యాప్నగరం

Karthika Deepam Serial ట్విస్ట్: మోనిత, కార్తీక్‌ల మధ్య నిజంగానే శారీరక సంబంధం.. చావుబతుకుల మధ్య బయటపడిన నిజం

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 అక్టోబర్ 26)న 1180 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే రాబోయే ట్విస్ట్ అదిరిపోయింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 26 Oct 2021, 10:05 am
‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021అక్టోబర్ 26)న 1180 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే నేటి కథనం చాలా ఉత్కంఠగా సాగింది. మోనిత పట్టుదల ఓ వైపు.. హిమ పట్టువిడుపు మరోవైపు.. కథను ఆసక్తిగా మార్చాయి. సౌందర్య, కార్తీక్ దీపని మోసం చేసే సీన్ మాత్రం కాస్త అభిమానులకు కష్టంగా ఉన్నప్పటికీ మరో ట్విస్ట్ కథను షేక్ చేయనుంది. ఈ క్రమంలో నేటి కథనం మిస్ అయ్యి ఉంటే.. ఈ కింద లింక్ క్లిక్ చేయండి.
Samayam Telugu ‘కార్తీకదీపం’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam serial promo


ప్రోమో హైలైట్స్..
దీప ఆవేశంగా ఓ హాస్పెటల్‌కి వెళ్లి గొడవకు దిగుతుంది. ఆ హాస్పెటల్ కార్తీక్ శాంపిల్స్ ఇచ్చిన హాస్పెటల్ అది. ‘అసలు నువ్వు మనిషివేనా?’ అంటూ గట్టిగానే నిలదీస్తుంది దీప ఓ డాక్టర్‌ని. ‘ఏంటి మేడమ్ ఏం మాట్లాడుతున్నారు?’ అంటుంది ఆమె. ‘నా భర్త కార్తీక్.. టెస్ట్ కోసం తన శాంపిల్ నీకు ఇస్తే.. దాన్ని నువ్వు డాక్టర్ మోనితకి దొంగచాటుగా ఇవ్వలేదా?’ అంటుంది దీప కోపంగా.. ‘ఆ శాంపిల్స్‌ని మేము ఎవరికీ ఇవ్వలేదు.. అలాంటి శాంపిల్స్ కోటి రూపాయలు ఇచ్చినా ఎవరికీ ఇవ్వం మేడమ్..’ అంటుంది ఆమె. దాంతో దీప షాక్ అయిపోతుంది. మొత్తానికీ శాంపిల్స్ కారణంగా మోనితకి గర్భవతి కాలేదని దీపకు అర్థమైపోయింది. మరి ఎలా వచ్చింది? అనేది ప్రశ్నర్థకంగా ఉన్న సమయంలో రేపటి ప్రోమోలోనే మరో నిజం ప్రేక్షకులకు ట్విస్ట్‌ ఇచ్చింది.

మోనిత హాస్పెటల్ బెడ్ మీద నొప్పులు పడుతూ చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతూ ఉండగా.. కార్తీక్, సౌందర్యలు అక్కడికి వెళ్తారు. అక్కడే మోనిత నొప్పులు పడుతూనే మరో నిజాన్ని రివీల్ చేస్తుంది. భారతి, కార్తీక్, సౌందర్య ముగ్గురు వింటూ ఉండగా.. ‘కార్తీక్ నేను చచ్చిపోయేలోగా ఒక నిజం చెప్పి చావాలి.. ఇది ఆర్టిఫిషియల్ ఇన్స్‌మినేషన్ గర్భం కాదు.. ఈ బిడ్డ మన బిడ్డ..సహజంగా పుట్టబోయే బిడ్డ..’ అంటుంది. కార్తీక్, సౌందర్య షాక్ అయిపోతారు. ఇదే విషయం దీపకు తెలిస్తే.. రచ్చ మామూలుగా ఉండదు. పైగా కార్తీక్ మోనితకు భర్తగా సంతకం పెట్టడానికి వెళ్లాడనే విషయం తెలిసినా దీప ఒక్క క్షణం కూడా అత్తింట్లో ఉండదు. చూడాల్సిందే ఏం జరుగుతుందో.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.