యాప్నగరం

Guppedantha Manasu అక్టోబర్ 12 ఎపిసోడ్:రిషికి వసు సూటి ప్రశ్న.. ‘మీ జ్ఞాపకాల్లో నేను ఉన్నానా సార్’

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 అక్టోబర్ 12)న 266 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Guppedantha Manasu october 12 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 12 Oct 2021, 8:51 am
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 అక్టోబర్ 12)న 266 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.
Samayam Telugu ‘గుప్పెడంత మనసు’ అక్టోబర్ 12 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Guppedantha Manasu october 12 episode


266వ ఎపిసోడ్‌ హైలైట్స్..
వసుని రెస్టారెంట్‌ దగ్గరే డ్రాప్ చేసిన జగతి.. లోపలకి వచ్చి కాఫీ తాగి వెళ్లండి మేడమ్ అన్నా వద్దని చెప్పి వెళ్లిపోతుంది. దాంతో వసు మనసులో.. ‘మేడమ్ మూడ్ బాలేదు’ అనుకుంటుంది. ఇక రిషి కారు తీసుకుని వెళ్తూ వెళ్తూ.. మహేంద్ర పిలవడంతో ఆగిన రిషి.. మహేంద్రకు సారీ చెబుతాడు. ‘డాడ్ నా ప్రవర్తన మిమ్మల్ని బాధపెట్టిందా? అనుకుంటూనే ఉంటాను బాధపెట్టకూడదు అని.. కానీ.. అనుకోకుండా అలా.. డాడ్ మీకు నా మీద కోపంగా ఉందా?’అంటూ జగతికి దూరంగా ఉండే ప్రయత్నంలో వసుని లాగిన సీన్ గుర్తుచేసుకుంటాడు. దాంతో మహేంద్ర.. నవ్వుతూ అదేం లేదు రిషి.. అంటాడు. మనసులో మాత్రం.. ‘కన్నతల్లిని బాధపెట్టి నాకు సారీ చెబుతున్నాడు.. ఈ రిషినీ ఎలా అర్థం చేసుకోవాలో’ అనుకుంటాడు.

మరోవైపు రిషి వసుని రెస్టారెంట్‌లో కలుస్తాడు. కాఫీతో పాటు కంపెనీ కావాలి.. బయటికి వెళ్దాం అంటాడు. దాంతో వసు ఓనర్‌ని పర్మీషన్ అడిగి.. రిషితో పాటు బయటికి వెళ్తుంది. ఓ చల్లని వాతావరణంలో ఆ చుట్టు ఉన్న అందమైన ప్లేస్ చూసి వసు పొంగిపోతుంది. ‘మనసుకి చాలా సంతోషంగాఉంది’ అంటుంది రిషితో.. అయితే రిషి వసు చలికి కాస్త వణకడం గమనించి.. కారులోని శాలువా తీసి వసుకి కప్పుతాడు. ఇది నువ్వే ఉంచుకో అంటాడు. అయితే దాన్ని జగతి మీద కోపంతో విసిరికొట్టిన తర్వాత దాన్ని రిషీ తిరిగి తీసుకునేలా చేసిన సీన్ అంతా వసుకి గుర్తొచ్చి.. ‘సార్ ఇది వాళ్ల మీద కోపంతో నాకు ఇస్తున్నారా’ అంటుంది. దాంతో ‘లేదు వసుధరా నీకు నేను ఎప్పటి నుంచో ఒక గిఫ్ట్ కొనివ్వాలని అనుకున్నాను.. కానీ మా డాడ్, మా పెదనాన్న నాకు కప్పిన శాలువా కంటే గొప్ప గిఫ్ట్ మరొకటి ఉండదు అనిపించింది.. దీన్ని నీకు మనస్పూర్తిగా అందిస్తున్నాను..’ అంటాడు. దాంతో వసు మనసులోనే.. రిషి వ్యక్తిత్వాన్ని గొప్పగా పొగుడుకుంటుంది. మీలో జగతి మేడమ్‌ని దూరం పెట్టే ఆ ఒక్క లోపం తప్పా.. మీరు సూపర్ సార్’ అనుకుంటుంది.

ఇక తిరిగి ప్రయాణం అయిన రిషి, వసుల కారుకి ఓ పెళ్లి బృందం అడ్డు పడుతుంది. డాన్స్‌లు, ఓరేగింపుతో వస్తున్న ఆ బృందానికి రిషి విసుగ్గా హారన్ కొడతాడు తప్పుకోమని. అయితే వాళ్లు తప్పుకోరు సరికదా.. ‘5 నిమిషాలు ఆగు’ అంటాడు ఒకడు వచ్చి.. దాంతో రిషి మరింత ఫైర్ అవుతాడు. అయితే వసు రిషిని కూల్ చేస్తుంది. క్షమించడం నేర్చుకోవాలి సార్.. వారి సంతోషాన్ని మనం కూడా పంచుకోవాలి అంటూ కిందకు దిగి వెళ్లి.. రిషి కారులో ఉన్న బొకే తీసుకుని వెళ్లి.. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి ఇచ్చి కంగ్రాట్స్ చెబుతుంది. అక్కడే ఉండి.. డాన్స్ చేస్తున్న వాళ్లతో కలిసి డాన్స్ చేస్తుంది. తీన్మార్ స్టెప్స్ వేస్తుంది. అంతా చూసి రిషి షాక్ అవుతాడు. కిందకు దిగి చూస్తుంటాడు.

కమింగ్ అప్‌లో..
మిస్టర్ ఇగో కూడా తీన్మార్ స్టెప్స్ ఇరగదీస్తాడు. అయితే కారు ఎక్కి తిరిగి వెళ్తున్నప్పుడు వసుతో రిషి.. ‘ఏంటి నువ్వు? ఎక్కడికి వెళ్లినా కొత్తా పాతా అని తేడా లేకుండా కలిపేసుకుంటావ్.. కొన్ని జ్ఞాపకాలు పోగేసుకుంటావ్..’ అంటూ మాట్లాడుతుంటే.. వసు కొంటెగా చూస్తూ.. సూటిగా ఒకే ఒక్క ప్రశ్న వేస్తుంది. రిషి గుండె జల్లుమంటుంది. ‘మీ జ్ఞాపకాల్లో నేను ఉన్నానా సార్’ అని వసు అడుగుతుంది. మరి ఏం సమాధానం చెబుతాడో చూడాలి. (రిషికి జ్ఞాపకాల్లో ఏంటీ వసు.. ఎదురుగానే కనిపిస్తూ ఉంటావ్.. కానీ చెప్పడు మన ఇగో మాస్టర్). ఇక సీన్ కట్ చేస్తే.. మహేంద్ర కొంటెగా అంతా తెలిసినట్లుగా తీన్మార్ స్టెప్స్ గురించి అగుతున్నాడు రిషిని. ఇక వసునే చెప్పిందనే పాయింట్ తీసుకుంటాడో ఏమో. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.