Tollywood Controversy Choreographer Rakesh Master Reveals Secrets Of Rashmi Gautam
‘యాంకర్ రష్మిని ఆ నిర్మాత ఇబ్బంది పెట్టాడు.. అనసూయ, ఉదయభానులైతే’.. యాంకర్స్‌పై షాకింగ్ కామెంట్స్
చిరంజీవి మొదలు బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీరియర్ హీరోలతో పాటు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్.. ఇలా స్టార్ హీరోలందరూ అయిపోయారు. ఇండస్ట్రీలో ఉన్న పాపులర్ సెలబ్రిటీలతో పాటు సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా హీరోయిన్స్ అందరిపైనా సంచలన కామెంట్స్ చేశారు.. ఇప్పుడు యాంకర్స్ వైపు టర్న్ తీసుకున్నారు ఈ వివాదాస్పద కొరియోగ్రాఫర్.
Samayam Telugu21 Apr 2020, 10:50 am
తెలుగులో ఒకప్పుడు యాంకర్ ఉదయభాను హవా నడిచింది. ఆమెతో పాటు ఝాన్సీ, సుమలు కూడా పాపులర్ యాంకర్స్ అయ్యారు. ఇక సుమ ఇప్పటికీ టాప్ యాంకర్‌గానే కొనసాగుతుండగా.. జబర్దస్త్ యాంకర్స్ అనసూయ, రష్మిలకు ఉన్న క్రేజ్ వేరు. యాంకరింగ్‌కి హాట్ నెస్ జోడించి జబర్దస్త్‌గా ఎంటర్టైన్ చేయడం వీళ్ల టాలెంట్. కాగా నాటి నుంచి నేటి వరకూ ఉన్న యాంకర్స్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు రాకేష్ మాస్టర్. ‘మార్పుచెందిన వాడే మనిషి అనే కార్యక్రమం ద్వారా సంచలన కామెంట్స్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నారు వివాదాస్పద కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. గత కొంతకాలంగా స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, ఇలా ఇండస్ట్రీలో ఉన్న అందరి ప్రముఖుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్శికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన రాకేష్ మాస్టర్.. అందరి వంతు అయిపోవడంతో ఇప్పుడు తెలుగు యాంకర్స్ వైపు టర్న్ తీసుకున్నారు.
ఉదయభానుకి డాన్స్ నేర్పించా.. ఆమె నా బిడ్డతో సమానం
తెలుగులో పాపులర్ యాంకర్స్‌గా ఉన్న సుమ, అనసూయ, రష్మి, ఉదయభాను, ఝాన్సీలపై షాకింగ్ కామెంట్స్ చేశారు రాకేష్ మాస్టర్. ఎథిక్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ.. ‘తెలుగులో ఉన్న యాంకర్స్ గురించి చెప్పాలంటే.. మొదటిగా నేను ఉదయభానుతో కలిసి ఢీ 1, ఢీ2లలో పనిచేశాను. మేం ఇద్దర మధ్య తండ్రికూతుళ్ల బంధం ఉంది. అప్పటికీ ఇప్పటికీ ఆమెను నేను నా బిడ్డ అనే సంభోదిస్తూ వచ్చాను. అది నా బాధ్యత. ఉదయభానుకు నేను బాబాయ్ లాంటి వ్యక్తిని. ఉదయభాను చిన్నప్పుడు నా దగ్గర డాన్స్ నేర్చుకుంది. ఎల్లారెడ్డి గూడెంలో ఉన్నప్పుడు ముక్కురాజు మాస్టారుతో పాటు రాకేష్ మాస్టర్ దగ్గర కూడా డాన్స్ నేర్చుకుంది. అప్పుడు నా పేరు రామారావు. ఆ తరువాత రాకేష్‌గా పేరు మార్చుకున్నా. అప్పట్లో జానీ అనే కుర్రాడిని డాన్స్ నేర్పించడానికి పంపించేవాడిని. నేను క్లాస్‌లు చెప్పడానికి ఎల్లారెడ్డి గూడెంలో వాళ్ల ఇంటికి వెళ్లేవాడిని.
నాకు భోజనం లేకపోతే ఉదయభాను అమ్మగారు నాకు బియ్యం ఇచ్చేవారు..
ఉదయభాను అమ్మగారు నాకు భోజనం కూడా లేదని తెలుసుకుని బియ్యం కూడా ఇచ్చేవారు. ఆ టైంలో ఉదయభాను అమ్మగారు బాగా చూశారు. అలా ఉదయభానుకి డాన్స్ నేర్పించా. అయితే ఆమెకు నేను గురువుని అని గుర్తులేదు కాని ఢీ ప్రోగ్రామ్‌లో ఆమెకు చెప్తే.. ఆయనేనే మీరు అని గుర్తించింది. ఆ తరువాత రామ్ లక్ష్మణ్ సినిమాలో ఉదయభాను హీరోయిన్గా చేసినప్పుడు నేను ఒక సాంగ్ చేశాను. అప్పుడు వాళ్లు మా ఇంటికి వచ్చారు. ఫిల్మ్ నగర్లో నేను పెద్ద ఇళ్లును అద్దెకు తీసుకుంటే.. ఆ హౌస్‌లోనే ఆ సాంగ్ షూట్ చేశాం. అలా అలా ఉదయభాను ఫ్యామిలీతో మంచి అనుబంధం ఏర్పటింది. దేవుడు ఇచ్చిన బాబాయిగా ఉదయభాను వాళ్ల అమ్మగారిని వదినమ్మ అని పిలిచేవాడిని. ఇప్పటికీ నన్ను ఉదయభాను సొంత బాబాయ్ లాగే చూస్తుంది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటా.. ఎలా ఉన్నావ్ తల్లీ అని పలకరిస్తా. దేవుడు ఇచ్చిన మంచి బిడ్డ ఉదయభాను.
