యాప్నగరం

‘కార్తీకదీపం’ ట్విస్ట్: డాక్టర్ బాబుకి మోనిత రొమాంటిక్ బాట.. స్కెచ్ మామూలుగా లేదు

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2022 ఫిబ్రవరి 28)న 1287 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే రాబోయే ట్విస్ట్ అదిరిపోయింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 28 Feb 2022, 3:16 pm
గత ఎపిసోడ్‌లో దీప.. తన ఇంట్లో ఉన్న ఆనంద్‌ మోనిత కొడుకేనన్న నిజం తెలుసుకుంది. ఈక్రమంలోనే దీపకు మరో నిజం కూడా తెలిసింది. తనకంటే ముందే సౌందర్యకు ఈ నిజం తెలుసునని. ఎందుకంటే అప్పారావు తెచ్చిన కోటేష్‌ ఫొటోని తనకంటే ముందు సౌందర్య చూసింది కాబట్టి.. అత్తయ్యకు కూడా ఈ నిజంతెలిసి తనలో తనే బాధపడుతున్నారా? అనే అనుమానంతో అదే నిజమనే నిర్థారణకు వచ్చింది. ఈ క్రమంలోనే నేటి కథనం చాలా ఎమోషనల్‌గా మారింది. అయితే రేపటి ప్రోమో చాలా రసవత్తరంగా మారింది. ఆ హైలైట్స్‌ ఇప్పుడు చూద్దాం.
Samayam Telugu ‘కార్తీకదీపం’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam serial promo


ప్రోమో హైలైట్స్‌..
కార్తీక్‌ మోనిత(బస్తీలో ఇల్లు) ఇంటి గుమ్మం దగ్గర ఉంటాడు. గుమ్మం ముందు నుంచి పూల బాట ఉంటుంది. బయట కార్తీక్‌ వెనుకే విన్నీ ఉంటుంది. కార్తీక్‌ ఆశ్చర్యంగా ఆ పూల బాటని చూస్తూ వెళ్లాలా వద్దా అని చూస్తూ ఉంటాడు.

మొత్తానికీ మోనిత మాత్రం చాలా సంబరంగా సోఫాలో కూర్చుని ఆ స్వాగతాన్ని ఎంజాయ్‌ చేస్తూ ఉంటుంది. కార్తీక్‌ మొత్తానికీ బూట్లతో లోపలికి ఆ పూల బాటలోనే నడుస్తూ మోనిత దగ్గరకు వెళ్తాడు. అయితే మోనిత కాలికి బ్యాండేజ్‌ వేసుకుని.. ఏదో కొత్త నాటకం స్టార్ట్‌ చేసినట్లే కనిపిస్తోంది. సీన్‌ కట్‌ చేస్తే.. కార్తీక్‌ ఏవో ఫైల్స్‌ పట్టుకుని వాటిని గమనిస్తూ ఉంటే.. వెనుకే వస్తున్న మోనిత.. కావాలనే కార్తీక్‌ వైపు రొమాంటిక్‌గా చూస్తూ..కాలు దెబ్బను వంక పెట్టుకుని.. కార్తీక్‌ మీద పడుతుంది. ఇక అలా అయినా కార్తీక్‌కి దగ్గర అయ్యే ప్లాన్‌ చేస్తుంది మోనిత. మరి ఈ రొమాంటిక్‌ టచ్‌ కార్తీక్‌లో ఏమైనా మార్పుని తీసుకొస్తుందేమో చూడాలి.

మొత్తానికీ మోనిత తన బాబుని అడ్డంపెట్టుకుని కార్తీక్‌కి దగ్గర అవుతున్న తరుణంలో.. దీప, సౌందర్యలు ఎలాంటి ప్లాన్‌ చేస్తారు. మోనితకి ఎలాంటి షాకిస్తారు? అనేది కూడా ఆసక్తిగానే మారింది. చూద్దాం ఏం జరగనుందో.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.