్టాయి కానీ.. అడుగు పెట్టిన నాటి నుంచీ.. నిత్యం ఏదో సమస్య ఏదో కష్టం.. కన్నీళ్లతో దినదినగండంగా గడుపుతూనే ఉంది. మొత్తానికి ఊహించని మలుపుతో తిరిగి ఇళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 23 Oct 2020, 4:18 pm
రోజు రోజుకి కొత్త ట్విస్ట్‌లతో కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్‌లో నేటి(అక్టోబర్ 21) ఎపిసోడ్ మరింత ఆసక్తిగా మారింది. ఎక్కడో పడి ఉన్న ఫోటో ఎలా బయటికి వచ్చింది? హిమకి ఎలా తెలిసింది? మీరిద్దరూ కుట్ర చేసి ఇలా హిమ దగ్గర నన్ను ఇరికించారు.. అంటూ రగిలిపోయాడు కార్తీక్. అయితే దీప కూడా గట్టిగానే నిలదీస్తుంది. కానీ కార్తీక్ పూల కుండీలు పగలగొట్టి.. కాలితో తన్నుతూ ఆవేశంతో ఊగిపోతాడు. దాంతో దీప మనసు విరిగిపోతుంది.
Samayam Telugu ‘కార్తీకదీపం’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)
Karthika Deepam Telugu Serial Promo


హిమకి తెలియడం మంచికే.. దీప ఇక్కడ ఎందుకు ఉంది అన్న ప్రశ్నకి సమాధానం దొరికింది.. అంటూ సౌందర్య కార్తీక్‌కి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. అయితే కార్తీక్ మాత్రం.. ‘ఇప్పుడు హిమ మీరు దూరంగా ఉంటానికి కారణం ఏంటి అని అడుగుతుంది.. చెప్పమంటారా? నాకు తెలిసింది చెప్పనా? జరిగింది చెప్పానా? లేక ఇది(దీప) నాకు చేసిన మోసం గురించి చెప్పానా’ అంటూ ఆవేశంతో రగిలిపోతాడు.
Read also: ‘కార్తీకదీపం’ అక్టోబర్ 21 ఎపిసోడ్! అసలు విషయాన్ని బయటపెట్టిన సౌందర్య.. అయినా చల్లారని కార్తీక్..

అయితే రేపటి ప్రోమోలో.. దీప, సౌర్యలు బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్లడానికి బయలుదేరతారు. ఇద్దరూ ఏడుస్తూ కిందకి దిగడంతో సౌందర్య కూడా చాలా ఏడుస్తుంది. దీప సౌందర్య కాళ్లకు మొక్కి బ్యాగ్ అందుకుంటుంది. అయితే సౌందర్య బాధా.. ‘దీపా.. నువ్వు నాకో సాయం చెయ్యవే.. నువ్వు ఏడవకుండానే ఈ గుమ్మం దాటవే.. లేదంటే నీ కన్నీళ్లు నా వంశానికి తీరని నష్టాన్ని కలిగిస్తాయేమోనని చాలా భయంగా ఉందే’ అనడంతో.. దీప కన్నీళ్లు తుచుకోవడం ప్రేక్షకుల గుండెల్ని మెలిపెడుతుంది.సౌర్య కూడా కన్నీళ్లు తుడుచుకుంటుంది. అయితే దీప, సౌర్యలు బయలుదేరుతున్న సమయంలో ఎదురుగా కార్తీక్ రావడంతో సీన్ మరింత ఎమోషనల్‌గా మారింది. అయితే హిమ ఎంట్రీ ఇచ్చి దీపని ఉండమని చెబుతుందా? లేక కార్తీక్ మరిన్ని మాటలు అని పంపిస్తాడా అనేది చాలా ఉత్కంఠగా మారింది.
See Pics: అపరంజి బొమ్మలా వంటలక్క.. ఏ గెటప్ అయినా ఔరా అనాల్సిందే..
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.