యాప్నగరం

Ennenno Janmala Bandham డిసెంబర్ 5: ఆదిత్య చెంప పగలగొట్టిన వేద! యాక్సిడెంట్ చేశాడని తెలిసి..

Ennenno Janmala Bandham december 5 episode: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్.. నేడు(2022 డిసెంబర్ 5)న 297 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Ennenno Janmala Bandham december 5 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 6 Dec 2022, 7:02 am
ఓ వైపు కోర్టు కేసులు, వాయిదాలు నడుస్తున్నాయి. యష్.. మాళవిక తరపున పోరాడుతుంటే.. వేదా మాళవిక ఓడించాలని ట్రై చేస్తుంది. మరోవైపు అభికి.. నిజం తెలిసింది. యాక్సిడెంట్ చేసింది మాళవిక కాదు.. ఆదిత్య అని.. యష్, మాళవికలు మాట్లాడుకుంటూ ఉంటే.. అభి వినేస్తాడు. ఇక దెబ్బ కొట్టడానికి అదే విషయం వేదాకి చెప్పాలని డిసైడ్ అవుతాడు. మరోవైపు.. యష్, వేదాలు నిత్యం డిష్యూం డిష్యూం అంటూ కొట్టుకోవడం తిట్టుకోవడం నచ్చని ఖుషీ రెస్టారెంట్‌కి ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే నేటి కథనం ఆసక్తిగా సాగింది.
Samayam Telugu Ennenno Janmala Bandham december 5 episode
‘ఎన్నెన్నో జన్మల బంధం’ డిసెంబర్ 5 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)


297 ఎపిసోడ్‌ హైలైట్స్..
ఖుషి, వేదా, యష్‌లు రెస్టారెంట్‌కి వెళ్తారు. వేదా, యష్‌లు ముఖం ఉమ్ అని పెట్టుకుని కూర్చోవడం చూసిన ఖుషీ.. ‘పదండి ఇంటికి పోదాం.. మీరు ఇలానే ఉంటే నాకేం హ్యాపీగా ఉంటుంది’ అంటూ అలుగుతుంది. ఇక ఖుషీని కూల్ చేయడానికి.. వేదా, యష్‌లు కలిసే ఉంటారు. ప్రేమగా మట్లాడుకుంటారు. ఒకరి ఇష్టాలు ఒకరు చెబుతూ.. ఖుషీతో సంతోషంగా గడుపుతారు. ఇద్దరూ కలిసి ఖుషీ కోరినట్లే అక్కడ డాన్స్ కూడా చేస్తారు. ఇక ఇంటికి తిరిగి వస్తారు.

అప్పుడు ఖుషీ మాలనీతో.. ‘నాన్నమ్మా అమ్మా, డాడీ కలిసిపోయారు. ఫ్రెండ్స్ అయిపోయారు.. నేను చాలా హ్యాపీగా ఉన్నాను’ అంటూ చెబుతుంది. ఇక పడుకోనే సమయం వచ్చేసరికి.. ‘ఖుషీ తల్లీ నువ్వు డాడీతో పడుకో.. నేను బయట పడుకుంటాను’ అంటుంది వేద. ఆ మాటకి ఖుషీ మళ్లీ అలుగుతుంది. ‘మీరు మళ్లీ మొదలుపెట్టారా?’ అంటుంది. దాంతో వేదా.. ‘ఖుషీ తల్లీ కేవలం నీకోసమే నీ దగ్గర పడుకుంటాను’ అంటుంది. ‘కేవలం నీ కోసమే నేను ఇక్కడ పడుకున్నాను’ అంటూ దుప్పటి ముసుగుపెట్టుకుంటాడు యష్. ఆ సీన్ కామెడీ నడుస్తుంది.

ఇక కమింగ్ అప్‌లో..
వేదా.. స్కూల్లో ఆదిత్యని తన స్నేహితులతో ఉన్నప్పుడు చూస్తుంది. ఆదిత్య తన కారు డ్రైవర్ దగ్గర నుంచి కారు కీ తీసుకుని.. డ్రైవర్‌ని తిట్టి తనే కారు డ్రైవ్ చేయడానికి కారు కీ పట్టుకుని కారు ఎక్కేందుకు ట్రై చేస్తూ ఉంటాడు. అది చూసిన వేదా.. ‘ఆదిత్యా.. చిన్న పిల్లాడివి అప్పుడే నీకు కారు ఎందుకు?’ అని తిడుతుంది. కార్ కీ తిరిగి ఇచ్చేయ్ అని తిడుతుంది. వినడు ఆదిత్య. ‘నేను ఇవ్వను.. అడగడానికి నువ్వు ఎవరు?’ అంటూ గట్టిగా ఫైర్ అవుతాడు. దాంతో ఆదిత్య చెంప పగలగొడుతుంది వేద.

సీన్ కట్ చేస్తే.. ఆ కారు డ్రైవర్ వేదాతో.. ‘ఈ పని వాళ్ల అమ్మ ఎప్పుడో చేసి ఉంటే బాగుంది.. అసలు ఆ రోజు మీ అమ్మగారిని కారు యాక్సిడెంట్ చేసింది మాళవిక గారు కాదు.. ఆదిత్య బాబే’ అని డ్రైవర్ నిజం చెప్పేస్తాడు. షాక్ అయిపోతుంది వేదా. ఇప్పుడు యష్ బాధేంటో వేదకు అర్థమవుతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Ennenno Janmala Bandham కొనసాగుతోంది. (photo courtesy by star మా and disney+ hotstar)
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.