యాప్నగరం

Karthika Deepam నవంబర్ 29 ఎపిసోడ్: కీలక మలుపు! వంటలక్కా మజాకా.. స్టేజ్ మీదే మోనిత పరువు పాయే..

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 నవంబర్ 29)న 1209 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. karthika deepam November 29 episodeహైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 29 Nov 2021, 7:13 am
Samayam Telugu ‘కార్తీకదీపం’ నవంబర్ 29 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam November 29 episode
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 నవంబర్ 29)న 1209 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.

1209వ ఎపిసోడ్‌ హైలైట్స్..
బస్తీలో కార్తీక్, దీపలు హెల్త్ క్యాప్ నిర్వహిస్తుంటే అక్కడికి బాబుతో సహా వెళ్లి రచ్చకు దిగుతుంది మోనిత. దాంతో దీప రివర్స్ అవుతుంది. బస్తీ ఆడవాళ్లని రెచ్చగొట్టి చీపుర్లు, కర్రలు పట్టుకుని.. మోనితపైకి ఉసుగొల్పుతుంది. దాంతో పక్కనే ఉన్న ప్రియమణి.. ‘రా అమ్మా’ అంటే బయలవంతంగా మోనితని కారు ఎక్కిస్తుంది. అయితే కారు ఎక్కే ముందు కూడా.. ‘ఇంతగా అవమానిస్తారా? కార్తీక్ నీ భార్యే స్వయంగా వచ్చి క్షమాపణ చెప్పేలా చేస్తాను చూస్తూ ఉండు’ అంటూ హెచ్చిరించిపోతుంది.

ఇక పిల్లలు ఇంట్లో ఎవరూ కనిపించడం లేదేంటీ? అని ఆదిత్యని అడగడంతో.. ‘బస్తీకి వెళ్లారు’ అంటాడు. దాంతో పిల్లలు ‘అయ్యో బస్తీకి వెళ్లారా మేమూ వెళ్లే వాళ్లం కదా.. అయినా బస్తీ అంటే మాకు చాలా ఇష్టం.. ఎప్పుడు అక్కడే ఉండిపోమన్నా ఉండిపోతాం’ అంటూ నోరు జారతారు. ‘ఏంటి ఆ మాటలు ఇంకెప్పుడు అలా అనొద్దు’ అని ఆదిత్య అరిచి వెళ్లిపోతాడు. ఇక సీన్ కట్ చేస్తే మోనిత తింటూ బాగా చేశావ్ అంటూ ప్రియమణిని పొగుడుతూ తింటు ఉంటుంది. ప్రియమణి మాత్రం అర్థం కానట్లుగా.. ‘బస్తీకి వెళ్లి అవమానపడి ఇంత ఉత్సాహంగా ఉంటారేంటమ్మా’ అంటూ ఆశ్చర్యపోతూ అడుగుతాను.

‘ప్రియమణి... దెబ్బ తగిలితే.. ఎవరైనా స్లోగా కుంటుకుంటూ పరుగుతీస్తారు. కానీ నేను ఇంకా ఫాస్ట్‌గా పరుగుతీస్తాను.. అదే నా స్టైల్.. నా పగ తీరలేదు.. ఎప్పటిలా కోతలు కూయడం కాదు ప్రియమణి.. కూతలు కూతలు పెట్టిస్తాను.. రేపటి నుంచి చూపిస్తాను చూడు.. రేపు ఉదయం చూడు ప్రియమణి.. నేడే చూడండి మీ అభిమాన దీపాయనం’ అంటూ రగిలిపోతూ నవ్వుతుంది. ఇక సీన్ కట్ చేస్తే.. ‘దీప, కార్తీక్ వంట చేసుకుంటూ సూపర్‌గా నవ్వుకుంటూ ఉంటారు. అదే సమయంలో కార్తీక్ దీప కోరిక మేరకు బస్తీలోనే స్థలం కొని ఇల్లు కట్టుకుందాం అని మాట ఇస్తాడు. ఇక కార్తీక్ పచ్చిమిర్చి కట్ చేసిన చేతులతో సౌందర్య ముఖాన్ని పట్టుకోవడం కామెడీ స్టార్ట్ అవుతుంది.ఇక మరోవైపు హిమ దీప, కార్తీక్ ఫొటోవేసి.. చూసి మురిసిపోతూ.. ఆలోచనలో పడితే.. సౌర్య వెళ్లి.. ‘మనం త్వరలో బస్తీలో ఇల్లు కట్టుకోబుతున్నాం’ అని చెబుతుంది. ఇక సంబరాలు చూడాలి ఇద్దరూ.

మరోవైపు కమింగ్ అప్‌లో.. కార్తీక్‌కి డాక్టర్స్ ప్రెసిడెంట్ పొజీషన్ ఇవ్వడానికి అంతా ఏకగ్రీవంగా అంగీకరించి మీటింగ్ పెడితే.. అందులో భారతి, దీప అంతా కార్తీక్ గురించి మంచిగా చెబుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే మోనిత వచ్చి.. ‘నాకు అన్యాయం చేసిన ఈ కార్తీక్‌కి ఆ పదవి సరైనది కాదు’ అంటూ మాట్లాడుతుంది. దాంతో దీప వెంటనే.. స్టేజ్ మీదే.. ‘అసలు ఈ మోనిత డాక్టర్ వృత్తికే కలంకం’ అంటూ జరిగింది చెప్పబోతుంది. అంటే ఇక డాక్టర్ వృత్తి కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది మోనిత. చూడాలి ఏం జరగనుందో.. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘కార్తీకదీపం’ karthika deepam కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.