యాప్నగరం

TV Actor Lokesh Rajendran: ‘మర్మదేశం’ సీరియల్ నటుడు లోకేష్ రాజేంద్రన్ ఆత్మహత్య

Tamil TV Actor Lokesh Rajendran: తమిళ పాపులర్ సీరియల్ నటుడు లోకేష్ రాజేంద్రన్ కన్నుమూశారు. చెన్నైలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు రాజేంద్రన్. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 6 Oct 2022, 3:28 pm
ప్రమఖ సీరియల్ నటుడు.. మర్మదేశం సీరియల్ ఫేమ్ లోకేష్ రాజేంద్రన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్టోబర్ 2న చెన్నైలోని కోయంబేడు బస్ స్టేషన్ దగ్గర విషం తీసుకుని అపస్మారక స్థితిలో ఉన్న లోకేష్‌ని స్థానికులు చూసి 108లో స్థానికంగా ఉన్న కిల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 4న లోకేష్ తుదిశ్వాస విడిచారు. దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన మర్మదేశం సీరియల్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ ‘రాసు’ పాత్రలో అద్భుతంగా నటించి పేరు తెచ్చుకున్నారు లోకేష్ రాజేంద్రన్. 150పైగా సీరియల్స్‌లో నటించిన లోకేష్.. 15 సినిమాల్లో నటించారు. నిర్మాతగా కూడా ఆయన డెబ్యూ మూవీ ప్రాజెక్ట్ రెడీ కాగా.. అంతలోనే ఆయన తిరిగిరాని లోకాలకు చేరారు.
Samayam Telugu Lokesh Rajendran Dies
లోకేష్ రాజేంద్రన్


లోకేష్‌కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భార్యతో ఉన్న విభేదాలు, ఆర్ధిక కారణాల వల్లనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని లోకేష్ లోకేష్ తండ్రి చెప్తున్నారు. భార్యభర్తల మధ్య గొడవలు అవుతున్నాయన్న విషయం తనకి నెల క్రితమే తెలిసిందని.. నాలుగు రోజుల క్రితం లోకేష్‌కి తన భార్య నుంచి విడాకుల నోటీసులు వచ్చాయని.. దాంతో తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లాడని తన కొడుకుని చివరి సారిగా గత శుక్రవారం చూశానని అంటున్నారు లోకేష్ తండ్రి. తనకి కొంత డబ్బు కావాలని అడగ్గా.. ఇచ్చానని ఇంతలోనే ఇలా అయ్యిందని ఆవేదన చెందారు లోకేష్ తండ్రి.

అయితే పోలీసుల ప్రాధమిక విచారణలో ఫ్యామిలీ గొడవలు, ఆర్ధిక ఇబ్బందులతో లోకేష్ విషం తాగి ఆత్మహత్య పాల్పడినట్టు తెలిసింది. లోకేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నైలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంచారు. కుటుంబ సమస్యలే లోకేష్ ఆత్మహత్యకు కారణమా? లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.