యాప్నగరం

లాక్ డౌన్‌లో ధాన్యం పని చేస్తున్న జబర్దస్త్ కమెడియన్.. కష్టంలో తోడున్న వ్యవసాయం

Comedian Jeevan: ఆర్థిక వ్యవస్థలు మొత్తం కుప్పకూలిపోతున్న సందర్భంలో ఏ రంగాన్ని నమ్ముకున్నా గుప్పెడు అన్నం దొరుకుందో లేదో అన్న దిక్కుతోచని పరిస్థితుల్లో వర ప్రదాయినిగా మారింది వ్యవసాయం.

Samayam Telugu 4 May 2020, 8:00 pm
కరోనా వైరస్ చేసిన నష్టం లెక్కలు కట్టలేనిదే. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి.. కోలుకోలేని దెబ్బ కొట్టింది. అదే సందర్భంలో బిజీ లైఫ్‌లో మానవ జాతి దూరం పెట్టిన బంధాలు, బంధుత్వాలు, పరిశుభ్రత లాంటి కూడా చేరువయ్యాయి. ఇంట్లో ఫ్యామిలీ సభ్యులతో గడపడం.. బంధాలకు విలువ ఇవ్వడం.. ఇంట్లోనే తింటూ వంట చేసుకోవడం... అలాగే ఎప్పుడో వదిలేసిన కులవృత్తుల్ని వాళ్లే చేసుకోవడం.. స్వయంగా వ్యవసాయం చేయడం లాంటివి ఈ లాక్ డౌన్‌లో ఎక్కువగా కనిపించాయి.
Samayam Telugu జబర్దస్త్ కమెడియన్ జీవన్
Jabardasth Comedian Jeevan


ఇక టీవీ, సినిమా రంగంలోనూ షూటింగ్‌లు లేకపోవడంతో.. వారి వారి సొంత పనులు చేసుకుంటూ బిజీగా ఉన్నారు సెలబ్రిటీలు. తాజాగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లేకపోవడంతో సొంత ఊరుకి వెళిపోయి వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు జబర్దస్త్ కమెడియన్ జీవన్. తనకు సంబంధించిన భూమిలో పండిన వరిని నూర్చి.. ఎగరబోస్తూ ధాన్యాన్ని సేకరిస్తున్నాడు జీవన్. వడ్లను తూర్పారపడుతూ ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనం ఎక్కడ ఉన్న మన వెనుకటి గతాన్ని మరిచిపోకూడదని.. ఒకవేళ మన స్థితి బాలేకపోతే నువ్ ఎలాంటి స్థితిలో ఉన్నా తిరిగి నీకు అన్నం పెట్టే గొప్ప వరం ఈ వ్యవసాయం, ఆర్భాటం కోసం దాన్ని మనం వదిలేసినా.. ఆపదలో తోడుగా ఉండి అన్నం పెట్టే అన్నపూర్ణగానే ఉంటుంది వ్యవసాయం’ అంటూ ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.