యాప్నగరం

‘కోయిలమ్మ’ అక్టోబర్ 8 ఎపిసోడ్‌ : ఇంద్రజపై మనోజ్ ఫైర్! ‘నీ గురించి నాకు బాగా తెలుసు!’

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కోయిలమ్మ’ సీరియల్ 681 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 682 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం.

Samayam Telugu 8 Oct 2019, 5:27 pm
తను ప్రాణంగా ప్రేమించిన చిన్నీ.. తనని మోసం చేసి తన అన్న అమర్‌నే పెళ్లి చేసుకుందని తెలిసిన సమీర్.. మొదట్లో చిన్నీని ధ్వేషించినా.. కొన్నాళ్లకి నిజం తెలుసుకున్నాడు. చిన్నీ జీవితం గురించి, కష్టాల గురించి తెలుసుకుని ఆమెని గౌరవించడం మొదలు పెట్టాడు. అదంతా సమీర్ భార్య సింధూకి నచ్చలేదు. దాంతో చిన్నీని ఇరికించేందుకు చిన్నీ భర్త అమర్ దగ్గర.. వీళ్ల ప్రేమ, స్నేహం గురించి బయటపెట్టేసింది. అయితే అమర్ అనుమానించకుండా చిన్నీని నమ్ముతూ వచ్చాడు. కానీ సింధూ అక్కడితో ఆగలేదు. తెలుగులోగిల్లో సరికొత్త రాగాలను పలిగిస్తున్న కోయిలమ్మ కథ (అక్టోబర్ 8) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం!
Samayam Telugu KOILAMMA 123


గత ఎపిసోడ్‌లో జరిగిన కథ..
అమర్ సింధూ పంపించిన ఫొటో(సమీర్ చిన్నీలు ప్రేమించుకున్నారనే విషయాన్ని నమ్మించేందుకు చిన్నీ, సమీర్ కలిసి ఉన్న డ్రాయింగ్) చూసి.. చాలా బాధపడతాడు. పెద్దపెద్దగా కేకలు వేస్తూ అరుస్తాడు. అతడికి ఉన్న ఫైర్ ఫోబియా జబ్బు రావడంతో ఇంట్లో వాళ్లంతా టెన్షన్ పడతారు. సింధూ ఫోన్ చూసుకుంటూ.. ‘అమ్మో బావ(అమర్)గారికి ఈ నంబర్ నుంచి ఆ ఫోటో పంపించాను.. తిరిగి ఈ నంబర్‌కి ఫోన్ చేస్తారేమో’ అనుకుంటూ సిమ్ తీసేస్తుంది. సరిగ్గా అప్పుడే వచ్చిన సమీర్ ‘ఏంటి సింధూ? సిమ్ తీశావ్?’ అంటాడు. ఆ విషయం సమీర్‌కి డౌట్ రాకుండా జాగ్రత్తపడిపోతుంది సింధూ.

682 ఎపిసోడ్‌లో హైలైట్స్‌..
ఇంద్రజతో సింధూ మాట్లాడిన మాటలు మనోరమా వినేస్తుంది. ‘మమ్మీ ఆ చిన్నీ గతం గురించి తెలుసుకుంటే ఆ అమర్ తన్ని తరిమేస్తాడనుకుంటే అలా ఏం జరగలేదు’ అంటూ సింధూ ఇంద్రజతో చెబుతుంది. ఇంద్రజ సింధూకి కొన్ని జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అయితే అదంతా విన్న మనోరమా సింధూని ఆరా తీస్తుంది. అయితే సింధూ రివర్స్ అయిపోతుంది. ‘మీకు మా పర్సనల్స్ అనవసరం అంటూ చెడామడా తిట్టేస్తుంది. దాంతో మనోరమా ఇగో దెబ్బతింటుంది.

మీరు ‘కోయిలమ్మ’ సీరియల్ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యారా? అన్ని ఎపిసోడ్‌లు ఒక్క క్లిక్‌తో!

ఇంద్రజ చాలా హ్యాపీగా ఉంటుంది. తల్లి జగదాంబతో ‘మమ్మీ.. మన సింధూ అతి కొద్దిరోజుల్లో ఆ అత్తగారి ఇంట్లో చక్రం తిప్పేస్తుంది.. అన్నీ నా పోలికలే’ అంటూ చాలా సంబరపడిపోతుంది. అయితే అదే టైమ్‌కి మనోజ్ తన అన్న అశోక్ కుమార్, వదిన లక్ష్మీలతో కలిసి లోనికి వస్తాడు. ఇంద్రజ మాటలన్నీ వినేస్తాడు. దాంతో ‘నీ గురించి నాకు బాగా తెలుసు ఇంద్రజా.. అత్తింట్లో చక్రం తిప్పడంలాంటి మాటలు సింధూకి చెప్పడం మానుకో..!’ అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

చిన్నీ తన స్నేహితురాలు ఉపలక్షితతో మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో సమీర్ చిన్నీని, అమర్‌ని వెతుకుతూ ఉంటాడు. చిన్నీ కనిపించినా కనిపించనట్లుగా నటిస్తూ.. సింధూ చిన్నీని, సమీర్‌ని అమర్ దగ్గర ఇరికించే ప్లాన్ చేస్తుంది. చిన్నీ ఫోన్ మాట్లాడుకుని లోనికి వచ్చేసే సరికి సింధూ కావాలనే.. ‘నీ కోసం సమీర్ తెగ వెతుకుతున్నాడు’ అని చెబుతుంది.

కమింగ్ అప్‌లో...చిన్నీ, సమీర్‌లు మాట్లాడుకుంటూ ఉంటారు. ‘మా అన్నయ్య చాలా అమాయకుడు వదినా’ అని సమీర్.. ‘అలాంటి వాళ్లే కొన్ని సార్లు ప్రమాదం’ అని చిన్నీ మాట్లాడుకుంటారు. ఆ మాటలు విన్న అమర్‌కి మరింత అనుమానం బలపడుతుంది. ఇంతలో సింధూ అమర్ దగ్గరకు వచ్చి.. ‘ఏంటి బావగారూ? మీ పరిస్థితి నా పరిస్థితి ఇంతేనా? మనం ఇలా బాధపడుతూ ఉండాల్సిందేనా.’ అంటుంది. సింధూ చేస్తున్న కుట్రను చిన్నీ,సమీర్‌లు తెలుసుకోగలరా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కోయిలమ్మ కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.