శేఖర్, నేను వెళ్తుంటే ఆటో ప్రమాదం.. అప్పుడే సుమ పరిచయం
నాకు యాంకర్ ఝాన్సీతో పరిచయం లేదు. సుమతో పరిచయం ఎలా అయ్యింది అంటే.. పంజాగుట్ట వైపు ఉన్న శారధి స్టుడియోలో ఓ కార్యక్రమానికి నేను శేఖర్ మాస్టర్ వెళ్లాల్సి వచ్చింది. మేం వెళ్తున్న ఆటో అప్పుడు పల్టీ కొట్టింది. అయితే ఇద్దరం ఆటోలో ఇరుక్కుపోయాం కాని.. పెద్దగా దెబ్బలు తగల్లేదు. తరువాత మేం వేరే ఆటోలో ఆ కార్యక్రమానికి వెళ్లగా.. అక్కడ సుమ యాంకర్‌గా పరిచయం అయ్యారు. ఇక రాజీవ్ కనకాల వైఫ్ అని తరువాత తెలిసింది. సుమది మంచి మనస్తత్వం. ఎవరితోనూ గొడవపడే తత్వం కాదు. ఆమెతో పరిచయం ఉన్నది తక్కువే అయినా మంచిగా గౌరవిస్తుంది.
రష్మిని ఆ దర్శక నిర్మాతలు ఇబ్బంది పెట్టారు..
ఇక యాంకర్ రష్మి విషయానికి వస్తే.. ఈ అమ్మాయి ‘థాంక్స్’ అనే సినిమాకి హీరోయిన్గా చేసింది. ఆ సినిమాలో ఆకాష్ హీరో. ఆ సినిమా టైంలో రష్మి చాలా ఇబ్బందులు పడింది. ఆ సినిమా డైరెక్టర్, నిర్మాతతో ఇబ్బందులు ఎదుర్కొంది. ఎందుకు వచ్చాం రా బాబూ ఈ ఇండస్ట్రీకి అని ఆ అమ్మాయి బాధ పడింది. ఓరోజు నైట్ షూటింగ్ చేస్తున్నాం. రష్మి, ఆకాష్ మీద సీన్లు చేస్తున్నారు.. అప్పుడు రష్మితో పరిచయం అయ్యింది. ఇక ఢీ జోడీలో కలిసి పనిచేశాం. అయితే ఆమె గురించి నేను ఢీ జోడీలో చెప్పిన విషయాలను కట్ చేసి.. లేనిపోనివి పెడతారు. నా మాటలు ఉంచితే ప్రోగ్రామ్‌కి డ్యామేజ్ అనుకుంటారో ఏమో కాని నేను అన్న మాటల్ని తీసేశారు.
ఆ విషయంలో బాధ కలిగింది.. తరువాత రష్మితో మాట్లాడటం మానేశా..
అయితే ఢీలో కూడా నేను రష్మిని ఏమీ అనలేదు. ఎప్పుడూ అమ్మా అని పిలిచేవాడిని. థాంక్స్ సినిమాకి నువ్ నాకు పరిచయం అని చెప్పితే వాళ్ల ఇమేజ్ పోతుందనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు. ఇలాంటి వాటిని నేను చెప్పకూడదని నాకు తెలియదు. ఆ విషయాన్ని ఢీలో చెప్పినప్పటికీ.. ఎడిట్ చేసేశారు. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. ప్రజలకు వాస్తవాలు చెబితే.. వాటిని తేసేసి బాల్స్ పడటం, లవ్ సింబల్స్ లాంటివి మాత్రమే చూపిస్తారు. ఈ డబ్బా కొట్టుకోవడం విషయాలు మనకు ఎందుకులే అనుకుని తరువాత రష్మితో మాట్లాడలేదు. Read also: నేను జూనియర్ సమంతాని.. నువ్వు జూనియర్ షకీలానా? నరికేస్తా..: అషు రెడ్డి
అనసూయ.. ఆమె ఎవరో నాకు తెలియదు
ఈ అమ్మాయి.. అనుష్కనో అనసూయనో ఎవరూ నాకు పెద్దగా తెలియదు. ఆమె కూడా నా దగ్గర డాన్స్ నేర్చుకుంది. జబర్దస్త్‌లో చూసినప్పుడు ఆ బిడ్డ కనిపించింది. యాంకర్ ఝాన్సీ మాదిరే ఈమెతో కూడా నాకు పెద్దగా పరిచయం లేదు’ యాంకర్స్‌తో ఉన్న పరిచయాలను అప్పట్లో జరిగిన విషయాలను చెప్పుకొచ్చారు రాకేష్ మాస్టర్. అయితే యాంకర్ రష్మిని ఇబ్బంది పెట్టిన ఆ దర్శక నిర్మాతలు ఎవరు? అసలు ఈ సినిమా ఎందుకు రిలీజ్ కాలేదు? ఆ విషయాలను మాత్రం సీక్రెట్‌గానే ఉంచారు రాకేష్ మాస్టర్.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.