యాప్నగరం

Karthika Deepam Serial ట్విస్ట్: ఆడేసుకుంటున్న అత్తాకోడళ్లు.. ‘వామ్మో ఈ రేంజ్‌లో అయితే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు మరి’

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 జూన్ 29)న 1078 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే రేపటి ప్రోమోలో అదిరిపోయే ట్విస్ట్ ఉంది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 29 Jun 2021, 10:00 am
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 జూన్ 29)న 1078 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే రేపటి ప్రోమోలో అదిరిపోయే ట్విస్ట్ ఉంది. నేటి ఎపిసోడ్‌లో మోనిత కార్తీక్‌ని రిజిస్టర్ ఆఫీస్‌కి లాక్కుని వెళ్లడంతో కథ ఉత్కంఠగా మారింది. ఆ హైలైట్స్ మిస్ అయ్యి ఉంటే ఈ కింద లింక్ క్లిక్ చేయండి.
Samayam Telugu ‘కార్తీకదీపం’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam serial promo

Karthika Deepam జూన్ 29 ఎపిసోడ్: మోనితని దులిపేసిన కార్తీక్.. ‘దీప నాలా సాఫ్ట్ కాదు, నిన్ను’..
ప్రోమో హైలైట్స్..
‘నేను మా మమ్మీ దగ్గరకు వెళ్లొస్తాను..’ అంటాడు కార్తీక్ దీపతో.. ‘ఎక్కడికి వెళ్లొస్తారు అని నేను అడగలేదే?’ అని దీప వెంటకారంగా అనేసరికి ఒక్కసారిగా కూర్చీలో కూలబడిపోతాడు కార్తీక్. ‘నేను పూర్తిగా అలసిపోయాను.. నాకు నటించడం చేతకాదు.’ అంటాడు కన్నీళ్లతో. ‘నాకూ నిజమేదో నటనేదో గుర్తించడం రాదు..’ అంటుంది దీప అంతే కోపంగా. ‘నా మనసులో ఏదుంటే అదే మాట్లాడతా..’ అంటాడు కార్తీక్. దాంతో దీప వెంటకారంగా చూస్తూ.. ‘నిజమా.. మీ మనసు ఏది చెబితే అదే చేస్తారా?’ అంటుంది. ‘అవును..’ అంటాడు కార్తీక్. ‘అయితే మోనిత విషయంలో తొందరపడమని మీ మనసు చెప్పిందని మాట..’ అంటుంది దీప కోపంగా. కార్తీక్ షాక్ అవుతాడు.

సీన్ కట్ చేస్తే.. సౌందర్య ముందు నిలబడిన కార్తీక్.. ధీనంగా.. అయోమయంగా చూస్తూ.. ‘ఇప్పుడు నేను ఓ సంకటంలో పడి కొట్టుకుంటున్నాను.. ఇప్పుడు నేను మంచి వాడిలా ఉండాలి.. చెడ్డవాడిలా ఉండాలా?’ అంటాడు. సౌందర్య ఉగ్ర రూపం దాల్చేస్తుంది. ‘ఎవరికీ మంచివాడిలా ఉంటావ్? ఎవరికీ చెడ్డవాడిలా ఉంటావ్? దీపకా మోనితకా?’ అంటుంది కోపంగా. కార్తీక్ షాక్ అవుతాడు. ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో తెలియని వాడిలా నగిలిపోతుంటాడు. నిజానికి గత కొన్ని రోజలుగా కార్తీక్‌ని చూస్తుంటే జాలేస్తుంది. చెయ్యని తప్పుకుని ఆనాడు దీప పడిన కష్టంతో పోల్చుకుంటే ఇది చిన్నదే కానీ.. ప్రశ్చాత్తాపంతో కుమిలిపోయే మనిషికి అంతకన్నా పెద్ద శిక్ష ఏం ఉంటుంది? అని ఆలోచిస్తే నిజంగా కార్తీక్ జాలేస్తుంది. ఓ పక్క మోనిత మరో పక్క ఈ అత్తా కోడళ్లు కార్తీక్‌ని ఫుడ్ ఆడేస్తున్నారు. మరి డాక్టర్ బాబు ఫ్యాన్స్ హర్ట్ కావడం ఖాయమే. ఇప్పటికే డాక్టర్ బాబు మంచి తనాన్ని వెనకేసుకుని వచ్చే వాళ్లంతా కార్తీక్‌ని క్షమించాలని వంటలక్కకు రిక్వస్ట్‌లు పెడుతున్న సంగతి తెలిసిందే. మరి చూడాలి కార్తీక్ ఈ సమస్యని ఎలా ఎదుక్కొంటాడో.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.