యాప్నగరం

Karthika Deepam Serial ట్విస్ట్: దీప-కార్తీక్‌ల రొమాంటిక్ సీన్.. ‘ఈ చిలిపి కోరిక పదేళ్ల క్రితమే పుట్టిందట’

డాక్టర్ బాబు-వంటలక్క అభిమానులు మెచ్చే సీన్ రేపటి కమింగ్ అప్‌లో రావడంతో కథనం ఆసక్తిగా మారింది. మెళ్లగా కార్తీక్ దీప వైపు తిరుగుతున్నాడు అనేందుకు ఈ సీన్ ఉదాహరణగా నిలిచింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 18 May 2021, 5:43 pm
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ Karthika Deepam Serial .. నేడు(2021 మే 17)న 1041 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే రేపటి ప్రోమోలో అదిరిపోయే ట్విస్ట్ ఉంది.
Samayam Telugu ‘కార్తీకదీపం’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam telugu serial promo

Karthika Deepam మే 17 ఎపిసోడ్: డిప్రెషన్‌లో వంటలక్క.. ‘అప్పుడు.. నిన్ను ఎవరు ఓదారుస్తారు నాన్నా..’
ప్రోమో హైలైట్స్..
దీప నిద్రలేచే సరికి కార్తీక్ కాఫీ పెట్టుకుని వచ్చి దీపకు ఇవ్వడంతో దీప చాలా ఇష్టంగా అందుకుంటుంది. కార్తీక్ పక్కనే కూర్చోవడంతో.. దీప నోరు తెరిచి.. ‘నాకు చాలా చిన్న చిన్న కోరికలు ఉన్నాయి.. అవి తీరకుండానే పోతున్నాను..’ అంటుంది. దాంతో కార్తీక్.. ‘దీపా నీకు ఏం కాదు అని చెప్పాను..’ అంటూ సీరియస్ అవుతాడు.

అదే సీన్‌లో ప్రోమో కట్ చేస్తే.. ‘నా మీద జాలి కాకుండా ప్రేమ ఉన్నట్లైతే బాగుండేది కార్తీక్ గారు..’ అంటుంది దీప. కార్తీక్ షాకింగ్‌గా చూస్తుంటే.. ‘మిమ్మల్ని పేరు పెట్టి పిలవాలని ఒక చిన్న కోరిక.. పదేళ్ల క్రితం పుట్టింది.. ఈ క్షణమే తీరిపోయింది..’ అంటుంది చిలిపిగా నవ్వుతూ. వెంటనే తన మరో కోరిక బయటపెడుతుంది. ‘ఒకే గ్లాసులోని కాఫీ ఇద్దరం కలిసి తాగాలని పెళ్లి అయినప్పటి నుంచి నాకు కోరిక..’ అని దీప అనగానే.. కార్తీక్ దీప చేతిలోని కాఫీని అందుకుని కొంచెం తాగి దీపకు ఇస్తాడు. దాన్ని దీప చాలా ఇష్టంగా ప్రేమగా తాగుతుంది. ఈ రొమాంటిక్ సీన్ రేపటి ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలవనుంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.