యాప్నగరం

Visakhapatnam: విశాఖకే నా మద్దతు.. రంగంలోకి దిగిన యాంకర్ రష్మి

విశాఖవాసిగా ఇది మన అందరి బాధ్యత. ఒక్కసారి విశాఖ వాసి అయితే జీవితాంతం అలాగే ఉండాలని అనుకుంటారు. నా మద్దతు విశాఖపట్నానికే మీరు కూడా విశాఖకే మద్దతు ప్రకటించాలని కోరారు యాంకర్ రష్మి.

Samayam Telugu 30 Jan 2020, 8:32 pm
అసలే ఒకవైపు అమరావతి ప్రాంత ప్రజలు రాజధాని ఇక్కడే ఉంచాలని నిరసన సెగలు రాజేస్తుంటే.. మరోవైపు వైజాగ్‌లోనే రాజధాని నిర్మించాలంటూ అక్కడి ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఈ తరుణంలో యాంకర్ రష్మి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే రష్మి పెట్టిన పోస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినది కాదు.. కేంద్రం నిర్వహిస్తోన్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో విశాఖపట్టణాన్ని నెంబర్ వన్‌గా నిలిపాలని రంగంలోకి దిగింది యాంకర్ రష్మి.
Samayam Telugu rashmi on swachh survekshan
రష్మి గౌతమ్


తన సొంత ఊరిపై ఉన్న మమకారాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది యాంకర్ రష్మి. ఈ సందర్భంగా ‘ఒకసారి విశాఖవాసి అయితే.. ఎప్పటికీ విశాఖవాసిగానే ఉంటారు.. ఇందులో ఎలాంటి సందేహంలేదు.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వైజాగే తన సొంత ఇళ్లని తెలియజేస్తూ’ ఓ వీడియోను పోస్ట్ చేసింది యాంకర్ రష్మి.

‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2020‌లో మన వైజాగ్ కూడా ఉంది. వైజాగ్ నివాసిగా ఈ పోటీల్లో విశాఖపట్టణాన్ని నెంబర్ వన్‌గా నిలపడం మన బాధ్యత. విశాఖపట్నానికే నా ఓటు.. మీరు కూడా విశాఖపట్నానికి మద్దతు తెలపాలని’ కోరింది రష్మి. కాగా ఈ పోటీలో దేశవ్యాప్తంగా 4370 సుందర నగరాలు పోటీ పడుతున్నాయి. ఈ నగరాలకు సంబంధించిన ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఫేస్‌బుక్‌, ట్విటర్, స్వచ్ఛతా యాప్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ఓటు చేయవచ్చు. జనవరి 4 నుంచి ప్రారంభమైన ఈ లీగ్ పోటీ జనవరి 31 వరకు కొనసాగనుంది. సో.. ఇంకెందుకు ఆలస్యం మన వైజాగ్‌ను దేశంలోనే సుందర నగరంగా గుర్తించేలా స్వచ్ఛ సర్వేక్షణ్ 2020‌లో నంబర్ వన్‌గా నిలిపేందుకు మద్దతు ప్రకటించండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.