యాప్నగరం

Devatha ఆగష్టు 31 ఎపిసోడ్: అందాల విలన్ ఎంట్రీ.. 6 నెలల పాటు రాధ ఇంట్లోనే..

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘దేవత’ సీరియల్.. నేడు(2021 ఆగష్టు 31)న 326 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. devatha serial today august 31 episode హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 31 Aug 2021, 2:23 pm
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘దేవత’ సీరియల్.. నేడు(2021 ఆగష్టు 31)న 326 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. devatha serial today august 31 episode హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.
Samayam Telugu ‘గుప్పెడంత మనసు’ ఆగష్టు 31 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Guppedantha Manasu August 31 episode


326వ ఎపిసోడ్‌ హైలైట్స్..
మాదవ పిల్లల్ని స్కూల్‌కి తీసుకుని బయలుదేరతాడు రాధ పట్టు మీద. దాంతో కారులో వెళ్తున్న పిల్లలకు ఆదిత్య కనిపించడంతో కారు ఆపించి మరీ ఇద్దరూ ఆదిత్య దగ్గరకు పరుగుతీస్తారు. అది చూడగానే మాదవకు రాధ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ‘నా బిడ్డకు తండ్రి ప్రేమ దొరక్కే ఇలా ఎవరి కోసమో పరుగుతీస్తుంది అనుకుంటాడు. వెంటనే రాధ దగ్గరకు వెళ్లి క్షమించమంటాడు. ‘నాకు తెలియనివా నువ్వు చెప్పే నీతులు అనుకున్నాను.. కానీ నాకు అర్థమైంది. ఇక నేను చీకటిగదిలో ఉండదు.. నా బిడ్డ భవిష్యత్ చీకటి కాకుండా చూసుకుంటాను..ఆ నాడు పాలు పట్టి నా బిడ్డని కాపాడావ్.. ఈనాడు నా కళ్లు తెరిపించి నా బిడ్డ భవిష్యత్ కాపాడావ్.. ఆ నాడు నీకు థాంక్స్ చెప్పలేదు. కానీ ఈ రోజు చెబుతుననాం థాంక్స్ అంటూ దన్నం పెట్టి వెళ్లిపోతాడు.

ఇక సీన్ కట్ చేస్తే.. ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీతో కథనం ఉత్కంఠగా మారింది. ఆమె ఎవరో కాదు మాదవ మరదలు(భార్య చెల్లెలు). గతంలో ఆమెకథ సీరియల్ విలన్ రాణీ(మేఘనా ఖుషీ)గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె మంచం మీద ఉన్న తల్లితో ‘నేను అక్క వాళ్ల ఇంటికి వెళ్తాను’ అంటుంది. ‘ఇన్నేళ్ల తర్వాత వాళ్లతో అన్ని బంధాలు తెంచుకున్న తర్వాత ఎందుకు అక్కడికి వెళ్లాలి అంటూ తల్లి వాదిస్తుంది. తండ్రి కూడా అదే మాట అంటాడు. అయితే ఆమె మాత్రం ‘అక్క లేకపోతే అక్క రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ లేదా..? అయినా వేరే పెళ్లి చేసుకున్నాడనేగా మీద కోపం? అసలు బావ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో అంతా తేలుస్తాను.. నేను అక్కడే ఆఫీస్ పని మీద 6నెలలు ఉండాలి. బయట కంటే.. ఆ ఇంట్లో ఉండటమే బెటర్’ అంటుంది. దాంతో తల్లిదండ్రులు మౌనంగానే ఉంటారు.

ఇక మాదవ పిల్లలకు తినిపించి.. కుటుంబంలో ఆనందాలు నింపులాడు. కథలు చెబుతానంటాడు. ప్రేమగా ముద్దులుపెడతాడు. అంతా చూసిన మాదవ తల్లిదండ్రులు.. ‘ఇదంతా రాధ కారణంగానే సాధ్యమైందని.. రాధ మాదవలు దగ్గరైతే బాగుంటుందని ఆశపడతాడు. అదే కోరుకుంటారు. ఇక మరునాడు మాదవ పిల్లల స్కూల్ బాక్ సద్దుతుంటే.. టెడ్డి బేర్ ముఖానికి అడ్డం పెట్టుకుని.. హలో నన్ను మరిచిపోయారా అంటూ ఎంట్రీ ఇస్తుంది మేఘనా ఖుషి(మాదవ మరదలు). ఆమె చూడగానే అతడికి జరిగిన యాక్సిండెంట్ అంతా గుర్తొస్తుంది మాదవకి. మొత్తానికి ఆమె చాలా రచ్చచేసే రకంలానే ఉంది. ఇక రాధపై పగబట్టినా? కుటుంబంలో కలకలాలు క్రియేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూద్దాం ఏం జరగనుందో.మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! devatha కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.