బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 706 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని.. 707 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (జనవరి 17) రాత్రి ఎపిసోడ్లో ఏం జరగనుందో ‘సమయం’లో ముందుగానే మీకోసం.
Samayam Telugu17 Jan 2020, 10:08 pm
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 706 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని.. 707 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (జనవరి 17) రాత్రి ఎపిసోడ్లో ఏం జరగనుందో ‘సమయం’లో ముందుగానే మీకోసం.
గత ఎపిసోడ్లో ఏం జరిగిందంటే...
‘ఒకవేళ విడాకుల గురించి తెలిసి నాతో మాట్లాడకపోతే? నో అలా జరగడానికి వీళ్లేదు.. హిమకి సర్దిచెప్పాలి’ అనుకుంటూ మనసులో ఆవేదన చెందుతాడు కార్తీక్. ఇంతలో హిమ కళ్లు తెరుస్తుంది. ‘గుడ్ మార్నింగ్ హిమా..’ అంటాడు నవ్వుతూ.. ‘గుడ్ మార్నింగ్ డాడీ’ అంటూ లేస్తుంది. ‘ఎలా ఉందిరా? నీరసంగా ఉందా?’ అంటూ పలకరిస్తూనే.. ‘మనం ఈ రోజు బయటికి వెళ్దాం.. నెమ్మదిగా లేచి రెడీ అవ్వు. ఈ లోపు చిన్న పని ఉంది. అది చూసుకుని వచ్చేస్తాను’ అంటాడు. హిమ సరేనంటుంది. photo courtesy star maa and hotstar
దాంతో కార్తీక్ కిందకు దిగుతాడు. ఇంతలో సౌందర్య పాల గ్లాసుతో హిమ దగ్గరకు వెళ్లడం చూసిన కార్తీక్.. ‘పద మమ్మీ..’ అంటాడు. ‘అంటే ఏంట్రా? హిమకి నేను అన్ని నూరిపోస్తున్నాననా?’ అంటుంది కోపంగా. ‘అవును మమ్మీ.. మీరు చెప్పకుండా పసిదాని మనసులో అలాంటి ప్రశ్నలు రావని నాకు తెలుసులే’ అంటూ పాలు గ్లాస్ తీసుకుని హిమ దగ్గరకు వెళ్తాడు కార్తీక్. ‘అనుమానం పుట్టి తర్వాత వీడు పుట్టాడు.. అయినా కన్నది నేనేగా’ అంటూ తల కొట్టుకుంది సౌందర్య. photo courtesy star maa and hotstar
దీప సౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. ‘పాపం అది(సౌర్య) తినకుండానే పడుకుంది. నాలుగు తగిలించి తినిపించాల్సింది. అత్తమ్మ అని పేరు పెట్టుకున్నందుకు నేను ఆ పని చెయ్యలేకపోయాను.. అయినా రాత్రంతా ఆ మహానుభావుడు(కార్తీక్) ఆలోచనల్తోనే ఉండిపోయాను..’ అనుకుంటుంది మనసులో... photo courtesy star maa and hotstar
‘నేను స్కూల్‌కి వెళ్తున్నాను.. నేను స్కూల్‌కి వెళ్తున్నాను..’ అంటూ ఉంటుంది సౌర్య దీప దగ్గరకు వచ్చి. ‘వెళ్లు.. ఎన్నిసార్లు చెబుతావ్?’ అంటుంది దీప ఆలోచనల్లో ఉండి. ‘అంటే.. నేను తినకపోయినా ఫర్వాలేదా? రాత్రి అలానే వదిలేశావ్? ఇప్పుడూ అంతేనా? చిన్నపిల్లని నాకు ఆకలి వెయ్యదా?’ అంటుంది సౌర్య అమాయకంగా ముఖం పెట్టి.. photo courtesy star maa and hotstar Read also: ‘ఆమెకథ’ జనవరి 16 ఎపిసోడ్: నట్టింట్లోనే రొమాన్స్! అందరి ముందూ రాణీకి పట్టపురాణి హోదా?
రాత్రి ఏమైంది?
‘అది కాదు అత్తమ్మా.. నాకు మాత్రం పంతం ఉండదా? రాత్రి బాధలో ఉండి.. నిన్ను పట్టించుకోలేదమ్మా.. సారీ.. ఇప్పుడు నీకు ఇష్టమని ఇడ్లీ, పల్లీల చెట్టీ చేశాను.. రా తిందువు గానీ’ అంటుంది గారం చేస్తూ.. దాంతో సౌర్య తగ్గి.. ‘రాత్రి ఏమైంది?’ అంటూ ఆరా తీస్తుంది. ‘అబ్బే ఏం కాలేదు.. తిందువు గానీ రా’ అంటూ మాట మార్చి హిమకు టిఫెన్ పెడుతుంది దీప. photo courtesy star maa and hotstar
ప్రియమణి రచ్చ..
మౌనిత, ప్రియమణి.. ఉదయాన్నే.. ఉల్లిపాయలు కొనడానికి బయలుదేరతారు. దారిలో ఓ దొంగ ప్రియమణి మెడలో గొలుసు కొట్టెయ్యడానికి ప్రయత్నిస్తాడు. దాంతో వాడ్ని పట్టుకుని చితక్కొడుతుంది ప్రియమణి. ఇంతలో పోలీస్ పరుగున వచ్చి.. ‘నాకు అప్పగింజమ్మా’ అనడంతో.. ‘నేను ఫుల్‌గా కోటింగ్ ఇచ్చాకా అప్పుడు అప్పగిస్తాను.. నేను మంగళవారం సంతలో ఇష్టపడి 20 రూపాయలు పెట్టి కొన్న గొలుసు కొట్టేస్తాడా?’ అనడంతో మౌనిత, పోలీస్, ఆ దొంగ నోరు వెళ్లబెడతారు ‘20 రూపాయలకు ఇంత కోటింగా?’ అన్నట్లుగా.. photo courtesy star maa and hotstar
అక్కా నువ్వు దేవతవే..
