యాప్నగరం

Janaki Kalaganaledu జూన్ 25 ఎపిసోడ్: పూల పందిరిలో కొత్త జంట.. లాంతరు వెలుగులో రొమాన్స్ మామూలుగా లేదండోయ్

పెళ్లైన నాటి నుంచి వేరు వేరుగా ఏకాంతానికి దూరంగా ఉంటున్న రామా-జానకిలు దగ్గరయ్యే ప్లాన్ చేసింది జ్ఞానాంబ. అయితే వాళ్లిద్దర్నీ ఎట్టిపరిస్థితుల్లోనూ కలవనీయనని మల్లిక శపథం చేయడంతో నేటి (జూన్ 25) ఎపిసోడ్ ఉత్కంఠగా మారింది.

Samayam Telugu 25 Jun 2021, 12:31 pm
రామచంద్ర-జానకిలు ఇంట్లో ఏకాంతంగా గడపడం కుదరట్లేదని.. వాళ్లకి ఏకాంతాన్ని ఇస్తూ ఇంట్లో ఉన్నవాళ్లంతా ఊరు బయట ఉన్న గుడికి వెళ్లి.. అక్కడే నిద్రించి వస్తే బావుంటుందని జ్ఞానాంబ తన అభిప్రాయాన్ని భర్తతో పంచుకుంటుంది.
Samayam Telugu జానకి కలగనలేదు photo courtesy star maa and hotstar
Janaki Kalaganaledu June 25 Episode


మరోవైపు వెన్నెల పనిపిల్ల చికితాతో కలిసి.. జానకి గదిలో చిన్న పిల్లల ఫొటోలను అతికిస్తూ కనిపిస్తుంది. రామా వాటిని చూసి సంతోషపడిపోగా.. జానకి ఎటూ మాట్లాడలేక ఉండిపోతుంది. ఇంతకీ నీకు ఎవరంటే ఇష్టం వదినా అని వెన్నెల అడగ్గా ఆమె ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. రామా అయితే నాకు ఆడిపిల్ల అంటే ఇష్టం.. మా అమ్మలాంటి ఆడబిడ్డ కావాలని చెప్తాడు. అది విన్న జ్ఞానాంబ కొడుకు కోడల్ని చూసి మురిసిపోతుంది. ‘నా మనవడు మనవరాలితో ఆడుకునే క్షణాలు.. నాన్నమ్మ అనే పిలుపు కోసం ఎదురుచూస్తున్నా నాన్నా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది జ్ఞానాంబ. అలాంటి రోజు త్వరలోనే వస్తుంది అమ్మా.. అని తన తల్లితో చెప్తాడు రామ చంద్ర.
ఇక తాను వచ్చిన పనిని తెలియజేస్తూ.. ‘తామంతా పక్క ఊరి గుడిలో నిద్ర చేయడానికి వెళ్తున్నాం.. రేపు వస్తున్నాం.. నువ్వు జానికి ఇంట్లోనే ఉండండి’ అని చెప్తుంది. మేం కూడా వస్తాం అమ్మా అని రామా అనడంతో.. ‘జానకి ఇంట్లో దీపం పెట్టాలి కదా.. అందుకే మీ ఇద్దర్నీ వదిలేసి వెళ్తున్నాం.. నువ్ కొట్టుకు కూడా వెళ్లకు’ అని చెప్తుంది జ్ఞానాంబ. సరేనమ్మా.. ఈరోజు కాకుండా రేపు వెళ్లండి.. నా మాటని కాదనకమ్మా’ అని చెప్తాడు రామా. దీంతో సరేనని జ్ఞానాంబ అంటుంది.

జానకి గారూ.. అమ్మ ఎంత బాధపడుతుందో చూశారు కదా.. మనం ఒక పాపనో బాబునో కనేసి అమ్మ బాధను పోగొట్టేయాలి అని రామా అనడంతో.. ఏం చెప్పలో తెలియని మౌనంగా ఉండిపోతుంది జానకి. ‘అత్తయ్య గారి కోరికలో న్యాయం ఉంది.. కానీ నేను ఐపీఎస్ అయ్యేవరకూ పిల్లల్ని కననని మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు’ అని తనలో తాను బాధపడుతుంది జానకి.


ఇక తన అత్త జ్ఞానాంబ ఏ నిర్ణయం తీసుకున్నా వెనుక ఏదో కారణం ఉంటుంది.. అది ఏంటబ్బా అని మల్లిక జుట్టుపీక్కుంటుండగా.. ఆమె ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం మీరే అని.. మల్లిక అన్న మాటల్ని జ్ఞానాంబ వినేసిన విషయాన్ని రివీల్ చేస్తుంది పనిమనిషి చికితా. దీనికి కారణం నేనా అని తెగ బాధపడిపోయిన మల్లిక.. ‘జానకి-రామాలు ఏకాంతంగా ఎలా గడుపుతారో నేను చూస్తాను.. ఏదోటి చేసి నేను ఇంట్లోనే ఉండిపోతా.. వాళ్లని ఏకాంతంగా ఉండనీయను’ అని మరో ప్లాన్ వేస్తుంది మల్లిక.

అయితే జ్ఞానాంబ భర్త స్వీట్లు దొంగచాటుగా తినడానికి వంటగదిలోకి వెళ్లగా.. అదే టైంలో రామా-జానకిలు ఎవరికీ తెలియకుండా రహస్యంగా వచ్చి పూలతో హాల్ మొత్తం అలంకరణ చేస్తుంటారు. అయితే జానకి పూల మాల విసురుతూ కాలుజారి పడిపోబోతుంది. అదే టైంలో రామా ఆమెను పట్టుకుని కౌగిల్లో బందీ చేసుకుంటాడు. అసలే పూల పందిరి.. ఆపై అందమైన భార్య పక్కన ఉండటంతో రామా ఊహలు ఎక్కడెక్కడికో వెళ్తుంటాయి. లాంతరు వెలుగుల్లో జానకి అందాన్ని చూసి మైమరిపోయిన రామా.. ఆమెని పూల దండతో బందీ చేసి ఉక్కిరిబిక్కిరిచేస్తుంటాడు. జానకి కూడా ఓరగా చూస్తూ రొమాన్స్‌లో తేలుతుంది. తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది. అయితే ఆ తరువాత ఆ సీన్‌కి కట్ వేసి.. ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటున్న సీన్‌ని రేపటి ప్రోమోలో చూపించారు. ఏమైందో తెలియదు కానీ.. రామా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఆ ముచ్చట రేపటి ఎపిసోడ్‌లో.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.