యాప్నగరం

Krishna Mukunda Murari మే 13: ద్యావుడా.. గుడిలో ముకుంద, మురారీల నిశ్చితార్థం.. ఊహించని ట్విస్ట్

Krishna Mukunda Murari Today May 13 Episode: Krishna Mukunda Murari May 13 Episode: ముకుంద తెగించింది. గుడిలో ప్రియుడి మురారీతో నిశ్చితార్థం ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే నేటి కథనం రసవత్తరంగా మారింది. ఓ వైపు కృష్ణ మురారీని ప్రేమించడం మొదలుపెట్టాక.. ముకుంద ప్రవర్తన తనకు కూడా అనుమానం కలిగించేలా మారింది. ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్‌ ఉత్కంఠగా సాగుతోంది. నేడు(2023 మే 13)న 156 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 13 May 2023, 12:52 pm
Krishna Mukunda Murari 2023 May 13 Episode: ముకుంద ఎంతగా తెగించిందంటే.. గుడిలోనే మురారీని సొంతం చేసుకునే ప్రయత్నం చేసింది. అసలేం జరిగింది? భవానీ దేవి ఎందుకు ఆశ్రమానికి వెళ్తుంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
Samayam Telugu Krishna Mukunda Murari serial May 13 episode (photo courtesy by star maa and disney+ hotstar)
‘కృష్ణ ముకుంద మురారి’ మే 13 ఎపిసోడ్(photo courtesy by star maa and disney+ hotstar)


మొత్తానికీ మురారీ బర్త్‌డే సందర్భంగా.. భవానీ దేవి మురారీ, కృష్ణలతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఇంట్లో మిగిలిన వాళ్లంతా యాదాద్రి వెళ్లారని తెలుసుకున్న భవానీ దేవి.. ‘సరే మనం ఇక్కడ దగ్గర్లో గుడికి వెళ్దాం’అంటుంది. దాంతో ముకుంద, కృష్ణ, మురారీ, భవానీ దేవి, రేవతి అంతా గుడికి వెళ్లడానికి రెడీ అవుతారు. ఇక ముకుంద అయితే.. చాలా సంబరంగా మురారీకి ఇవ్వాల్సిన గిఫ్ట్‌(రింగ్)ని జాగ్రత్తగా తన పర్స్‌లో పెట్టుకుంటూ.. ‘మురారీకి ఈ రింగ్ గుడిలోనే తొడుగుతాను... ఆ అప్పుడు దేవుడి సమక్షంలో మా నిశ్చితార్థం జరిగినట్లు ఉంటుంది.. మా జీవితాలు కొత్తగా మొదలవుతాయి.’ అనుకుంటుంది.

ఇక గుడి దగ్గరకు వచ్చాక.. ఓ భార్యభర్త ఆకలితో అలమటిస్తూ కనిపిస్తే.. ‘ఏసీపీ సార్ నేను నా డబ్బులు తేలేదు.. ఈ రోజు మీ పుట్టిన రోజు కదా.. వాళ్లకి ఏదైనా సాయం చేయండి’ అంటుంది కృష్ణ జాలిగా. సరే అని మురారీ వెళ్లబోతుంటే.. ‘మురారీ అసలే లేట్ అయ్యింది. అభిషేకం కోసం పంతులుకి అన్నీ ఏర్పాటు చేయమని చెప్పాను.. అసలే కేక్ కటింగ్‌తో లేట్ అయ్యింది కదా.. ఆ పర్స్ కృష్ణకు ఇచ్చే పంపించు.. నువ్వు రా’ అంటుంది భవానీ దేవి. సరే అని మురారీ పర్స్ కృష్ణకు ఇచ్చి గుడిలోకి వెళ్తాడు. దొరికిందే ఛాన్స్ అనుకున్న ముకుంద.. దేవుడికి అభిషేకం జరిగే చోట మురారీతోనే ఉంటుంది.

అవసరం అయినవన్నీ మురారీకి పంతులు గారికి అందిస్తూ ఉంటుంది. అది రేవతీకి నచ్చదు. ‘కృష్ణ అక్కడ దానం చేసి వచ్చేలోపు.. ఆ ఉంగరం ఎలాగైనా మురారీ చేతికి పెట్టాలి’ అని నిర్ణయించుకుంటుంది ముకుంద. జాగ్రత్తగా పైకి తీసి ఉంగరాన్ని అందుబాటులోనే ఉంచుకుంటుంది. అనుకున్నట్లే మురారీకి పూజ సామాగ్రీ అందించే సమయంలో పంతులు చూడకుండా ఉన్నప్పుడు.. మురారీ చేతికి ముకుంద ఉంగరం పెట్టేస్తుంది. ‘మనం నిశ్చితార్థం అయిపోయినట్లే మురారీ’ అంటుంది. పాపం మురారీ ఆ రింగ్ ఎంత తియ్యాలని ట్రై చేసినా రాదు.

ఇక కాసేపటికి అంతా పూజకు మురారీ వాళ్లు ఉన్నచోటకి వస్తారు. రేవతి.. కృష్ణని దగ్గరకు వెళ్లి మురారీ పక్కన నిలబడమని తిడుతుంది. పూజ జరుగుతూ ఉంటుంది. కమింగ్ అప్‌లో.. ముడుపు కట్టమని కృష్ణకు ఇచ్చిన పసుపు తాడుని.. ముకుంద కట్టి.. ‘మురారీ నేను ఒక్కటి కావాలి’ అని మొక్కకోవడంతో.. కృష్ణకు ముకుందపై అనుమానం మొదలైంది. ఎందకుంటే.. తన ముడుపు తనే కట్టాలని.. మురారీ పై ప్రేమతో ఫిక్స్ అవుతుంది కృష్ణ. కానీ ముకుంద.. ‘నీ ముడుపు ఇలా ఇచ్చి.. నువ్వు వెళ్లి ఆ తాంబూలం అందుకో’ అని కృష్ణని పంపించేసి.. తనే కృష్ణ ముడుపుని అమ్మవారి చెట్టుకు కట్టేస్తుంది. కృష్ణ తిరిగివచ్చి అంది చూసి షాక్ అయిపోతుంది.

ఇక మురారీతో భవానీ దేవి.. ‘నేను ఆశ్రమానికి వెళ్తున్నాను.. వైరాగ్యంతో అన్ని వదిలిపోవడట్లేదు భయపడకు.. కొన్ని రోజులు మనం కట్టించిన ఆశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ వాళ్లకు వైద్యం కావాలంటే బయటికి వెళ్లాల్సి వస్తోంది కదా... అందుకే ఆశ్రమంలోనే ఆసుపత్రి కట్టిస్తున్నాను. ఇక్కడ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి సరేనా?’ అంటుంది. మురారీ సరే అంటాడు. ఇక భవానీ దేవి కూడా ఇంట్లో ఉండదు కాబట్టి ముకుంద ఆగడాలకు హద్దు ఉండదు. మరింత ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంది. మరి కృష్ణ ముకుంద ఉద్దేశాన్ని తెలుసుకుంటుందో లేదో చూడాలి. Krishna Mukunda Murari ‘కృష్ణ ముకుంద మురారి’ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! (photo courtesy by star maa and disney+ hotstar)
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.