యాప్నగరం

‘మౌనరాగం’ అక్టోబర్ 8 ఎపిసోడ్‌ : అంకిత్ కళ్ల ముందే సరయూకి భరత్ స్ట్రాంగ్ వార్నింగ్.. ‘అమ్ములు నా మనిషి’

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘మౌనరాగం’ సీరియల్‌ 331 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. నేటికి 332 ఎపిసోడ్‌కి ఎంటర్‌ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్‌ మీకోసం

Samayam Telugu 8 Oct 2019, 3:06 pm
అంకిత్ తన ప్రేమని ఎంతగా చూపిస్తున్నా కరగట్లేదు అమ్ములు. అందుకే అంకిత్ తన ప్రయత్నంలో ప్రతిసారీ ఓడిపోతున్నాడు. అమ్ములు మనసులో తన మీద ఉన్న ప్రేమని బయట పెట్టడానికి ఇంటి నుంచి దూరంగా తీసుకుని వెళ్తున్నాడు అంకిత్. అదే అదునుగా అమ్ములు మర్డర్‌కి ప్లాన్ చేస్తున్నాడు విష్ణు. తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న మౌనరాగం (అక్టోబర్ 8) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో ఏం జరిగిందో మీ సమయంలో మీకోసం.
Samayam Telugu mouna ragam BS


గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...
‘అమ్ములూ నేను ఇక్కడికి వచ్చింది ఈ గోదావరి అందాలు చూడ్డానికి కాదు. నీతో మనసు విప్పి మాట్లాడటానికి. మన ప్రేమకు విలువ ఇవ్వని ఆ పెద్ద వాళ్లతో మనకు అవసరమా? ఈ త్యాగాలు అవసరమా? ఒక వేళ నేను సరయూని, నువ్వు భరత్‌ని పెళ్లి చేసుకుని మాత్రం వాళ్లని సంతోషంగా ఉండగలమా..? మనం సంతోషంగా ఉండగలమా? ఆలోచించు అమ్ములూ.. ఒక వేళ నువ్వు నన్ను వదిలి వెళ్లిపోవడం తప్పదనిపిస్తే.. నన్ను చంపి వెళ్లిపో.. కనీసం నీకు ఓ జ్ఞ‌ాపకంగా మిగిలిపోతాను’ అంటూ వేడుకుంటాడు అంకిత్. ఆ మాటలకు అమ్ములు వెనక్కి తిరిగి బాగా ఏడుస్తుంది. తండ్రి సీనయ్యకు ఇచ్చిన మాట గుర్తుకొస్తుంది. వెంటనే అమ్ములు అంకిత్ కాళ్ల దగ్గర మోకాళ్ల మీద కూలబడిపోతుంది.

332 ఎపిసోడ్‌లో హైలైట్స్‌..
‘నీ కాళ్లు రావాలి. నువ్వు నడవాలి.. అప్పుడు నేను వెళ్లిపోతాను. అంతే తప్ప నువ్వు అంతకు మించి ఆలోచించకు. మాట్లాడకు’ అంటుంది అమ్ములు సైగలు చేస్తూ.. అమ్ములు మాటలకు అంకిత్ బాధపడతాడు. ఇంతలో భరత్ అక్కడి వస్తాడు. ‘మీతో పాటూ నేనూ ఉంటాను. అమ్ములు నీతో పాటు ఊరుదాటి రావడంతో నోటికొచ్చినట్లు చాలా మంది చాలా మాటలు అంటున్నారు. అందుకే అమ్ములు పరువు కాపాడాలంటే నేనూ ఇక్కడే ఉండాలి’ అంటాడు భరత్. దాంతో అమ్ములు, అంకిత్‌లు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. భరత్ మాత్రం మనసులో.. ‘అమ్ములు నాకు దక్కేందుకు రేపు నైట్‌లోపు.. నీ అంతు చూస్తాను అంకిత్’ అనుకుంటాడు.

Read also : మీరు ‘మౌనరాగం’ సీరియల్ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యారా? అన్ని ఎపిసోడ్‌లు ఇవిగో!

మరునాడు సరయూ (అమ్ముల్ని చంపడానికి పెట్టిన) రౌడీని బాగా తిడుతుంది. మంచి చాన్స్ మిస్ చేసినందుకు క్లాస్ పీకుతుంది. సరిగ్గా అప్పుడే అమ్మవారి ప్రతిష్టలో భాగంగా సరయూ కోసం చాలా సేపు ఎదురు చూసిన అంకిత్ పూజ ప్రారంభిస్తాడు. అయితే అంకిత్ అమ్మవారికి హారతి ఇస్తూ ఉండగా.. అంకిత్ చేతిలోని హారతి పళ్లెం.. పడిపోబోతుంటే అమ్ములు అంకిత్‌ని పట్టుకుంటుంది. ఆ సీన్ సరయూ, భరత్‌లు చూస్తారు. సరయూ అమ్ముల్ని లాగి కొట్టబోతుంది. అంకిత్ ‘సరయూ’ అని అరుస్తాడు. అయినా ఆగకుండా అమ్ముల్ని మాటలు అనడంతో.. భరత్ కలుగజేసుకుంటాడు. ‘మాటలు సరిగా రానివ్వు సరయూ.. లేదంతా చేతికి పని చెప్పాల్సి వస్తుంది. అమ్ములు నా మనిషి.. తనని మాట అనేటప్పుడు ఆలోచించి మాట్లాడు..’ అంటాడు భరత్.

మొత్తానికి ఆ గొడవ పెద్ద రచ్చ కావడంతో సరయూ తల్లి కళావతి.. సీనయ్య గురించి అవమానకరంగా మాట్లాడుతుంది. దాంతో అమ్ములు కోపంగా కళావతికి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది అమ్ములు. వెనుకే వెళ్లిన భరత్ అమ్ములుతో.. ‘చూశావా అమ్ములూ.. వీళ్లందరికీ మనం సరైన సమాధానం చెప్పాలి.. మన పెళ్లే వీళ్లందరికీ మంచి సమాధానం అవుతుంది’ అంటాడు. అమ్ములు షాకింగ్‌గా చూస్తుంది.

కమింగ్ అప్‌లో..జోసఫ్ అమ్ములుతో మాట్లాడుతూ ఉంటాడు. ‘మీ నాన్న గురించి ఆలోచించు. వాడు బతికేదే నీకోసం.. అంతకుముందు సీనయ్య వేరు ఇప్పుడు నీ తండ్రిగా మారిన సీనయ్య వేరు. మీ నాన్నని నువ్వే కాపాడుకో’ అంటూ చెబుతూ ఉంటాడు. అమ్ములు మౌనంగా వింటూ ఉంటుంది. అయితే కథలో సరయూ అమ్ములు చావు కోరుకుంటుంటే.. భరత్ అంకిత్‌ని లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. దాంతో కథ ఆసక్తిగా మారింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! మౌనరాగం కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.