యాప్నగరం

Jabardasth Mahesh: జనసేన పార్టీ టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: కమెడియన్ మహేష్ కేరాఫ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

Jabardasth Comedian Mahesh: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. ఈ మధ్య జనసేన పార్టీలో బాగా యాక్టివ్ అయ్యారు. పార్టీ మీటింగ్‌లతో చురుకుగా పాల్గొంటూ తన స్పీచ్‌లతో జనసైనికుల్లో ఉత్సాహం నింపుతున్నారు. దీంతో ఆదికి ఎమ్మెల్యే టికెట్ గ్యారంటీ అని.. అసెంబ్లీలో అధ్యక్షా అనడం గ్యారంటీ అని జనసైనికులు ముచ్చటించుకున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి మరో కమెడియన్ వచ్చాడు. అతనే రంగస్థలం మహేష్.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 5 May 2023, 3:17 pm
డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకర గుప్తం వాసి అయిన కమెడియన్ మహేష్.. జబర్దస్త్ కామడీ షోతో పాపులర్ అయ్యారు. అనంతరం ‘రంగస్థలం’ సినిమాతో రంగస్థలం మహేష్‌గా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలో దూకుడుమీదున్న రంగస్థలం మహేష్.. జనసేన అధినేత, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో నటించే అవకాశం వచ్చినా.. స్క్రీన్‌పై కనిపించలేకపోయానని చెప్పిన మహేష్.. పవర్ స్టార్ గురించి గొప్పగా చెప్తూ.. జనసేన పార్టీ టికెట్ ఇస్తే.. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అంటున్నాడు.
Samayam Telugu rangasthalam mahesh interview
రంగస్థలం మహేష్


తాజా ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ గారిది చాలా గొప్ప వ్యక్తిత్వం.. ఆయనతో సర్దార్ గబ్బర్ సింగ్ చేసేటప్పుడు.. ఆయన ఏది తింటే అదే సెట్‌లో ఉన్న వాళ్లందరికీ పెట్టించేవారు. చిన్న బాయ్ నుంచి ప్రొడ్యుసర్‌ వరకూ రాగి సంగటి, తలకాయ కూర, ఫ్రూట్స్ అందరికీ పెట్టించేవారు. ఆ సినిమాకి 20-25 రోజులు షూటింగ్ చేశా కానీ.. ఎక్కడా కనిపించను.

ఓ రోజు అలీ అన్న నన్ను తీసుకుని వెళ్లి పరిచయం చేశారు. అలా కాటమరాయుడు సినిమాలో ఛాన్స్ వచ్చింది. కుంటోడిగా నటించాను. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్‌ గారికి టీ ఇచ్చే సీన్ చేయించారు. కళ్యాణ్ బాబుగారితో చేస్తున్నానని ఊర్లో వాళ్లందరికీ చెప్పేశాను. మా ఊరు వాళ్లంతా సినిమా చూసి.. కళ్యాణ్ బాబు గారికి నువ్వు ఇచ్చిన టీ ఉంది కానీ.. నువ్వు లేవురా అన్నారు. నాకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. ఆ సీన్‌లో నేను కనిపించలేదు. ఆ సీన్ కోసం 25 రోజులు చేశాను.

బాబీ గారు నాకు చెప్పింది ఏంటంటే.. ఓ ఇద్దరు అమ్మాయిలు ఉంటారు.. వాళ్లిద్దరికీ నువ్ లైన్ వేస్తుంటావ్.. కానీ వాళ్లిద్దరూ పవన్ కళ్యాణ్‌గారికి లైన్ వేస్తారు. ఓసారి నువ్వు పవన్ కళ్యాణ్ గారికి టీ తీసుకుని వెళ్లి.. ‘వాళ్లు పెద్దమనిషి అయినప్పటి నుంచి లైన్ వేస్తున్నాను.. కానీ వాళ్లు మీకు లైన్ వేస్తున్నారు.. మీకు నాకు తేడా ఏంటని అడుగుతావ్.. అదే సీన్’ అని చెప్పారు. కానీ ఆ సీన్ సినిమాలో లేచిపోయింది. ఆ సీన్ పడి ఉంటే.. అప్పుడే బ్రేక్ వచ్చేది. కానీ రంగస్థలంలో రామ్ చరణ్ గారితో బ్రేక్ రావాలని రాసిపెట్టి ఉంది.

మాది ఈస్ట్ గోదావరి.. శంఖరగుప్తం. ఈస్ట్ వెస్ట్‌లలో పవన్ కళ్యాణ్‌ని చాలా ప్రేమిస్తారు. నేను మా ఊరి వెళ్లినప్పుడు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. జనసేన కోసం కుర్రాళ్లు చాలా కష్టపడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారిని చూడాలి.. ఒక్కసారి కలిసేట్టు చేయమని అడుగుతుంటారు.

జనసేన పార్టీ తరుపున పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా.. ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినా అంతా దేవుడి దయ. నాకు ఇప్పుడు ఇంట్రస్ట్ అంతా సినిమాలపైనే ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు జబర్దస్త్ మహేష్.
View this post on Instagram A post shared by Mahesh Achanta (@mahesh_achanta)

Read Also: ‘నాగ పంచమి’ మే 05 ఎపిసోడ్: సాంబయ్యని హడలెత్తించిన పంచమి తల్లి.. సర్వనాశనం చేస్తా..
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.