యాప్నగరం

ముక్కు మూసుకుని తినాల్సిన దౌర్భాగ్యం.. కన్నీళ్లు పెట్టించిన నూకరాజు

కామెడీ చేసి నవ్వించడం.. నాలుగు పంచ్‌లు వేసి వినోదాన్ని పంచడం మాత్రమే కాదు.. గుండెల్ని మెలిపెట్టే హావభావాలతో అందర్నీ ఏడిపించడం కూడా తనకు సాధ్యమే అని చూపించాడు కమెడియన్ నూకరాజు.

Samayam Telugu 8 Jun 2021, 11:49 pm
ప్రతిరోజు బతుకుతో పోరాటం.. ప్రాణాలతో చెలగాటం.. ప్రపంచం మొత్తానికి హాలిడే ఉన్నా వాళ్లకి మాత్రం రన్నింగ్ డేనే. వాళ్లు ఒక్కరోజు రెస్ట్ అంటే మన బతుకు కంపు కంపే.. కరోనా లేదు లాక్ డౌన్‌లో ప్రపంచం మొత్తం భయపడి ఇంట్లో నుంచి కదలకున్నా.. వాళ్లు మాత్రం రోడ్లు బాట పట్టాల్సిందే.. వాళ్లే పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ల బతుకు పోరాటాన్ని జీవన విధానాన్ని కళ్లకు కట్టాడు కమెడియన్ నూకరాజు.
Samayam Telugu కమెడియన్ నూకరాజు
Comedian Nookaraju


ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఇందులో పారిశుద్ధ్య కార్మికుడిగా కనిపించి కళ్లు చెమ్మగిల్లేలా చేశాడు నూకరాజు.

అమ్మా నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందమ్మా.. అది మున్సిపాలిటీ జాబ్ అమ్మా అని చెప్పి వాళ్లు పడే వ్యధని కళ్లకి కట్టాడు. డ్రైనేజ్‌లోకి దిగి చెత్తని తీయడం.. ముక్కు మూసుకుని అన్నంతినే సీన్‌లో నూకరాజు జీవించేశాడు. నేను పక్కన ఉంటేనే ఆ కంపు భరించలేకపోతున్నారే.. నేను రోజుకి 12 గంటలు అదే కంపులో ఉండాలి అంటూ భావోద్వేగంతో చెప్పే డైలాగ్ కళ్లు చెమ్మగిల్లేట్టు చేసింది. ఆ ప్రోమో మీకోసం.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.