ఇంతలో కార్తీక్ అక్కడకి వస్తాడు. దొంగను పోలీస్ తీసుకుని వెళ్తుంటే.. దొంగ తన పర్స్ పాడేసుకుంటుంది. అది తీసి చూసిన మౌనిత.. పోలీస్‌ని, దొంగని వెనక్కి పిలిచి.. పర్స్ దొంగకు ఇచ్చి.. ‘వీడ్ని వదిలెయ్యండి’ అని పోలీస్‌కి చెబుతుంది. ‘అక్కా నువ్వు దేవతవే.. ఇలాంటి దేవతలు జైల్లో కూడా దొరకరు. అక్కా పర్స్ ఇవ్వడమే కాకుండా నన్ను వదిలెయ్యమని ఎందుకు చెబుతున్నావ్ అక్కా?’ అని ఆ దొంగ అడిగితే.. ‘రేయ్ పోయి బతకరా’ అంటూ తిట్టి పంపించేస్తుంది. పక్కనే ఉన్న కార్తీక్.. ‘ఎందుకు వాడ్ని వదిలెయ్యమన్నావ్?’ అంటాడు. ప్రియమణి ఏమో.. ‘గొలుసు బంగారం కాకపోయినా దొంగతనం దొంగతనేమే కదమ్మా’ అంటూ గింజుకుంటుంది. photo courtesy star maa and hotstar
మౌనిత కొంటె వేషాలు..
ఇంతలో మౌనిత కార్తీక్ వైపు ఓరగా చూస్తూ.. ‘వాడి పర్స్ చూశాను కదా నేను. అందులో వాడి పేరు కార్తీక్ అని ఉంది. అందుకే వదిలెయ్యమన్నాను’ అంటుంది. కార్తీక్ మాత్రం మౌనిత పాయింట్‌ని క్యాచ్ చెయ్యకుండా.. ‘వాడు పర్స్ కొట్టేసిన వాడి పేరు కూడా కార్తీక్ అయ్యుండొచ్చుగా’ అంటాడు. ‘అయినా నువ్వేంటి ఇక్కడా?’ అని కార్తీక్‌ని మౌనిత అడగడంతో.. ‘నీ కోసమే వచ్చాను.. నువ్వు లేకపోయేసరికి తిరిగి వెళ్తున్నాను’ అంటాడు కార్తీక్. వెంటనే పద కార్తీక్ వెళ్తాం.. అంటూ కారు ఎక్కి కార్తీక్‌ని ఇంటికి తీసుకుని వెళ్తుంది మౌనిత. photo courtesy star maa and hotstar
సౌందర్య ఆరాలు..
హిమ పైనుంచి కిందకు రావడంతో.. సౌందర్య హిమని దగ్గరకు తీసుకుని ‘పైనే కూర్చోచ్చుగా నీరసంగా కిందకెందుకు దిగావ్?’ అంటుంది. బోరు కొడుతుంది నాన్నమ్మా అన్న హిమ మాటలకు.. ‘బోర్నే నువ్వు కొట్టాల్సింది’ అంటూ జ్యోక్ చేసి నవ్విస్తుంది. తర్వాత మచ్చిక చేసుకుని అసలు ఏం జరిగింది? విడాకుల విషయం నీకు ఎలా తెలిసింది? మీ నాన్నని ఏం ప్రశ్నలు వేశావ్?’ అంటూ అన్నీ ఆరా తీస్తుంది. photo courtesy star maa and hotstar
హిమను రెచ్చగొట్టి...
హిమ.. సౌందర్య అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పిన తర్వాత.. ‘నాన్నమ్మా నువ్వు చెప్పు.. మా అమ్మ నిజంగానే లేదా? మా డాడీ విడాకులు ఎవరికి ఇస్తున్నాడు?’ అని అడుగుతుంది. ‘నీకు మీ అమ్మ చనిపోయిందని చెప్పింది ఎవరో? విడాకులు ఎవరు ఇస్తున్నారు?’ అని రివర్స్‌లో అడుగుతుంది సౌందర్య. ‘డాడీ’ అంటుంది హిమ.
photo courtesy star maa and hotstar
ఇక నుంచి నీ పని అదే..
‘మరి మీ డాడీనే అడుగు.. ఇక నుంచి నీ పని అదే.. విడాకులు ఎవరికి ఇస్తున్నావ్? మా అమ్మ ఎవరు? అని అడిగి తెలుసుకోవడమే.. ఇక నుంచి నీ పని అదే. ఇల్లు పీకి పందిర వెయ్యి. ఊరంత ఏకం చెయ్యి. ఆ వివరాలు తెలుసుకునే దాకా వదిలిపెట్టకు. బాగా గుర్తు పెట్టుకో. నేను నీకేం చెప్పలేదు. నువ్వేం వినలేదు. సరేనా? అర్థమైందా?’ అంటూ బాగా ఎక్కిస్తుంది. హిమ సరే అంటుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కార్తీకదీపం కొనసాగుతోంది.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.