యాప్నగరం

Jaffar Babu: TV 9కి నా అవసరం లేదట.. బంధం తెగింది: జాఫర్ ఎమోషనల్ వీడియో

రవి ప్రకాష్ తరువాత టీవీ 9లో మరో బిగ్ వికెట్ పడింది. ముఖాముఖి కార్యక్రమంతో పాపులర్ అయిన సీనియర్ జర్నలిస్ట్ జాఫర్ టీవీ 9 నుండి బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా తాను ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారాయన.

Samayam Telugu 1 Oct 2019, 3:33 pm
‘ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం నా పేరు జాఫర్’ అంటూ 175 మంది రాజకీయ, సినీ ప్రముఖులను చిక్కుప్రశ్నలతో ముచ్చెమటలు పట్టించేవారు జాఫర్. తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేసి పాపులర్ అయిన టీవీ 9 జాఫర్‌‌కి ఆ ఛానల్‌తో రుణం తీరిపోయింది. ఇక ముఖాముఖి కార్యక్రమానికే కాదు.. టీవీ 9కి గుడ్ బై చెప్పేశారాయన. ఇటీవల TV9 నుండి సీఈవీ రవిప్రకాష్‌ని బయటకు పంపేయగా.. తాజాగా ఇన్ పుట్ ఎడిటర్ స్థాయిలో ఉన్న జాఫర్‌ బయటకు రావడం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
Samayam Telugu mukha mukhi tv9 jaffer
జాఫర్


ఇటీవల బిగ్ బాస్ రియాలిటీ షోలో సైతం పార్టిసిపేట్ చేసిన ఎలిమినేట్ అయ్యారు జాఫర్. అనంతరం టీవీ 9లో యాధావిధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే తాను టీవీ 9 నుండి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? తరువాత ఏం చేయబోతున్నారు? లాంటి విషయాలపై వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో వీడియోను రిలీజ్ చేశారు జాఫర్. ‘నా పేరు జాఫర్ ఇది ముఖాముఖి స్వాగతం కాదు.. మీతోనే నా ముఖాముఖి. టీవీ 9 తో నాకు బంధం తెగింది. టీవీ 9 వారికి నేను అవసరం లేదనిపించింది. ఇకపై టీవీ9లో జాఫర్ ముఖాముఖి కనిపించదు. ఈ సందర్భంగా టీవీ 9తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను’ అంటూ 12 నిమిషాల నిడివితో వీడియోను రూపొందించారు జాఫర్. ఆయనేమన్నారో ఈ వీడియోలో చూద్దాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.