యాప్నగరం

‘కార్తీకదీపం’ ట్విస్ట్! ఇంకా ఇంకా రెచ్చగొట్టేసిన మౌనిత.. ‘హిమ విహారీకి పుట్టిన కూతురని..’ కార్తీక్‌ని నమ్మిస్తూ..

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. 903 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని.. నేడు(డిసెంబర్ 8)న 904 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే రేపటి ప్రోమో ఉత్కంఠగా మారింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 9 Dec 2020, 7:43 am
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(డిసెంబర్ 8)న 904 ఎపిసోడ్‌కి ఎంటరైన సంగతి తెలిసిందే. అయితే నేటి ఎపిసోడ్‌లో మౌనిత చాలా తెలివిగా పాముని కదిపింది. కార్తీక్‌కి నిజం చెబుతూనే అనుమానంగా ఉంది అంటూ అంతా చెప్పేసింది. కార్తీక్ ఆవేశంతో అనుమానంతో బయలుదేరగానే.. మనసులో చాలా సంతోషపడిపోతుంది. ‘ఇన్నాళ్లకు నా కసి తీరింది. కార్తీక్ మనసులో విషభీజాన్ని నాటాను..దీపా.. ఇక నీకు కౌన్‌డౌన్ మొదలైంది..’ అనుకుంటుంది కూడా.
Samayam Telugu ‘కార్తీకదీపం’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam serial promo

Read also: ‘కార్తీకదీపం’ డిసెంబర్ 8 ఎపిసోడ్! అన్నంత పని చేసిన మౌనిత! కార్తీక్‌కి ‘కవలల్లో ఒకరు హిమ’ అని చెప్పేసి..

ప్రోమో హైలైట్స్..
మౌనిత రాజేసిన అనుమానంతో.. కార్తీక్ కారులో వెళ్తూ వెళ్తూ.. ఏవో పేపర్స్ పట్టుకుని.. తనలో తనే మదనపడతాడు. ‘ఒకవేళ మౌనిత అనుమానమే నిజమైతే? హిమ దీప కూతురే అయితే..? హిమని నా సొంత కూతురిలా చూడగలనా? అలాగని వెళ్లగొట్టగలనా?’ అంటూ బాధపడుతుంటాడు. సీన్ కట్ చేస్తే.. అదే అనుమానంతో.. బాధతో.. మౌనితకి ఫోన్ చేసి.. ‘హిమని తీసుకుని దూరంగా వెళ్లిపోతాను’ అని కార్తీక్ అనడంతో.. మౌనిత మరింత రెచ్చిపోతుంది.

‘నువ్వు చెప్పింది కరెక్టే కార్తీక్.. హిమని వీళ్లందరికీ దూరంగా తీసుకుని వెళ్తావ్ సరే.. అక్కడికి వెళ్లాక హిమని చూసిన ప్రతిసారీ.. హిమ విహారీకి పుట్టిన కూతురని.. గుర్తుకురాదా?’ అని మౌనిత తనకు అనుకూలమైన మరో పాయింట్ చెప్పడంతో కార్తీక్ అసహనంగా బాధగా ఫోన్ కట్ చేసి.. కళ్లు మూసుకుని తనలో తనే ఆవేదన చెందుతాడు. అయితే దీప హిమకోసం ఆలోచిస్తూ బాధపడుతుంది. ‘హిమ మన గురించి అంతగా ఆలోచించడం నచ్చక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని భయంగా ఉంది..’ అంటూ ఉంటుంది దీప. కారులో ఉన్న కార్తీక్.. ‘నిజమేంటో తేలే వరకూ నిద్రపోను..’ అని గట్టి నిర్ణయం తీసుకుంటాడు. దీంతో కథ ఉత్కంఠగా మారింది.
Read also: సాయి ధరమ్ తేజ్ పోస్ట్‌పై వంటలక్క ఫ్యాన్స్ హర్టూ.. సెటైర్లు మామూలుగా లేవు
Read also: ‘ఇంటింటి గృహలక్ష్మి’ డిసెంబర్ 8 ఎపిసోడ్! కంటతడి పెట్టించే ఎమోషనల్ సీన్! ‘నా మూలంగా బాధపడుతున్నావా తులసి..?’
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.