యాప్నగరం

మాట్లాడేటప్పుడు కాస్త చూసుకొని మాట్లాడు! ఇంకెన్నాళ్లు ఇలా.. వర్ష సీరియస్ వార్నింగ్

పలు స్పెషల్ ఈవెంట్స్‌లో ఇమ్మానుయేల్- వర్ష పెళ్లి చేసేయడంతో వీరి నడవడికపై పలు అనుమానాలు రేకెత్తాయి. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ తెగ వార్తలు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఓ ప్రోమో వీడియో నెట్టింట సంచలనంగా మారింది.

Samayam Telugu 14 Mar 2022, 1:20 pm
జబర్దస్త్ వేదికపై ఎన్నో జోడీలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి జోడీల్లో ఒకటే ఇమ్మానుయేల్- వర్ష. ఎన్నో జబర్దస్త్ ఎపిసోడ్స్, స్పెషల్ షోస్‌లో వీళ్లిద్దరి రొమాంటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరింది. పైగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ బయటకు రావడం, దానికి తోడు స్పెషల్ ఈవెంట్స్‌లో ఇమ్మానుయేల్- వర్ష పెళ్లి కూడా చేసేయడంతో వీరి నడవడికపై పలు అనుమానాలు రేకెత్తాయి. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ తెగ వార్తలు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఓ ప్రోమో వీడియో నెట్టింట సంచలనంగా మారింది. దానికి కారణం లవ్ బర్డ్స్ ఇమ్మానుయేల్- వర్ష మధ్య వార్.
Samayam Telugu మాట్లాడేటప్పుడు కాస్త చూసుకొని మాట్లాడు..!  వర్ష సీరియస్ వార్నింగ్
Varsha


ఇప్పటివరకు రొమాంటిక్ స్కిట్స్ చేసి ఆకర్షించిన ఇమ్మానుయేల్- వర్ష జోడీ ఈ సారి మాటల యుద్ధంతో అనుమానాలు నెలకొల్పారు. ఇమ్మానుయేల్ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంది వర్ష. అంతేకాదు ఇంకెన్నిసార్లు ఆ మాటలు భరించాలి అంటూ ఎమోషనల్ అయింది. దీంతో అక్కడే ఉన్న హైపర్ ఆది, ఇతర కమెడియన్స్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినా ఫలితం లేదు.

ప్రతి పండగకు జబర్దస్త్ కమెడియన్లందరినీ ఒక్కచోట చేర్చి స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటుంది మల్లెమాల టీమ్. ఈ క్రమంలోనే హోళీ పండగ సందర్భంగా 'రంగ్ దే' అంటూ ఓ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కి పృథీరాజ్, సంపూర్ణేష్ బాబు లాంటి గెస్టులను కూడా ఆహ్వానించారు. మార్చి 20న ఈ షో ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ చేయగా.. ఈ ప్రోమో వీడియోలో లవ్ బర్డ్స్ ఇమ్మానుయేల్- వర్ష మధ్య నడిచిన వార్ హైలైట్ అయింది.
రాధే శ్యామ్ 3 డేస్ కలెక్షన్స్.. థియేటర్లలో ప్రభాస్ మేనియా ఎలా ఉందంటే?
వర్ష మగాడిలా ఉంటుందంటూ ఈ మధ్య చాలా మంది ఆమెపై పంచులేస్తున్నారు. సరిగ్గా అదే పాయింట్ తీసుకొని వర్ష మగాడంటూ కాస్త వెటకారంగా మాట్లాడాడు ఇమ్మానుయేల్. దీంతో వర్ష ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. 'ఇంకెన్ని రోజులు ఈ మాటలు భరించాలి? మాట్లాడొచ్చు గానే కాస్త మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడు' అంటూ స్టేజ్ దిగి వెళ్ళిపోయింది వర్ష. ఏదో సరదాగా అన్నాడులే అంటూ హైపర్ ఆది నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వర్ష వినలేదు. సో.. ఈ సీన్ నిజమేనా? లేక జనాన్ని అట్రాక్ట్ చేయడానికే చేశారా అనేది హోళీ రోజే తెలుస్తుంది మరి!!.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.