యాప్నగరం

Premi Viswanath: లైవ్‌లో వంటలక్క.. రూమర్స్‌పై కుండబద్దలుకొట్టేసింది

కార్తీకదీపం సీరియల్ నుండి దీప క్విట్ అయ్యిందా? ఆమెను తప్పించి ఆమె ప్లేస్‌లో మరో సీనియర్ హీరోయిన్‌ రాబోతుందా? దీప ఎందుకు తప్పుకుంది? ఆమె రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందా? గత వారంరోజులుగా బుల్లితెర ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా ఉన్న ఈ న్యూస్‌పై స్పందించారు దీప.

Samayam Telugu 29 Feb 2020, 9:41 pm
కార్తీకదీపం సీరియల్ నుండి తాను తప్పుకుంటున్నట్టుగా వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది ‘కార్తీకదీపం’ సీరియల్ హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్. ఈ సందర్భంగా తన ఫేస్ బుక్ ద్వారా లైవ్ నిర్వహించి రూమర్స్‌కి చెక్ పెట్టింది వంటలక్క.
Samayam Telugu premi viswanath
కార్తీకదీపం

Read also: మన వంటలక్కకి అదిరిపోయే గిప్ట్‌! తెలుగు వాళ్లు అభిమానిస్తే ఇలానే ఉంటుంది

ఈ సందర్భంగా ప్రేమి మాట్లాడుతూ.. ‘చాలా మంది నన్ను ఫోన్ చేసి పర్శనల్‌గా అడగడమే కాకుండా సోషల్ మీడియాలో కార్తీకదీపం సీరియల్ నుండి తప్పుకుంటున్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి. వాటిలో ఎంతమాత్రం నిజం లేదు. టాప్ రేటింగ్ నెంబర్ వన్ సీరియల్‌గా ఉన్న కార్తీకదీపం నుండి తప్పుకోవాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం నేను కేరళలో ఉండటం వల్ల వీటిని పెద్దగా పట్టించుకోలేదు. చాలామంది నా అభిమానులు కూడా నేను ఈ సీరియల్ నుండి తప్పుకుంటున్నానని ఆందోళన చెందుతున్నారు. వాళ్లందరికీ ఈ సందర్భంగా నేను భరోసా ఇస్తున్నా.. నేను కార్తీకదీపం చేస్తున్నా.. చేస్తూనే ఉంటా’ అంటూ రూమర్స్‌కి చెక్ పెట్టింది వంటలక్క.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.