యాప్నగరం

Karthika Deepam Serial షాకింగ్ ట్విస్ట్: కార్తీక్ ముందు అప్సరసలా మెరిసిన మోనిత.. శాశ్వతంగా డాక్టర్ బాబు పిల్లలకు దూరం!

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 అక్టోబర్ 5)న 1162 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే రాబోయే ట్విస్ట్ అదిరిపోయింది. ఇప్పుడు ఆ హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 5 Oct 2021, 10:16 am
‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021అక్టోబర్ 5)న 1162 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే నేటి కథనంలో మోనిత కుట్రకు అటు సుకన్య, ఇటు భారతి సాయం చెయ్యడంతో అదిరిపోయే స్కెచ్ వేసింది. ఆ హైలైట్స్ మిస్ అయ్యి ఉంటే ఈ కింద లింక్ క్లిక్ చేయండి. అయితే రేపటి ప్రోమో మాత్రం రసవత్తరంగా మారింది. ఆ హైలైట్స్ ఇప్పుడు మీకోసం
Samayam Telugu ‘కార్తీకదీపం’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam serial promo

‘కార్తీకదీపం’ అక్టోబర్ 5 ఎపిసోడ్ : మోనిత పన్నాగం ఫలించింది.. కుట్రలో భాగమైన సుకన్య, భారతి

ప్రోమో హైలైట్స్..

దీప సౌర్య చేతిలోని పేపర్(మోనిత న్యూస్ ఉన్న పేపర్) లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ‘అత్తమ్మా పేపర్ ఇలా ఇవ్వు..’ అంటూ అరుస్తుంది లాక్కుంటూ.. ‘అమ్మా నేను ఎప్పుడో చదివేశానమ్మా..’ అనేసరికి దీప షాక్ అయిపోతుంది. సౌర్య ఏడుస్తూ.. ‘అసలు నాన్నకు నువ్వంటే ఇష్టమేనా? నాకు అబద్దం చెప్పినా ఫర్వాలేదు.. కనీసం హిమకైనా నిజం చెప్పండమ్మా..’ అంటుంటే.. దీపకు ఫ్యూజులు ఎగిరిపోతాయి.

మోనిత మొత్తానికీ నేటి ఎపిసోడ్‌లో భారతిని కోరినట్లే పింక్ కలర్ చీర ఏర్పాటు చేసినట్లుంది మోనిత కోసం. ఆ చీర కట్టుకుని, అప్సరసలా రెడీ అయ్యి కార్తీక్ ముందుకు వచ్చింది మోనిత. మొత్తానికి మోనితని కలుసుకుంది సరే.. ఇక్కడే ఉంది ట్విస్ట్. కార్తీక్‌కి సారీ చెప్పడానికి వచ్చిన హిమ కూడా అక్కడే ఉండటంతో కథనం ఉత్కంఠగా మారింది. మోనిత, కార్తీక్ క్యాబిన్‌లో మాట్లాడుకుంటూ ఉంటే.. బయట అద్దాల్లోంచి హిమ అన్నీ గమనిస్తూ మాటలన్నీ వినేస్తుంది.

మోనిత మెలికలు తిరుగుతూ.. ‘నీలా పిల్లలకు నేను అబద్దం చెప్పలేను కార్తీక్.. తప్పు కదా.. నా కడుపులోని బిడ్డకు తండ్రివి నువ్వే కదా కార్తీక్?’ అంటుంటే.. బయట నుంచి వింటున్న హిమ షాక్ అయిపోతుంది. అయితే మోనితకి హిమ అక్కడే ఉందన్న విషయం తెలిసే ఉంటుంది. మోనిత కుట్రలు తెలియనివి కాదుగా.. పిల్లల్ని కార్తీక్‌కి శాశ్వతంగా దూరం చెయ్యాలనే ఉద్దేశంతోనే అలా మాట్లాడుతూ ఉండొచ్చు. అటు సౌర్య దీపకు నిజం చెప్పి ఓపెన్ అయిపోయింది. ఇటు హిమకు మోనిత మాటలతో ఓ క్లారిటీ వచ్చే ఉంటుంది. చూడాలి ఏం జరగనుందో.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.