యాప్నగరం

Vadinamma జూలై 28 ఎపిసోడ్: శోభనం జరగదని ముందే కనిపెట్టిన భరత్‌.. దమయంతి ప్లాన్‌‌‌తో తొలిరాత్రి పాయే!

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘వదినమ్మ’ సీరియల్.. 605 ఎపిసోడ్‌కి నేడు(2021 జూలై 28)న ఎంటర్ అయ్యింది. అయితే నేటి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా మారింది.

Samayam Telugu 28 Jul 2021, 1:38 pm
వదినమ్మ సీరియల్ ఒకప్పుడు కార్తీకదీపం సీరియల్‌కి గట్టి పోటీ ఇచ్చేది.. ఇప్పుడు ఈ సీరియల్‌లో నస తప్ప పస లేనట్టుగా మారిపోయింది. నాని పెళ్లి ఎపిసోడ్‌తో ఈ సీరియల్ మరీ నాటకీయంగా మారిపోయింది. నేటి ఎపిసోడ్ కూడా కామెడీ పీస్‌లా పరమ బోరింగ్ అనిపించింది. నేటి (జూలై 28) ఎపిసోడ్ విషయానికి వస్తే.. ‘శోభనం మా ఇంట్లోనే జరగాలని, నేను మారిపోయానని వచ్చిన దమయంతిని నమ్మి.. శిల్ప, నానీలను తీసుకుని.. సీత కుటుంబం దమయంతి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే.
Samayam Telugu వదినమ్మ photo courtesy star maa and hotstar
vadinamma


అయితే.. శైలు, సిరి, సీతలు చేసే అల్లరి.. ఆటపాటలు.. ఆచారాలకు దమయంతి ఇబ్బంది పడుతూనే ఉంది. మొత్తానికి సీత, రఘురాంలతో సహా ఒక గేమ్‌కి సరేననడంతో.. కథనం ఆసక్తిగానే సాగింది.

సిరి.. ‘భార్యల వస్తువులు అన్నీ ఒక చోట పెడతాం.. దానిలో భర్య వస్తువు ఏదో భర్త కనిపెట్టాలి..అని గేమ్‌ స్టార్ట్‌ చేస్తుంది. దమయంతి వస్తువుని రాజశేఖర్‌(దమయంతి భర్త) గుర్తు పట్టకపోగా.. నేను నా భార్య గొంతు తప్ప ఏదీ గుర్తుపట్టలేను అంటూ జోకులు వేస్తాడు. ఇక ఆ గేమ్‌లో అంతా ఓడిపోగా.. రఘురాం మాత్రం సీత బంధానికి నిదర్శనంగా ఈ గేమ్‌ గెలుస్తాను అంటూ చెప్పి మరీ గెలుస్తాడు. సీత పెట్టుకునే ఉంగరాన్ని పట్టుకుని.. ఇది నా సీతదే అనడంతో సీత సంతోషానికి అవధులే ఉండవు.

ఇక అంతా కూర్చుని.. మరో గేమ్‌ స్టార్ట్‌ చేసే ముందు.. నానీకి పాలు తాగడం చూసి భరత్‌.. ‘అరే నానీ.. పాలు తాగుతున్నావా.. అనవసరం మేమంతా ఇక్కడి దాకా రావడం అనవసరం.. అసలు ఎంత పని చేశావ్‌ నానీ..‘అంటూ ఆటపట్టిస్తూ నానీని భయపెడతాడు. నానీ తింగరి చూపులు చూస్తూ ఉంటే.. ‘జరగదు ఈ శోభనం జరగదు.. నానీగాడు పాలు తాగుతున్నాడు. దాంతో మత్తు వస్తుంది. మత్తు వస్తే నిద్రపోతాడు‘ అంటూ బాగా ఆటపట్టిస్తాడు. నానీ గారంగా..‘అన్నయ్యా.. నన్నే ఏడిపిస్తావా’ అంటాడు. అంతా కామెడీగా సాగుతుంది. అయితే అదంతా చూసి కిరణ్‌ రగిలిపోతాడు.

కమింగ్‌ అప్‌లో..

మొత్తానికి గత రెండు రోజులుగా అల్లాడిస్తున్న దమయంతి ప్లాన్‌.. కథను ఉత్కంఠగా మార్చింది. నానీ తాగబోయే జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపేస్తుంది. ఇక భరత్‌ ఊహించినట్లే ఈ శోభనం జరిగేలా లేదు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.